Sunday 16 July 2017

alasandalu

రక్తపోటు అనేది ఇప్పుడు అందరినీ బాధపెట్టే ఆరోగ్య సమస్య అయిపోయింది. రక్తపోటు వలన అప్పటికప్పుడు వచ్చే పెనుముప్పు పెద్దగా లేకపోయినా దీర్ఘకాలంలో ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యతో బాధపడేవారు మందుల మీద ఉన్న శ్రద్ధను ఆహారం తీసుకోవడం మీద ఉంచరు. ఆహారంలో ఉప్పును తగ్గించడం మీద దృష్టి కేంద్రీకరిస్తారే తప్ప బిపిని అదుపులో ఉంచే ఆహారం గురించి ఆలోచించరు. రక్తపోటుతో బాధపడేవారికి అలసందలు మంచి మందుగాఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. వీటిని ఉడికించి చేసే ఆహారపదార్థాలు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని వారు చెబుతున్నారు. వీటిల్లో ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయంటున్నారు. రక్తపోటుతో బాధపడేవారు కాఫీ, టీలతో పాటు శీతల పానీయాలను తీసుకోవడం బాగా తగ్గించడం లేదా, తీసుకోవడం పూర్తిగా మానివేస్తే మంచిదని సూచిస్తున్నారు. వీటికి బదులుగా నీరు, పళ్ళరసాలను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment