రోజుకో గుప్పెడు అక్రోట్లు(వాల్‌నట్స్) తీసుకుంటే వ్యాధులు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు చెప్పారు.
ఈ సందర్భంగా ఎయిమ్స్ మాజీ చీఫ్ డైటీషియన్ డాక్టర్ రేఖాశర్మ మాట్లాడుతూ పోషకాహార లోపం, శారీరక వ్యాయామం చేయకపోవడంతో భారత్‌లో అనేక మంది కేన్సర్, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. పోషకాహారంతోపాటు అక్రోట్లు ఎక్కువగా తీసుకుంటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని న్యూయార్క్ స్టేట్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అభా చౌహాన్ చెప్పారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండే ఏకైక ‘గింజ’ అక్రోట్’ అని డాక్టర్ హెచ్‌కే చోప్రా తెలిపారు.
No comments:
Post a Comment