దంపుడు బియ్యం
సాధారణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపించడం ద్వారా బాయిల్డ్ రైస్, పాలిషింగ్ రైస్‌లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ తరహా పాలిషింగ్ పక్రియలో బియ్యంలో గల చాలా పోషక పదార్థాలు తొలగిపోతాయి. చూడడా నికి అందంగా కనిపించే ఈ వైట్ రైస్‌తో పోలిస్తే దంపుడు బియ్యంలో చాలా పోషక విలువలున్నాయి.
ధాన్యాన్ని యాంత్రికంగా కాకుండా సాధారణ పద్ధతిలో వడ్లను రోకలితో దంచడం ద్వారా లభించే బియ్యమే ఈ దంపుడు బియ్యం. దీన్నే ముడిబియ్యం లేదా బ్రౌన్ రైస్ అంటారు. పీచు (ఫైబర్), కార్బోహైడ్రేట్స్, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఈ బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యకు చెక్ చెబుతుంది. సాధారణ పాలిష్డ్ బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి వెంటనే ఆకలి వేయదు. దంపుడు బియ్యంతో వండే అన్నాన్ని తినడం వల్ల గుండెజబ్బులు, రొమ్ము కేన్సర్ వంటి వ్యాధుల బారినపడకుండా ఉండవచ్చు. సాధారణ రైస్ ధరకే ఈ దంపుడు బియ్యం కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో దంపుడు బియ్యం రూ.50 నుంచి లభిస్తున్నాయి.
No comments:
Post a Comment