Monday, 20 November 2017

battayi

పండులో ఫ్లావనాయిఢ్స్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ బి- కాంప్లెక్స్‌, విటమిన్‌- సి సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటు నివారణకు ఈ పండు మంచిది. గుండెకు బలాన్ని ఇస్తుంది. బత్తాయి రసంలో తేనె కలిపి పడుకునే ముందు తీసుకుంటే సుఖవిరేచనం అవుతుంది. బత్తాయి రసాన్ని రోజూ తీసుకుంటే మచ్చల్ని మాయం చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేసేలా గ్రంధుల్ని ప్రేరేపించే గుణాలు బత్తాయిలో ఉన్నాయి. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాలను బయటికి వెళ్లిపోయేలా చేస్తాయి.
 
బత్తాయి రసం ఊపిరి తిత్తులను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లకు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కామెర్ల వ్యాధినుంచి కోలుకున్న వారిలో ఉండే బలహీన తను నీరసాన్ని పోగొట్టడంలో బత్తాయి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, ర క్త ప్రసరణ చక్కబడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
ఉదయం వేళ యోగా, వాకింగ్‌, జాగింగ్‌ చేసిన తర్వాత ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే, అలసిన శరీరం వెంటనే శక్తివంతమవుతుంది. ఎసిడిటీకి కారణమయ్యే బుడగలను నివారించడం లో బత్తాయి రసం ఉపకరిస్తుంది. రుమాటిక్‌ తరహా వాపు సంబంధిత రుగ్మతలనుంచి బత్తాయి ఉపశమనం కలిగిస్తుంది.

Friday, 10 November 2017

capsicum

బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కు గా లభిస్తుంది. రకరకాల రంగుల్లో సైతం లభ్యమవుతుంది. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకు పచ్చవే. ఒక రోజుకు కావాల్సిన సి విటమిన్‌ ఒక్క క్యాప్సికంలోనే దొరుకుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం... క్యాప్సికంలో విటమిన్‌ సి, బి, ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంన్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌, బీటా కెరోటిన్‌, ఎంజైమ్స్‌ శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్‌ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాప్సికం తీసుకోవడం మూలంగా జుట్టు ఊడి పోవడం తగ్గుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారినిగా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలున్న క్యాప్సికాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనకు అందబాటులో దొరికే క్యాప్సికం వాడేందుకు ఎందుకింక ఆలస్యం.. రోజు వారి కూరగాయల్లో ఒక రోజు క్యాప్సికాన్ని కూడా చేర్చుకుందాం.

Thursday, 9 November 2017

Almonds

బాదంపప్పు అనగానే..ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటాం. అయితే ఆల్‌మండ్‌లో ఉండే ఫ్యాట్‌ శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అడపాదడపా బాదాంపప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. బాదంతో కలిగే లాభాలు..
బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ సెల్స్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ కారక కణాలను నిలువరిస్తాయి.
బాదంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్‌-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.         బీపీని అదుపులో ఉంచుతుంది.
శరీర బరువు తగ్గించడంలోనూ  క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం                       అవుతుంది.
బాదంలో సమృద్ధిగా ఉండే కాపర్‌, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.
        రోజూ కొన్ని పప్పుల్ని తినడం వల్ల ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.

Wednesday, 1 November 2017

aakrotlu (wall nuts)

రోజుకో గుప్పెడు అక్రోట్లు(వాల్‌నట్స్‌) తీసుకుంటే వ్యాధులు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఎయిమ్స్‌ మాజీ చీఫ్‌ డైటీషియన్‌ డాక్టర్‌ రేఖాశర్మ మాట్లాడుతూ పోషకాహార లోపం, శారీరక వ్యాయామం చేయకపోవడంతో భారత్‌లో అనేక మంది కేన్సర్‌, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. పోషకాహారంతోపాటు అక్రోట్లు ఎక్కువగా తీసుకుంటే అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చని న్యూయార్క్‌ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అభా చౌహాన్‌ చెప్పారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండే ఏకైక ‘గింజ’ అక్రోట్‌’ అని డాక్టర్‌ హెచ్‌కే చోప్రా తెలిపారు.

Wednesday, 25 October 2017

Nela Vemu

నేలవేము?
ఇంటి పెరట్లో, అటవీ ప్రాంతాల్లో చిన్న తెల్లని పువ్వులు పూచే ఓ రకమైన మొక్క నేలవేము. ఈ మొక్క కాండము, ఆకులు చాలా చేదుగా ఉంటాయి. దీనికి ఔషధ గుణాలు ఎక్కువని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. తీవ్రమైన జ్వరం, డెంగీ, మలేరియా జ్వరాలు, చికున్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ, చర్మరోగాలు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, సుఖ వ్యాధులకు ఔషధంగా పని చేస్తుందని చెబుతారు.
 
9 మూలకాల మిశ్రమం...
నేలవేము ఆకుల పొడితోపాటు... సొంఠి, మిరియాలు, వట్టివేర్లు, పర్పాటకం, చందనపు పొడి తదితర తొమ్మిది రకాల మూలికలు, పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తమిళనాట పంపిణీ చేస్తున్నారు. ఈ కషాయం తయారైన నాలుగు గంటల్లోపు తాగితేనే ఫలితముంటుందని వైద్యులు చెబుతున్నారు. నేలవేము కషాయంతో తెల్లరక్త కణాలు పెరిగి, రోగ నిరోధక శక్తి అధికమవుతుందని తిరునల్వేలి ప్రభుత్వ సిద్ధ వైద్య కళాశాల ఆచార్యులు, నేలవేముపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన సుభాష్‌ చంద్రన్‌ తెలిపారు.
 
ఈ నేలవేము కషాయాన్ని వారానికి మూడుసార్లు పుచ్చుకుంటే మధుమేహం నియంత్రణలోకి వస్తుందని... సిద్ధ వైద్య పద్ధతిలో తయారైన ఈ కషాయం వల్ల ఎలాంటి హాని ఉండదని ఆయన స్పష్టం చేశారు. నేలవేము డెంగీకి సరైన ఔషధమని చెన్నైలోని అన్నానగర్‌ ప్రభుత్వ సిద్ధవైద్య విభాగం ప్రత్యేక అధికారి డాక్టర్‌. పి. మల్లిక కూడా ధ్రువీకరించారు.

Tuesday, 24 October 2017

kakarakaya








అనాదిగా ఆసియాలో ప్రసిద్ధిచెందిన పాదుమొక్క కాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది చేదుగా మొహం పెట్టేస్తారుగానీ కాకరకాయ మనదేశంలో ఎప్పటినుండో ఔషధంగా ఉపయోగపడుతోంది. సంప్రదాయ వంటకాల్లో వారానికి ఒకసారైనా కాకరకాయ కూర, కాకరకాయ పులుపు తినాలని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శరీరంలో సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు నిలయంగా మారుతున్న మనదేశంలో కాకరకాయరసం ఇప్పుడు ఇంటింటా దివ్యౌషధంగా మారింది. కాకరకాయ జ్యూస్‌ బ్లడ్ సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్‌ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్‌ బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి. దీని ఆకులు, పండిన కాయలు ఉడికించి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మొటిమలు, మచ్చల నివారిణి కూడా.

Monday, 23 October 2017

Guntakalagura aku / Bringaraja


Pergularia extensa (Indian Name : Uttareni or Sadorani ) . It can stop the bad breeth and bad smell from mouth






















The entire plant constitutes the drug and is used as medicine.

It contains a bitter resin, two bitter principles and a glucoside possessing physiological action similar to pituitrin and several steroids. 


It is highly beneficial in the treatment of asthma. The juice from the leaves is used as an expectorant in catarrhal diseases. 

A decoction of its leaves is given in cough as an expectorant. 



Rheumatism :
The leaf juice can be given mixed with the juice of fresh ginger in the treatment. 

The root bark is also useful in the treatment of rheumatism.  It should be given in 4 to 8 gram doses with milk .

The bark , mixed with cow's milk, can be used beneficially as a purgative in rheumatic complaints.



