Wednesday 25 October 2017

Nela Vemu

నేలవేము?
ఇంటి పెరట్లో, అటవీ ప్రాంతాల్లో చిన్న తెల్లని పువ్వులు పూచే ఓ రకమైన మొక్క నేలవేము. ఈ మొక్క కాండము, ఆకులు చాలా చేదుగా ఉంటాయి. దీనికి ఔషధ గుణాలు ఎక్కువని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. తీవ్రమైన జ్వరం, డెంగీ, మలేరియా జ్వరాలు, చికున్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ, చర్మరోగాలు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, సుఖ వ్యాధులకు ఔషధంగా పని చేస్తుందని చెబుతారు.
 
9 మూలకాల మిశ్రమం...
నేలవేము ఆకుల పొడితోపాటు... సొంఠి, మిరియాలు, వట్టివేర్లు, పర్పాటకం, చందనపు పొడి తదితర తొమ్మిది రకాల మూలికలు, పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తమిళనాట పంపిణీ చేస్తున్నారు. ఈ కషాయం తయారైన నాలుగు గంటల్లోపు తాగితేనే ఫలితముంటుందని వైద్యులు చెబుతున్నారు. నేలవేము కషాయంతో తెల్లరక్త కణాలు పెరిగి, రోగ నిరోధక శక్తి అధికమవుతుందని తిరునల్వేలి ప్రభుత్వ సిద్ధ వైద్య కళాశాల ఆచార్యులు, నేలవేముపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన సుభాష్‌ చంద్రన్‌ తెలిపారు.
 
ఈ నేలవేము కషాయాన్ని వారానికి మూడుసార్లు పుచ్చుకుంటే మధుమేహం నియంత్రణలోకి వస్తుందని... సిద్ధ వైద్య పద్ధతిలో తయారైన ఈ కషాయం వల్ల ఎలాంటి హాని ఉండదని ఆయన స్పష్టం చేశారు. నేలవేము డెంగీకి సరైన ఔషధమని చెన్నైలోని అన్నానగర్‌ ప్రభుత్వ సిద్ధవైద్య విభాగం ప్రత్యేక అధికారి డాక్టర్‌. పి. మల్లిక కూడా ధ్రువీకరించారు.

No comments:

Post a Comment