ఆయుర్వేద చికిత్స
2. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారిలను పేర్కొనవచ్చు.
3. శుక్ర జనక, ప్రవర్తకాలు: వీటిలో జీడిపప్పు, మినుములు, పాలు చెప్పవచ్చు.
సంతానలేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వమని పేర్కొన్నారు. పురుషుల్లో సంతానలేమిని శుక్ర దోషాలుగా చెప్పవచ్చు. వీర్యకణాలను పెంచే అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్నారు. శృంగార సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాజీకరణ ఔషధాలు ఉన్నాయి. శుక్ర దోషాలను 8 రకాలుగా చెప్పారు. ఇవి వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాల వల్ల ఏర్పడతాయని ఆయుర్వేదశాస్త్రంలో వివరించారు.
వాజీకరణ ఔషధాలు 4 రకాలు ఉన్నాయి.
1. శుక్ర జనకాలు: ఇవి వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. వీటిలో అశ్వగంధ, శతవరి, జీవకం మొదలైనవి ఉన్నాయి. 2. శుక్ర ప్రవర్తకాలు: ఇవి వీర్యాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తాయి. వీటిలో బృహతి, కంటకారిలను పేర్కొనవచ్చు.
3. శుక్ర జనక, ప్రవర్తకాలు: వీటిలో జీడిపప్పు, మినుములు, పాలు చెప్పవచ్చు.
4. శుక్ర బోధకాలు: వీర్యంలోని దోషాలను నివారించేవి. వీటిలో కోకిలాక్ష, కూష్మాండ, ఉసిర, చెరకు రసం చెప్పవచ్చు.
పురుషుల వీర్యంలో ఎలాంటి లోపాలున్నా ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. ఔషఽధాలతో పాటు మానసిక ఆందోళనలను తగ్గించుకొని, ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ వహించాలి. సంతాన, శృంగార సమస్యలపై అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా ఔషధాలు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.
No comments:
Post a Comment