Skin disorders:
The herb is beneficial in the treatment of several skin disorders. A mixture of the leaf juice and slaked lime can be applied to rhematic swellings, hard tumours and cysts (only on a doctor's supervision).
The poultice of the leaves can be applied to carbuncles (boils) with beneficial effect. 

The stem and mother root of the plant can be used as tooth brush for cleaning the teeth. Regular use of this kind of brush for cleaning the teeth, can stop bad breeth or bad smell from mouth. 

Friday, 20 October 2017

beerakayalu

బీరకాయ రుచి అమోఘం. దీనిలో పోషకవిలువలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకొనే వారికి ఇది పరమౌషధం. బీరకాయను వివిధ కాంబినేషన్లతో కూరలు చేయడంతో పాటు చట్నీకూడా చేస్తుంటారు. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ తదితర సమస్యలకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. దీనిలో వుండే బీటాకెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కామెర్ల వ్యాధి నివారణకు రోజూ ఒక గ్లాసు బీరకాయ జ్యూస్ తాగితే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ డైట్‌లో దీనిని చేర్చుకోవడం వలన పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు.

Tamara ginjalu

తామర గింజలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కాని పూల్‌ మఖని అంటే చాలా మంది గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్‌ అని కూడా అంటారు. ఈ పంటకు బీహార్‌ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ గింజలు తామర పువ్వు నుంచి వస్తాయి. వీటిని పచ్చివిగా, వేయించుకొని, ఉడకబెట్టి ఇలా రకరకాలుగా తింటుంటారు. ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఇవి ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా చేస్తారు.
తామర గింజల్లో ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువ. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్‌ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌‌ను దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. సోడియం తక్కువ.. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంలో తీసుకుంటే బీపి నియంత్రణలో ఉంటుంది. గర్భిణుల, బాలింతలు వీటిని తినడం వల్ల నీరసం దరిచేదరు. రక్తహీనత గల రోగులకు దీనిని మందుగా ఇస్తారు. ఇది ఆకలిని పెంచుతుంది. డయేరియాను నివారిస్తుంది. కాగా ఈ తామర గింజలు చాలాకాలం పాటు తాజాగా ఉండటం విశేషం.

Monday, 16 October 2017

Puttagodugulu

కుంగుబాటు, నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారా! అయితే, పుట్టగొడుగులు తినాలని పరిశోధకులు అంటున్నారు. అవి మెదడులోని కీలక నాడులను ఉత్తేజితం చేసి నాడీ సంబంధ రుగ్మతలు దరిచేరకుండా అడ్డుకుంటాయట. పుట్టగొడుగుల్లో ఉండే సిలొసిబిన్‌ కుంగుబాటుతో బాధపడేవారిని ఆరోగ్యవంతులుగా చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని యూకేలోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Wednesday, 11 October 2017

Till Oil

నువ్వుల సాధారాణంగా అందరికి తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వులనూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు.
చర్మాన్ని సంరక్షించడంలో....
చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.
చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచడంలో....
చిన్నారుల అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనెది కీలక పాత్ర. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ బి36.. లాంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. నిత్యం స్నానానికి, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా రుద్దితో పిల్లల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది.
బీపీ నియంత్రణలో...
ఈ నూనెలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడంతో పాటు... బీపీ స్థాయి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉన్న పెద్దవారికి బీపీని సమస్థాయికి తీసుకొస్తుంది. అంతేగాకుండా, వయసు పైబడ్డవారు ఈ నూనెతో చేసిన పదార్థాలను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటారు.
కీళ్లనొప్పుల నివారణలో...
నువ్వులు కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే మెగ్నీషియం... పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం.. ఎముకలు గట్టిపడేందుకు సాయపడే జింక్... తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉండటం ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.
మధుమేహ వ్యాధి నివారణకు..
నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..
జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయం కావాలన్న నువ్వుల నూనే బెస్ట్‌ అంటున్నారు సౌంధర్య నిపుణులు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌ గా ఉండే హెయిర్‌ గ్రోత్‌ ను ప్రోత్సహిస్తుంది. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా నువ్వుల నూనే రక్షిస్తుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

Tuesday, 26 September 2017

Sunamukhi aku

సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్థంతో కలిపి తీసుకుంటున్నాం అనే దాని మీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అదెలా అంటే, ఒక స్పూను సునాముఖి ఆకు చూర్ణాన్ని, అరకప్పు వేడి ఆవు పాలతో కలిపి సేవిస్తే రక్తశుద్ధి కలుగుతుంది. శరీరం కూడా కాంతిమంతమవుతుంది. నేతితో సేవిస్తే శరీరంలోని అనేక రుగ్మతలు హరిస్తాయి. పంచదారతో సేవిస్తే వాతం తగ్గుతుంది. తేనెతో సేవిస్తే ధాతుపుష్టి, మేకపాలతో తీసుకుంటే శరీరం బలిష్టమవుతుంది. పాతబెల్లంతో తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 
గుంటగలగరాకు రసంతో అయితే తెల్లవెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్షపండ్ల రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది.
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు వేడినీళ్లతో సేవిస్తే, సుఖ విరేచనం కలుగుతుంది.
3 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా, పటిక బెల్లం కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది.
5 గ్రాముల ఆకు చూర్ణానికి 10 గ్రాముల దోస గింజల చూర్ణం కలిపి సేవిస్తే, మూత్రద్వారానికి అడ్డుపడే రాళ్లు కరిగిపోతాయి.
రెండున్నర గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు వాడితే కండ్ల జబ్బులు నయమవుతాయి.
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తింటూ ఉంటే అన్ని రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.

Monday, 18 September 2017

parijatam poolu

పారిజాతం ఆకులను మెత్తగా దంచి, ఆముదం కలిపి వేడి చేసి కడితే, వాతపు నొప్పులు తగ్గుతాయి.రోజుకు ఒక పారిజాతం గింజ చొప్పున తింటూ ఉంటే అర్శమొలలు తగ్గుతాయి.
బాగా పెరిగిన 15 పారిజాతం ఆకులను సన్నని ముక్కలుగా తరిగి, రెండు కప్పుల నీళ్లల్లో వేయాలి. ఆ తర్వాత సన్నని మంట పైన అరకప్పు ద్రావణం మాత్రమే మిగిలేలా మరిగించి, వడబోయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో పావు స్పూను మిరియాల పొడి కలిపి, ప్రతి రోజూ, ఉదయం, సాయంత్రం సేవిస్తే, సయాటికా నొప్పి తగ్గిపోతుంది.
 పారిజాతం ఆకులు, సీతమ్మ నూలు పోగులు (అమర్‌బేల్‌), ఊడుగ ఆకులు ప్రతిదీ పిడికె డు చొప్పున తీసుకుని, వాటిని పావు లీటరు ఆవనూనెలో నీరంతా ఆవిరైపోయే దాకా మరిగించి వడబోసి అందులో ఒక తులం రాతి పువ్వు చూర్ణం కలపాలి. ఆకుల కషాయాన్ని లోనికి సేవిస్తూ, ఈ తైలాన్ని మర్ధనం చేస్తూ, విశ్రాంతి తీసుకుంటే సయాటికా నొప్పి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది.
 ఎండిన పారిజాతం గింజలను మెత్తగా పొడి చేసుకుని, ఆ పొడికి తగినంత నీటిని కలిపి పేస్టులా చేసుకుని తలకు పట్టిస్తూ ఉంటే చుండ్రు, తలపైన వచ్చే పొక్కులు నశిస్తాయి.
గుప్పెడు పారిజాతం ఆకులను ముక్కలుగా కత్తిరించి, లీటరు నీటిలో వేసి, 200 మి.లీ అయ్యేదాకా మరిగించి ఆ కషాయాన్ని 100 మి.లీ మోతాదులో రోజుకు రెండు పూటల 5 రోజుల పాటు తాగితే రక్త శుద్ధి కలుగుతుంది.

Saturday, 16 September 2017

Juvvi chettu

జువ్వి పండ్లను మధ్యకు రెండుగా కోసి తేనెలో వేసి నెల రోజుల పాటు ఊరనిస్తే లేహ్యంగా తయారవుతుంది. ఈ లేహ్యాన్ని ఒక ఉసిరికాయ పరిమాణంలో రోజుకు రెండు పూటలా తింటే, అన్ని రకాల వాపులూ హరించుకుపోతాయి.
జువ్వి పట్ట చూర్ణంతో గానీ, జువ్వి పుల్లతో గానీ, దంత దావనం చేస్తే దంత వ్యాధులు నశించడంతో పాటు, కదులుతున్న దంతాలు కూడా గట్టిపడతాయి.
జువ్వి చెట్టు పాలు తీసి పుండ్ల మీద పట్టు వేస్తే, తీవ్రమైన రాచపుండ్లు కూడా మానిపోతాయి. జువ్వి పట్ట కషాయంతో పుండ్లను కడిగినా తొందరగా మానిపోతాయి.
100 మి. లీ జువ్వి బెరడు కషాయంలో 10 గ్రాముల చక్కెర కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తే తల తిరుగుడు వ్యాధి (వెర్టిగో) తగ్గిపోతుంది.
మర్రి, రావి, మేడి, గంగరావి, జువ్వి వీటి బెరడులను కషాయంగా కాచి, స్త్రీలు తమ జననాంగాన్ని శుభ్రం చేస్తే, ఆ బాగంలోంచి వచ్చే దుర్ఘంధ స్రావాలు త గ్గిపోతాయి. గర్భాశయ ముఖద్వారంలో వచ్చే పుండ్లు (సర్వికల్‌ ఎరోషన్స్‌) సమూలంగా హరించుకుపోతాయి. లేదా పచ్చి జువ్వి పట్టను మెత్తగా నూరి ఉండలా చేసి జననాంగంలో ఉంచినా ఈ స్రావాలు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యుల మాట.

Friday, 15 September 2017

Kalabanda Aloe vera

శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద వైద్యనిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.
ఇదీ నేపథ్యం..
కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు ‘కుమారి’ అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు. పాశ్చాత్యులైతే ఐదు దశాబ్దాలుగా కలబందపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మరోగాలు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు. అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

అలోవెరాను కాలిన గాయాలకు, ఎముకల సమస్యలకు ఉపయోగించేవారు. దీన్ని తీసుకున్న వెంటనే వేగంగా రక్తశుద్ధి జరిగి, రక్తంలోని ఉత్ర్పేరక అవశేషాలు తొలగిపోతాయని చెప్పలేం.


అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




 సాధారణంగా మనకు అందుబాటులో ఉండే కలబంద ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెంట్రుకల మొదళ్ల నుంచి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని జట్టుకు క్రమం తప్పుకుండా పట్టించడం వల్ల జుట్టు పెరగటంతో పాటు, పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. వీటిని ఎలా వాడాలో ఓసారి చూద్దాం...
  • తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లకు పట్టించాలి. ఈగుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతకాణాలను తొలగించి చండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలిగిస్తుంది. అంతే కాక తేమను అందించి జట్టు పొడిబారకుండా చేస్తుంది.
  • పావు కప్పు కలబంద గుజ్జులో రెండు చెంచాల అలివ్‌ ఆయిల్‌ కలపాలి. ఈ మిశ్ర మాన్ని కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే చండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జుకి పెద్ద చెంచా ఆము దం, చెంచా మెంతి పిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారా క ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి వారం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Thursday, 14 September 2017

Violet colour fruits / vegetables

మన ఆహార పదార్థాల్లో ఊదారంగు పండ్లో, కాయగూరలో ఉండేలా చూసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అత్యధిక మొత్తంలో ఉండే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కేన్సర్‌, పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.
ఊదా, నీలిరంగు పండ్లు వర్ణాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ప్రత్యేకించి బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ పండ్లల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ-ర్యాడికల్స్‌ వల్ల కలిగే న ష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ఊదా రంగు క్యాబేజీ, బ్లాక్‌ బెర్రీలు, ఊదా రంగు ఉల్లి, ఊదా రంగు ద్రాక్షల్లోని ప్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లను ఎదుర్కొనే శక్తినిస్తాయి.
ఊదారంగులో ఉండే చిలగడదుంపల్లో యాంతో సియానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఏర్పడే వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంశాలు సమ్దృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణవిచ్ఛిత్తిని అరికడతాయి.
ఊదా రంగు ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఊదా రంగు క్యారెట్లలో అత్యధిక స్థాయి ఆంథోసియానిన్లతో పాటు కెరోటినాయిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ దాడిని తిప్పి కొడతాయి. ఇవి రక్తంలోని చక్కెర నిలువల్ని నియంత్రిస్తాయి. బ్లాక్‌ బెర్రీల్లో శరీర క్షయ వేగాన్ని తగ్గించే గుణం ఉంది. జుత్తు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. బీట్‌రూట్లలో శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపే అంశాలు ఉన్నాయి. సూప్స్‌లోనూ, సలాడ్స్‌లోనూ వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

Akakarakaya

అన్ని కూరగాయలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ పండ్లు మాదిరిగా సీజన్‌లోనే లభించే కాయగూర.. ఒక్క బోడకాకరకాయ మాత్రమే. ఈ అడవి కాకర(బోడకాకర) మంచి ఔషధ గుణాలతో పాటు ఎంతో రుచిగా కలిగి ఉంటాయి. జూన్‌ మాసం నుండి జనవరి మాసం వరకు అడవి కాకర మార్కెట్‌లో లభ్యమవుతుంది. మిగతా ఏ కాలంలోనూ ఎంత వెచ్చించి కొందామన్నా లభించదు. అడవి కాకర మంచి రుచితో పాటు ఆరోగ్యానికి సైతం ఉపయోగకరమైన కూరగాయ కావడంతో సీజన్‌లో ఒక్కసారైన తినాలన్న ఉ ద్దేశంతో ప్రజలు ధరకు వెనకాడకుండా అడవి కాకరను కొనుగోలు చేస్తుంటారు.  అడవి కాకర కూరగాయలకు రాజుగా చెప్పుకోవడం మరో విశేషం. మార్కెట్‌లో లభించే కూరగాయల కన్న అడవి కాకరకు డిమాండ్‌తో పాటు ధర సైతం అ ధికంగా ఉంటుంది. కిలో 120రూపాయల నుండి 140రూపాయల వరకు మార్కెట్‌లో పలుకుతోంది. అయినా అడవికాకరకు భలే డిమాండ్‌ ఉంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అడవి కాకర గురించి తెలిసిన వారు తప్పకుండా కొనుగోలు చేసి తీరు తారు. ధరతో సంబంధం లేకుండా అడవి కాకరకాయను కొనుగోలు చేస్తు న్నారంటే ఎంతటి ఔషధ గుణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 
 
అడవి కాకరలో ఉన్న ఔషధ గుణాలు..
అడవి కాకరను  ప్రతీ సీజన్‌లో తినడం వల్ల సీజన్‌లో వచ్చే రోగాలను నిరో ధిస్తుంది. అంతటి గొప్ప ఔషధంగా అడవి కాకర పని చే స్తుందన్నమాట. అడవి కాకరలో విటమిన్స్‌ ఏ, సీలతో పాటు ప్రొటీన్లు, పీచుపదార్ధం అధికంగా ఉంటా యి.  కేలరీలు తక్కువగా ఉండే కూరగాయలలో అడవి కాకరదే మొదటి స్థానంగా చెప్పవచ్చు. శరీరంలోని మధుమేహన్ని, చక్కెరశాతాన్ని తగ్గిస్తుంది. ర క్తంలోని క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. కంటి, గుండె సంబంధిత వ్యాధుల వారికి ఇది మంచి ప్రకృతి ఔషధంగా పని చేస్తుందంటే అడవి కాకర ఎంత చ క్కటి గుణాలను కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా గర్భిణీలు అడవి కాకరకాయను తీసుకోవడం ద్వారా పిండం ఆరోగ్యంగా ఉండ టంతో పాటు శిశువు వృద్ధికి దోహదపడుతుంది. అర్షమొలల తో బాధపడే వారికి సైతం అడవికాకర ఉపశమనా న్ని కలిగిస్తుంది. గ్యాస్‌, మలబద్దకాన్ని నియ ంత్రిస్తుంది. మిగత కాకరలా ఇది చే దుగా ఉండకుండా తినడా నికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న అడవి కాకర ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇంకెం దుకు ఆలస్యం.. మీరు కూడా ఒక్కసారి అడవికాకర రుచిని ఆస్వాదించండి ఆరోగ్యంగా ఉం డండి.
 

