Friday, 10 November 2017

capsicum

బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కు గా లభిస్తుంది. రకరకాల రంగుల్లో సైతం లభ్యమవుతుంది. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకు పచ్చవే. ఒక రోజుకు కావాల్సిన సి విటమిన్‌ ఒక్క క్యాప్సికంలోనే దొరుకుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం... క్యాప్సికంలో విటమిన్‌ సి, బి, ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంన్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌, బీటా కెరోటిన్‌, ఎంజైమ్స్‌ శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్‌ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాప్సికం తీసుకోవడం మూలంగా జుట్టు ఊడి పోవడం తగ్గుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారినిగా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలున్న క్యాప్సికాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనకు అందబాటులో దొరికే క్యాప్సికం వాడేందుకు ఎందుకింక ఆలస్యం.. రోజు వారి కూరగాయల్లో ఒక రోజు క్యాప్సికాన్ని కూడా చేర్చుకుందాం.

No comments:

Post a Comment