Sunday, 6 August 2017

korra biyyam

కొర్రబియ్యం లేదా కొర్రలు
చిరుధాన్యాలుగా పిలవబడే ఈ కొర్రలు అతి ప్రాచీణ కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తప్పా పట్టణ వాసులకు పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుతం నగరంలోని చాలా దుకాణాల్లో కొర్రలను విక్రయిస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి కిలో రూ.70 నుంచి రూ.120 వరకూ ధర పలుకుతుంది. ఈ కొర్రల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నందున ఇప్పుడు చాలామంది వీటిని వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొర్రలను అన్నం మాదిరిగానే వండుకుని తింటారు. బియ్యాన్ని వండిన విధానంలోనే కొర్రలనూ వండుతారు. అయితే వండడానికి సుమారు రెండు గంటల ముందు వీటిని నానబెడతే సరిపోతుంది.
 
పీచు పదార్థం కలిగి వుండే కొర్రల్లో ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు, థైమిన్‌, రిబోఫ్లావిన్‌ వంటి పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇవి డయాబెటిస్‌ రోగులకు మంచి ఔషధం. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అజీర్తి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. కొర్రలు వినియోగంతో జీర్ణనాళం శుభ్రం కావడంతో పాటు యూరినల్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యలను దూరం చేస్తుంది... ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అంతేకాక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు కొర్రలులో ఉన్నందునే వీటి వినియోగానికి నగరవాపులు ఎక్కువ ఎక్కువ చూపుతున్నారు

No comments:

Post a Comment