Jaji kaya ( Nut meg)

జాజి ఆకులను నమిలి మింగుతూ ఉంటే నోటి అల్సర్లు తగ్గుతాయి. ఓ 20 ఆకులను కషాయంగా కాచి దానితో పుక్కిలించినా ఈ అల్సర్లు తగ్గుతాయి. జాజి ఆకుల రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి, సన్నని మంటపై రసం ఇగిరే దాకా కాచి తయారు చేసిన తైలాన్ని చెవిలో వేస్తే, చెవిలో రంధ్రం కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
20 తాజా జాజి పూలను మెత్తగా రుబ్బి, ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం క్రమక్రమంగా కాంతి వంతంగా తయారవుతుంది.
జాజి ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతి రోజూ పట్టిస్తే, పగుళ్లు మానడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి.
జాజి పూల యుక్తంగా కొమ్మలను ముక్కలుగా కత్తిరించి ఆరలీటర్‌ నీటిలో వేసి, పావులీటరు మిగిలేదాకా కాచి, ఆ తర్వాత వడబోయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తయారు చేసుకుని సేవిస్తే, రుతుక్రమం చక్కబడుతుంది. స్త్రీ జననాంగానికి సంబంధించిన పలు వ్యాధులు తొలగిపోయి సంతాన యోగ్యత కలుగుతుంది.
చీము పట్టి దీర్ఘకాలికంగా వేధిస్తున్న మొండి వ్రణాలను జాజి ఆకుల కషాయంతో కడిగితే చాలా త్వరితంగా మానిపోతాయి.
30 మి.లీ జాజి ఆకుల కషాయాన్ని కొద్ది రోజుల పాటు తాగితే మూత్రాశయం నొప్పి తగ్గుతుంది.

Tuesday, 5 September 2017

Velaga Pandu ( Wood Apple)













బాగా పండిన వెలగ పండును నిప్పులో కాల్చి లోపలి గుజ్జును తీసి, దానికి కొంచెం శొంఠి, మిరియాల చూర్ణం కలిపి బఠాణీ గింజ అంత మాత్రలు చేసుకుని రోజూ పూటకు రెండు చొప్పున రెండు పూటలా వేసుకుంటే ఆకలి పెరుగుతుంది.
 కాయలోని గుజ్జులో పిప్పళ్ల పొడిని క లిపి చప్పరిస్తే వెక్కిళ్లు తగ్గుతాయి. వెక్కిళ్లు మరీ ఎక్కువగా ఉంటే, వెలగాకు రసానికి సమానంగా ఉసిరిక ఆకు రసాన్ని కలిపి అందులో పిప్పలి చూర్ణం, తేనె కలిపి ఇస్తే వెక్కిళ్లు తగ్గుతాయి.
 వెలగ గింజ చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి ఒక స్పూన్‌ మోతాదులో రోజూ రెండు పూటలా కొద్ది రోజులు వాడితే వీర్యవృద్ధి కలుగుతుంది.
 20 గ్రాముల వెలగ చెట్టు బెరడును దంచి రసం తీసి, కొద్ది రోజులు వాడితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 3 స్పూన్ల వెలగ ఆకు రసంలో ఒక గ్రాము పిప్పలి చూర్ణం, తేనె కలిపి బాగా వాంతులు అవుతున్న వారికి తాగిస్తే వెంటనే తగ్గుతాయి.
 రెండు గ్రాముల వెలగ గింజల చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగిస్తే కడుపు నొప్పితో వచ్చే అజీర్ణ విరేచనాలు తగ్గుతాయి.




వెలగ పండులో రిబోఫ్లావిన్ ,నియాసిన్ , విటమిన్ C పుష్కలం గా ఉంటాయి.  కడుపు లోని నట్టలు, క్రిములను , వెలగ పండు గుజ్జు తొలగిస్తుంది . రక్త హీనత ను తొలగిస్తుంది . నోటికి రుచిని పుట్టిస్తుంది . దీనిలోని జిగురు పేగులకు మంచిది . పేగుల్లో వాపుని , నోటి పూతను తగ్గిస్తుంది . సంవత్సరానికి ఒక్క సారైనా తినాల్సిన ఆహారం ఇది.

వెలగ పండు తో పచ్చడి చేసుకోవచ్చును. వెలగ పండు గుజ్జు, బెల్లం , చింత పండు , పచ్చి మిరప కాయలు, కొత్తి మీర, మినప్పప్పు , మెంతులు, ఆవాలు , జీలకర్ర , ఇంగువ , పసుపు , ఉప్పు , నువ్వుల నూనె , ఎండు మిరప కాయలు పచ్చడి కోసం కావాలి.
   

Monday, 7 August 2017

Biryani leaf or Bayleaf





బిరియానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బేలీఫ్‌ ఎక్స్‌ట్రాని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిరియానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు. దీనిలో కేన్సర్‌ నిరోధక కారకాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కేన్సర్‌ కారకాల ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే మసాలా దినుసులు ఎక్కువగా ఉండే బిర్యానీలో దీన్ని వాడుతుంటారట. తద్వారా మసాలా ఎక్కువవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పొచ్చట. 

Sunday, 6 August 2017

Water Lilies





Water lilies grow widely across India, and have a nutritional value that many are unaware of, says ecologists.  “Where water lilies grow wild, like in Bengal after the monsoon, people prefer to eat the peduncle (flower stalk),” she says. “Both red and white varieties are eaten: to prep, peel the stalk and cut into 2-inch pieces. This can be batter-fried like pakoda. If very fresh, boil it with a little bit of water and a pinch of salt and turmeric till cooked. Temper mustard oil, mustard seeds and green chilli, add the stalk, adjust salt, and finish with fresh grated coconut. Another way of cooking them is to temper 1 tbsp ginger, radhuni (Trachyspermum roxburghianum) and mustard paste, green chilli, salt and a pinch of sugar and add the stalks.”
Pick it right: Source them from farmer’s markets and try to ensure that they are from a clean water source.

Ayurvedic herbs for issueless people

ఆయుర్వేద చికిత్స 
సంతానలేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వమని పేర్కొన్నారు. పురుషుల్లో సంతానలేమిని శుక్ర దోషాలుగా చెప్పవచ్చు. వీర్యకణాలను పెంచే అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు. శృంగార సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాజీకరణ ఔషధాలు ఉన్నాయి. శుక్ర దోషాలను 8 రకాలుగా చెప్పారు. ఇవి వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాల వల్ల ఏర్పడతాయని ఆయుర్వేదశాస్త్రంలో వివరించారు.
వాజీకరణ ఔషధాలు 4 రకాలు ఉన్నాయి.
1. శుక్ర జనకాలు: ఇవి వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వీటిలో అశ్వగంధ, శతవరి, జీవకం మొదలైనవి ఉన్నాయి.  
2. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారిలను పేర్కొనవచ్చు. 
3. శుక్ర జనక, ప్రవర్తకాలు: వీటిలో జీడిపప్పు, మినుములు, పాలు చెప్పవచ్చు. 
4. శుక్ర బోధకాలు: వీర్యంలోని దోషాలను నివారించేవి. వీటిలో కోకిలాక్ష, కూష్మాండ, ఉసిర, చెరకు రసం చెప్పవచ్చు.
పురుషుల వీర్యంలో ఎలాంటి లోపాలున్నా ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. ఔషఽధాలతో పాటు మానసిక ఆందోళనలను తగ్గించుకొని, ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ వహించాలి. సంతాన, శృంగార సమస్యలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా ఔషధాలు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

korra biyyam

కొర్రబియ్యం లేదా కొర్రలు
చిరుధాన్యాలుగా పిలవబడే ఈ కొర్రలు అతి ప్రాచీణ కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తప్పా పట్టణ వాసులకు పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుతం నగరంలోని చాలా దుకాణాల్లో కొర్రలను విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి కిలో రూ.70 నుంచి రూ.120 వరకూ ధర పలుకుతుంది. ఈ కొర్రల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నందున ఇప్పుడు చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొర్రలను అన్నం మాదిరిగానే వండుకుని తింటారు. బియ్యాన్ని వండిన విధానంలోనే కొర్రలనూ వండుతారు. అయితే వండడానికి సుమారు రెండు గంటల ముందు వీటిని నానబెడతే సరిపోతుంది.
 
పీచు పదార్థం కలిగి వుండే కొర్రల్లో ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు, థైమిన్‌, రిబోఫ్లావిన్‌ వంటి పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇవి డయాబెటిస్‌ రోగులకు మంచి ఔషధం. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అజీర్తి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. కొర్రలు వినియోగంతో జీర్ణనాళం శుభ్రం కావడంతో పాటు యూరినల్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలను దూరం చేస్తుంది... ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు కొర్రలులో ఉన్నందునే వీటి వినియోగానికి నగరవాపులు ఎక్కువ ఎక్కువ చూపుతున్నారు

Dampudu biyyam

దంపుడు బియ్యం
సాధారణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపించడం ద్వారా బాయిల్డ్‌ రైస్‌, పాలిషింగ్‌ రైస్‌లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ తరహా పాలిషింగ్‌ పక్రియలో బియ్యంలో గల చాలా పోషక పదార్థాలు తొలగిపోతాయి. చూడడా నికి అందంగా కనిపించే ఈ వైట్‌ రైస్‌తో పోలిస్తే దంపుడు బియ్యంలో చాలా పోషక విలువలున్నాయి.
 
ధాన్యాన్ని యాంత్రికంగా కాకుండా సాధారణ పద్ధతిలో వడ్లను రోకలితో దంచడం ద్వారా లభించే బియ్యమే ఈ దంపుడు బియ్యం. దీన్నే ముడిబియ్యం లేదా బ్రౌన్‌ రైస్‌ అంటారు. పీచు (ఫైబర్‌), కార్బోహైడ్రేట్స్‌, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఈ బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యకు చెక్‌ చెబుతుంది. సాధారణ పాలిష్డ్‌ బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి వెంటనే ఆకలి వేయదు. దంపుడు బియ్యంతో వండే అన్నాన్ని తినడం వల్ల గుండెజబ్బులు, రొమ్ము కేన్సర్‌ వంటి వ్యాధుల బారినపడకుండా ఉండవచ్చు. సాధారణ రైస్‌ ధరకే ఈ దంపుడు బియ్యం కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో దంపుడు బియ్యం రూ.50 నుంచి లభిస్తున్నాయి.

Wednesday, 2 August 2017

Karakkaya

కరక్కాయ చూర్ణం ఒక భాగం, వేయించిన పిప్పళి చూర్ణం సగభాగం కలిపేయాలి. అందులోంచి ఒక గ్రాము చూర్ణాన్ని తేనెతో ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున సేవిస్తే కోరింత దగ్గు తగ్గిపోతుంది.
పసుపు కొమ్ము రసాన్ని ఇనుప పాత్రలో ఉంచి వేడిచేస్తూ, కరక్కాయ కల్కాన్ని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం లేపనంగా వేస్తే ‘గోరు చుట్టు వాపు ’రోగం శమిస్తుంది.
ఒకటి రెండు చెంచాల కరక్కాయ పొడిని భోజనానికి ముందు మజ్జిగతో సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది.
కరక్కాయ చూర్ణాన్ని తేనెతో సేవిస్తే విషజ్వరాలు తగ్గుతాయి.
కాస్తంత కరక్కాయ చూర్ణాన్ని, 3 గ్రాముల తేనెతో రోజూ రెండు పూటలా సేవిస్తూ, ఉప్పు, కారం, మసాలాలు లేని చప్పిడి ఆహారం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణంలో కొంచెం బెల్లం కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తే ర క్త మొలలు హరిస్తాయి.

Sunday, 16 July 2017

alasandalu

రక్తపోటు అనేది ఇప్పుడు అందరినీ బాధపెట్టే ఆరోగ్య సమస్య అయిపోయింది. రక్తపోటు వలన అప్పటికప్పుడు వచ్చే పెనుముప్పు పెద్దగా లేకపోయినా దీర్ఘకాలంలో ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యతో బాధపడేవారు మందుల మీద ఉన్న శ్రద్ధను ఆహారం తీసుకోవడం మీద ఉంచరు. ఆహారంలో ఉప్పును తగ్గించడం మీద దృష్టి కేంద్రీకరిస్తారే తప్ప బిపిని అదుపులో ఉంచే ఆహారం గురించి ఆలోచించరు. రక్తపోటుతో బాధపడేవారికి అలసందలు మంచి మందుగాఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. వీటిని ఉడికించి చేసే ఆహారపదార్థాలు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని వారు చెబుతున్నారు. వీటిల్లో ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయంటున్నారు. రక్తపోటుతో బాధపడేవారు కాఫీ, టీలతో పాటు శీతల పానీయాలను తీసుకోవడం బాగా తగ్గించడం లేదా, తీసుకోవడం పూర్తిగా మానివేస్తే మంచిదని సూచిస్తున్నారు. వీటికి బదులుగా నీరు, పళ్ళరసాలను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Saturday, 24 June 2017

Gummadi /Pumpkin and its seeds



























  • గుమ్మడి గింజల్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
  • గుమ్మడి గుజ్జులోని బీటా కెరొటిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఇందులోని ప్రొటీన్లు జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తాయి.
  • విటమిన్‌-కె ఇందులో బాగా ఉంది. ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.
  • పోషకవిలువలు కూడా అధికంగా ఉన్నాయి. పైగా కెలొరీలు తక్కువ.
  • దోసగింజలు, వాటి ఆకులు, జ్యూసుల్లో పోషకాలు బాగా ఉంటాయి.
  • గుమ్మడిలోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  • ఇందులోని యాంటాక్సిడెంట్లు కంటిచూపు తగ్గకుండా కాపాడతాయి.
  • బేకింగ్‌ రెసిపీల్లో వెన్న, నెయ్యికి బదులు గుమ్మడి ప్యూరీని వాడితే ఆరోగ్యానికి మంచిది.
  • గుమ్మడిలోని బీటా కెరొటిన్‌ కొన్ని క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.
  •  ఇందులోని విటమిన్‌-సి వల్ల గుండెజబ్బులు, ఆస్తమా సమస్యలు ఉండవు.
  •  చర్మం సాగకుండా, శరీరం శుష్కించకుండా కాపాడుతుంది.
  • గుమ్మడిలాంటి మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులను తింటే బరువు పెరగరు.
  • ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.
  • దీని వినియోగం వల్ల చర్మం చాయ పెరగడంతోపాటు శిరోజాలూ పెరుగుతాయి. ఎనర్జీ పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉంటుంది.
  • పీచుపదార్థాలు కూడా ఇందులో ఎక్కువ.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • మెనోపాజ్‌లో అడుగుపెట్టిన మహిళల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంతో మంచిది.
  • యాంటి-ఇన్‌ఫ్లెమేటరీ ప్రయోజనాలు కూడా పొందుతాము.
  • మంచి నిద్ర పడుతుంది.
  • గుమ్మడికాయ వినియోగం వల్ల బ్లాడర్‌ స్టోన్స్‌ రిస్కు తగ్గుతుంది.



గుమ్మడి కాయలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అనేకం. మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా-కెరోటిన్‌ చాలా ఎక్కువ. అంతగా చె ప్పుకునే క్యారెట్‌లో కన్నా ఇది గుమ్మడిలోనే ఎక్కువ. బీటా కెరోటిన్‌ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమయ్యే పదార్థం కూడా. దీన్ని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు ఇస్తే హాయిగా తినేసి ఆరోగ్యంగా ఉంటారు. దీని విశేషాల గురించి తెలిసి, కొంతకాలంగా విదేశీయులు కూడా భోజనంలో వాడేస్తున్నారు. ప్రత్యేకించి సూప్స్‌లో దీని వాడకం బాగా ఎక్కువయ్యింది. కూరగానో, సాంబార్‌గానో వాడే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ.
చర్మానికీ, శిరోజాలకూ ఇవెంతో ఉపకరిస్తాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఇట్టే తొలగిపోతుంది., విటమిన్‌-సి కూడా ఎక్కువగా ఉండే గుమ్మడి వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా విశేషమైనవే. వీటిలో సమ్దద్ధిగా ఉండే జింకు, ప్రోస్టేట్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా స్త్రీ పురుషులు ఇరువురిలోనూ లైంగిక వ్యవస్థను ఆరోగ్యపరుస్తుంది. వీటితో పాటు రప్రొటీన్‌, పొటాపియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఎస్నెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉండడం వల్ల గుమ్మడినొక సమస్త పోషకాల నిధిగా న్యూట్రిషియన్లు చెబుతుంటారు ఇవేమీ తెలియక చాలా మంది పందిరి మీద అవి ఓ భారమన్నట్లు తెంపి పారేస్తుంటారు. కానీ, ఒకసారి ఈ విశేషాలన్నీ తెలిస్తే, అమృతంలా ఆస్వాదిస్తారు.




గుమ్మడిలోని ఆరోగ్య సుగుణాలివి...
  • గుమ్మడికాయలో కెరొటనాయిడ్స్‌, పీచుపదార్థాలు, పొటాషియం, విటమిన్‌-సిలతో పాటు జింక్‌, ఐరన్‌, కాల్షియం, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు ఉన్నాయి.
  • చలికాలంలో జింకు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • పోషక విలువలు కూడా వీటిల్లో పుష్కలం. విటమిన్‌-ఎ అధికం.
  •  క్యాలరీలు తక్కువ.
  •  వీటిల్లోని యాంటి ఆక్సిడెంట్ల వల్ల క్రానిక్‌ జబ్బుల రిస్కు తక్కువ.
  • ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.
  • గుమ్మడికాయలో విటమిన్‌-సి ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్తకణాలను వృద్ధి చేస్తుంది. దీంతో రోగనిరోధక కణాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు తొందరగా మానిపోతాయి.
  • వీటిలోని విటమిన్‌-ఎ, ల్యూటిన్‌, జెక్సాన్‌థిన్‌లు కంటిచూపును పరిరక్షిస్తాయి. విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసి కంటిలోని కణాలను ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.
  •  పోషకవిలువల గాఢత ఎక్కువ. ఇందులోని తక్కువ క్యాలరీల వల్ల బరువు తగ్గుతారు.
  • గుమ్మడికాయలోని యాంటి ఆక్సిడెంట్లు ఉదరం, గొంతు, పాంక్రియాస్‌, రొమ్ము కేన్సర్ల రిస్కు నుంచి కాపాడతాయి.
  •  పొటాషియం, విటమిన్‌-సి, పీచుపదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  •  గుమ్మడికాయలోని బెటా కెరొటినా సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా నేచురల్‌ సన్‌బ్లాక్‌గా పనిచేస్తుంది.
  • ఇందులోని విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • గుమ్మడికాయ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి.
  • మధుమేహాన్ని గుమ్మడి నియంత్రిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ని కట్టడి చేస్తుంది.
  • చర్మ సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. దాంతో యంగ్‌గా కనిపిస్తారు.
  • కాలేయాన్ని శుభ్రంచేస్తుంది. దీన్ని కొద్దిగా తింటే చాలు కడుపునిండుగా ఉండి ఆకలి ఉండదు.


Thursday, 8 June 2017

Onions

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే వండే ప్రతీ కూరలో ఉల్లి తప్పనిసరి చేశారు మన పూర్వీకులు. తాజాగా, ఎర్రని ఉల్లిగడ్డను తింటే కేన్సర్‌ను దీటుగా ఎదుర్కొనవచ్చంటున్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ గుల్ఫ్‌ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధకుల బృందంలో భారతీయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఉల్లిగడ్డలో ఉండే ‘క్వెర్సెటిన్‌’ కేన్సర్‌ కణాలకు ప్రతికూల వాతావరణం కల్పించి కణాల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుందని, తద్వారా కేన్సర్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని వివరించారు. కేన్సర్‌ కణాలను అచేతనంగా కూడా మార్చుతుందని వెల్లడించారు.

 ఉల్లిపాయలో ఉండే క్విర్‌సిటైన్‌(quercetin ) అనే ఫ్లేవనాయిడ్స్‌ పలు వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. ఇప్పుడు ఈ గుణాలు ప్రా‍ణాంతకమైన కేన్సర్‌తో పోరాడతాయన్న విషయం కెనడా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఎర్ర ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్‌తో పాటు ఆంథోసియానిన్‌ (anthocyanin )ను కలిగి ఉంటాయంటున్నారు. వీరు ఐదురకాల ఉల్లిపాయలను పరిశీలించారు. వీటిల్లో ఎర్ర ఉల్లిపాయలోనే ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఇవి కేన్సర్‌ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని చెబుతున్నారు. ఎర్ర ఉల్లిపాయ కేన్సర్ కణాలను ఎదుర్కొంటుందే తప్ప రాకుండా అడ్డుకోలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కేన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చా అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేదు, ఉల్లిపాయలలో ఎర్ర ఉల్లిపాయను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిదని వీరు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయను దగ్గర పెట్టుకోమని మన ఇంట్లో పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటారు. అంతేకాదు చర్మ, కేశ సౌందర్యానికి అండగా నిలుస్తుంది ఉల్లి. అలాంటి ఉల్లి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.

  • శ్వాసకోశ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
  • ఎముకలను బలోపేతం చేస్తుంది.
  • క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది.
  • మెదడును పరిరక్షిస్తుంది.
  • జీర్ణక్రియ సరిగా జరిగేలా చూస్తుంది.
  • రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది.
  • యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.
  • యాంటిబయోటిక్‌ కూడా పనిచేస్తుంది.
  • బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
  • చర్మానికి ఎంతో మంచిది.
  • జలుబు, ఫ్లూ జ్వరాలపై బాగా పనిచేస్తుంది.
  • శిరోజాలు పెరిగేందుకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది.
  • గాస్ట్రోఇంటస్టైనల్‌ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
  • ఎలర్జీలను నివారిస్తుంది.
  • మూత్ర సంబంధమైన సమస్యలను తగ్గిస్తుంది.
  • కలరా తగ్గించడంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది.
  • విటమిన్‌-సి, విటమిన్‌-బి6, విటమిన్‌- బి1, విటమిన్‌-బి9లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కాపర్‌, మాంగనీసు, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం ఖనిజాలు ఉన్నాయి.
  • నిద్రలేమిని తగ్గిస్తుంది.
  • గుండెకు మేలు చేస్తుంది.
  • పీచు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు పుష్కలం ఉల్లిలో.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • తేనెటీగ కుట్టినపుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తహీనతతో బాధపడేవారు ఉల్లిని తింటే మంచిది.
  • గొంతునొప్పి, దగ్గుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
  • చర్మంపై కురుపులను, తలలో చుండ్రును తగ్గిస్తుంది.


Friday, 2 June 2017

ఖర్జుర పండు

ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలు, సైనస్‌లతో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఖర్జూరాల్లో చక్కెరలు, ప్రోటీన్లు, విటమిన్లు, సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండే వారికి పుష్టినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గ పనిచేసేలా చేస్తుంది. అందుకు వయసు రీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
 
గుండె బలహీనంగా ఉండే వాళ్లు రాత్రి పూట ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్టు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హుద్రోగాలను రాకుండా చేస్తాయి. ఖర్జూరాలు లైంగిక శక్తికి దోహదం చేస్తాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి, జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు. దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడే వాళ్లు ఖర్జూర పండ్లు తింటే వాటిల్లోని పొటాషియం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
దంతాల మీద ఎనామిల్‌ను సంరక్షించడంలో ఖర్జూరాలను మించింది లేదు. నిజానికి ఎనామిల్‌ ఎముక కన్నా దృఢమైన హైడ్రాక్సీ ఎపటైట్స్‌ అనే పదార్థాలతో రూపొందుతుంది. ఆహారంలో ఉండే బాక్టీరియా కారణంగా ఎనామిల్‌ క్రమంగా తగ్గిపోతుంది. అదే ఖర్జూరాల్ని రోజూ తినడం వల్ల అందులోని ఫ్లోరిన్‌ దంతాల మీద పాచి చేరకుండా చూడటంతో పాటు ఎనామిల్‌తో చర్య పొంది హైడ్రాక్సీఫ్లోరో ఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
 
పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూర పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట, కాలేయ, మూత్ర నాళ, క్లోమ, అండాశయ, క్యాన్సర్లు రావని, వచ్చినా వాటిని నివారించే శక్తి ఈ పండ్లకు ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి మూడు సార్లు ఖర్జూరాలు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఎడారి ఫలాల్లో సెలీనియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం, వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరాల్లోని నికోటిన్‌ పేగుకు సంబంధిం చిన వ్యాధులను రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బాక్టీరియా పెరిగేలా చేయడానికి ఖర్జూరాల్లోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి. ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనత, అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.
 
గర్భిణీలకు ఎంతో మేలు
రోజుకో ఖర్జూరపండు తింటే కళ్లకు మంచిది. ఇందులో ఉండే ఏ విటమిన్‌ రేచీకటిని నివారిస్తుంది. గర్భిణిలకు ఎడారి ఫలాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచిం చేలా చేయడంతో పాటు బిడ్డ పుట్టాక పాలు పడేందుకు కారణమవుతాయి. గర్భస్త శిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్‌ పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, పోట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.

Saturday, 20 May 2017

Dondakaya ( Kundru ) (Ivy gourd) (Coccinia grandis)




Ivy gourd fruit is a smooth, green, striped, ovoid to ellipsoid berry. The tender shoots of the plant are sometimes consumed as vegetable too. The fruit is nutritious and a good source of protein, calcium, fibre and vitamins B and A.

In traditional medicines, such as Ayurveda, the leaves of the plant are used to control blood sugar. The leaves are also used as a household remedy for various diseases, including biliary disorders, anorexia, cough, diabetic wounds and hepatic disorders.

The leaf extract helps in reducing insect bite itching and swelling.  The leaf extract has been found useful in wound-healing and researchers have observed that the extract protects the human fibroblasts and keratinocytes from damage caused by hydrogen peroxide. 

The fruit is useful to treat cancer, too. Cucurbitacin B found in the fruits can act as anti-proliferative agent for breast cancer cells. The best part of the vegetable is that it is easy to cultivate. The vines continue to fruit for four-five years and can be harvested in about 70 days after planting. In south and central India, fruiting is round the year, while in north India, fruiting terminates when the temperature comes down in November. Since it grows easily, this underexploited semi-perennial creeper is often termed as poor man’s vegetable. 

Friday, 19 May 2017

Mango





రోజూ ఒకటి తింటే ఓకే.. అంతకు మించితే ఇబ్బందే
బరువు పెంచడమే కాదు.. తుంచడటంలోనూ మామిడి సహాయపడుతుందంటున్న డైటీషియన్లు
కేలరీలు కౌంట్‌ చేసుకుని మరీ ఫుడ్‌ తీసుకుంటున్న కాలంలో మామిడి తీసుకుంటే వెయిట్‌ పెరుగుతామా అని సందేహపడుతూ పౌష్టికాహారానికి దూరంగా ఉంటున్న వారెందరో ! ఇక చక్కెర వ్యాధిగ్రస్తుల సంగతి సరే సరి. ఇదే విషయమై ఆల్టర్‌నేటివ్‌ మెడిసన్‌, హోలిస్టిక్‌ న్యూట్రిషియనిస్ట్‌ ల్యుక్‌ కౌటిన్హో మాట్లాడుతూ ‘‘వేసవిలో చాలామంది మామిడి తినాలా  వద్దా అని సందేహ పడుతుంటారు. అందునా మధుమేహ రోగులు తమ కోర్కెలను అణుచుకుని మరీ ఈ ఫ్రూట్‌కు దూరంగా ఉంటుంటారు. నన్నడిగితే అలా దూరంగా ఉండాల్సిన అవసరం లేనే లేదు. ప్రకృతి సిద్ధ ఉత్పత్తి అయిన ఏ పండు కూడా ఆరోగ్యానికి హాని చేయదు. కానీ ప్యాకేజ్డ్‌ లేదంటే ప్రాసెస్డ్‌, అనారోగ్యకరమైన జీవనశైలి గురించి మాత్రం భయపడాల్సిందే ! అని అన్నారు. 
పోషకాలు ఘనం.. అదే మనకు ఇంధనం..
శరీరానికి అవసరమైన పోషకాలు మామిడిలో చాలా ఎక్కువ. ఓ మీడియం సైజ్‌ మామిడి దాదాపు 200 గ్రాముల బరువు ఉంటే అది 150 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. అధికంగా విటమిన్‌ సీ,ఏ , కేలను అందించడంతో పాటుగా విటమిన్‌ బీ12 మినహా బీ కాంప్లెక్స్‌ విటమిన్‌లను, కొంత పరిమాణంలో ఒమేగా 3, ఒమేగా 6, మినరల్స్‌,ఫైబర్‌ కూడా మామిడిలో లభిస్తాయి. కార్బోహైడ్రేట్స్‌ 28 గ్రాములు ఉంటే సోడియం 3 గ్రాములు, షుగర్‌ 24 గ్రాములు లభిస్తాయి. అంతేనా మెగ్నీషియం, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ సైతం దీనిలో ఉన్నా  కొలెస్ట్రాల్‌ కంటెంట్‌ మాత్రం ఉండదు. దీన్లో గ్లిసామిక్‌ కంటెంట్‌  వల్ల మామిడి తింటే లావైపోతామని భయపడాల్సిన అవసరం లేదని న్యూట్రిషియని్‌స్టలు చెబుతున్నారు. అయితే అధికంగా మామిడి  తింటే, అందునా డయాబెటీస్‌ ఉండి వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బంది అని చెబుతున్నారు. మధుమేహం ఉన్నా  మామిడి తినొచ్చని ల్యూక్‌ చెబుతూ మధుమేహం అనేది ఓ వ్యాధి కాదు. ఓ స్థితి. టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్నవారు ఓ మామిడి తినే బదులు దాన్లో సగం తింటే సరిపోతుంది. నిజానికి మామిడిలోని ఫైబర్‌ రక్తంలోని చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటాయి కానీ దీనితో పాటుగా కొన్ని నట్స్‌, సీడ్స్‌ తీసుకుంటే మంచిది. నిజానికి మామిడిలో మాంగిఫెరిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లేమ్మేటరీగా పనిచేసి శరీరంలోని కొన్ని ఎంజైమ్స్‌పై ప్రభావం చూపుతాయి. నిజానికి ఇవి మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి  అన్నారు.  ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించింది. సీజన్స్‌కు అనుగుణంగా లభించే పళ్లను ఆరగించడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికారక వ్యర్థాలెన్నింటినో బయటకు పంపొచ్చు. ఓ ఫ్రూట్‌ తినడం వల్ల శరీరంలో షుగర్‌ స్థాయి పెరిగినంత మాత్రాన దాన్ని బ్యాడ్‌ అని ముద్ర వేయడం సరికాదనే చెబుతున్నారు న్యూట్రిషియని్‌స్టలు. ఇదే విషయమై న్యూట్రిషియనిస్ట్‌ స్వాతి మాట్లాడుతూ ‘ కొంతమంది మామిడి తింటే వేడి అని.. సెగ్గడ్డ లేదంటే మొటిమలు వస్తాయని అంటుంటారు. అందులో వాస్తవం కూడా ఉంది. కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా తెలుసుకోవాల్సిందే ! శరీరంలోని మలినాలను బయటకు పంపే క్రమంలో వచ్చే రెస్పాన్స్‌గానే చూడాలి తప్ప రియాక్షన్‌గా కాదు..అని అన్నారు.

మామిడితో బరువు పెం(తుం)చుకోనూ వచ్చు..!
కేలరీలను కౌంట్‌ చేసుకుని మరీ ఆహారం తీసుకుంటున్న రోజులివి. 10 కేలరీలు ఎక్కువైనా 10 రోజులు బాధపడే ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌ కూడా కనిపిస్తుంటారు. ఈ మామిడి పళ్ల సీజన్‌ వీరికి చాలా ఇబ్బంది కరమైన కాలం కిందే చెప్పాల్సి ఉంటుంది. అటు తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత బాధపడకుండానూ ఉండలేరు. నిజానికి మామిడి రెండు రకాల ప్రయోజనాలను ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌కు అందిస్తుంది. మరీ ముఖ్యంగా వెయిట్‌మేనేజ్‌మెంట్‌లో ప్రధాన సూత్రమైన కేలరీస్‌ ఇన్‌.. కేలరీస్‌ ఔట్‌కు అనుగుణంగా..! ఒక మామిడి తింటే శరీరానికి 150 కిలోకేలరీల శక్తి వస్తుందనుకుంటే ఆ మేరకు మిగిలిన ఫుడ్‌ కట్‌ చేసుకోవాల్సి ఉంటుందనేది న్యూట్రిషియని్‌స్టల మాట. మన నగరంలో అనేకాదు చాలా చోట్ల భోజనమైన తర్వాత  మామిడి తీసుకుంటుంటారు. దీనివల్ల అప్పటికే ఓవర్‌గా తీసుకున్న ఫుడ్‌ కేలరీలకు తోడు ఇది కూడా తోడవడం వల్ల శరీరంలో కొవ్వు కంటెంట్‌ పెరుగుతుంది. దానివల్లనే లావు అయ్యామని చాలా మంది భావిస్తుంటారని డైటీషియన్‌ స్వాతి తెలిపారు. మరి మామడితో  వెయిట్‌ ఏ విధంగా తగ్గుతారనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. నిజానికి మామిడి తిన్నప్పుడు తొక్క అందరూ పారేస్తారు. కానీ ఆ తొక్కలోనే బరువు తగ్గడానికి ఉపయోగపడే అంశాలు ఉన్నాయని తేల్చారు. డైటీషియన్లు ఈ ఫలితాల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నా.. మామిడి వల్ల బరువు తగ్గుతుందా అంటే తగ్గుతుంది అని చెప్పొచ్చు. 
మామిడి.. ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ఱశక్తికి తోడ్పడుతుంది: మామిడిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా నీటి శాతం కూడా ఎక్కువ. అందువల్ల మలబద్ధకాన్ని ఇది నివారించడంతో పాటుగా జీర్ణశక్తిని కూడా నియంత్రించి, ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది: మామిడిలో ఫైబర్‌, విటమిన్‌ సీ అధికంగా ఉంటాయి. ఇది సెరల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా లో డెన్సిటీ లిపోప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గిస్తుంది. దీనినే బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ అని కూడా అంటారు.
ఆస్తమా తగ్గిస్తుంది..: అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్‌, బెటా కెరోటిన్‌ అధికంగా తీసుకునే వారిలో ఆస్తమా వృద్ధి చెందే అవకాశాలు తక్కువ అని తేలింది. మామిడిలో బేటా కెరోటిన్‌ అధికంగా ఉంటుంది.
ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఓ మీడియం సైజ్‌ మామిడిలో 15 మిల్లీగ్రాముల విటమిన్‌ కె. ఉంటుంది. శరీరం కాల్షియం స్వీకరించడాన్ని ఇది వృద్ధి చేయడంతో పాటుగా ఎముకల ఆరోగ్యం కూడా పెంచుతుంది.
కంటి ఆరోగ్యానికీ మంచిది: ఓ కప్పుడు మామిడి ముక్కలు రోజూ శరీరానికి కావాల్సిన విటమిన్‌ ఏలో 25 శాతం అందిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడంతో పాటుగా కళ్లు పొడిబారడాన్ని కూడా మామిడి తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తి వృద్ధి చేస్తుంది: విటమిన్‌ సీ, ఏ అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
క్యాన్సర్లు, గుండె పోటు నివారిస్తుంది: మామిడిలో ఉండే ఫైబర్‌, పొటాషియం, విటమిన్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.100 గ్రాములు మామిడిలో 168 మిల్లీగ్రాముల పొటాషియం, 1 మిల్లీ గ్రామ్‌ సోడియం ఉంటాయి. ఇక హార్వార్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అధ్యయనం మామిడిలో బెటా కెరోటిన్‌తో పాటుగా క్యురెసెటిన్‌, ఐసోక్యురెసెటిన్‌, అస్ట్రాగాలిన్‌ లాంటి పదార్థాలున్నాయని ప్రొస్టేట్‌, కొలన్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్స్‌తో పాటుగా లుకేమియా రాకుం డా అడ్డుకోవడంలో ఇవి కొంతమేరకు తోడ్పడతాయని తెలిపింది.
మామిడి తిన్నా నా బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌నే ఉంది..
నాకు పీసీఓఎస్‌ సమస్య ఉం ది. మధుమేహం, బరువు సంబంధిత సమస్యలకు ఇది ఓ కారణమవుతుందని తెలిసిందే ! అందువల్ల ఏం తినాలి, ఏం తినకూడదనే విషయమై చాలా పర్టిక్యులర్‌గా ఉం టాను. అయినప్పటికీ వేసవి వచ్చిందంటే చాలు.. మామిడి పళ్లను తినకుండా ఉండలేను. రోజూ కనీసం 1-2 మామిడి పళ్లు తింటాను. అయినప్పటికీ నేను సంతోషంగా, గర్వంగా చెబ్తున్నాను... నా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పూర్తి నియంత్రణలో ఉన్నాయని.  అలాగే నా బరువు కూడా నియంత్రణలోనే ఉంది. న్యూట్రిషియని్‌స్టగా ఏం తినాలి, ఎలా తినాలనేది నాకు తెలుసు. నా మీల్స్‌తో పాటుగా చేసే వ్యాయామాలు కూడా బ్యా లెన్స్‌ చేసుకుంటూ ఉంటా ను. న్యూట్రిషియని్‌స్టగా మాత్ర మే కాదు ఓ పేషంట్‌గా నేను చెప్పేది మామిడి పళ్లను తినండి.. కానీ ఏ విధంగా మీ డైట్‌తో  బ్యాలెన్స్‌ చేసుకోవాలో తెలుసుకుని తినండి. దానితో పాటు మామిడి పళ్లు తిని కూర్చోకుండా శారీరక శ్రమకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఆ పళ్ల మజాను మరింతగా ఆస్వాదించగలం.

మామిడిలో విటమినులూ, ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మామిడి కాయల్లోని పాలీఫినాల్స్‌ లక్షణాలు పలురకాల కాన్సర్లను నిరోధిస్తాయి. ఊబకాయుల్లో చక్కెర స్థాయిలను మామిడి అదుపుచేస్తుందని పరిశోధనల్లో తేలింది. మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇది రక్త హీనతను నివారించేందుకు దోహదపడుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవారికి మామిడి మంచి మందులా పనిచేస్తుంది. డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి సమస్యలు, మొలలు, ఇలాంటి అన్ని సమస్యలకూ మామిడిపండు మంచి టానిక్‌గా ఉపకరిస్తుంది. మానసికంగా బలహీనులైనవారికి దీని రసం ఉత్తేజాన్నిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుంది.