Tuesday 24 October 2017

kakarakaya








అనాదిగా ఆసియాలో ప్రసిద్ధిచెందిన పాదుమొక్క కాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది చేదుగా మొహం పెట్టేస్తారుగానీ కాకరకాయ మనదేశంలో ఎప్పటినుండో ఔషధంగా ఉపయోగపడుతోంది. సంప్రదాయ వంటకాల్లో వారానికి ఒకసారైనా కాకరకాయ కూర, కాకరకాయ పులుపు తినాలని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శరీరంలో సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు నిలయంగా మారుతున్న మనదేశంలో కాకరకాయరసం ఇప్పుడు ఇంటింటా దివ్యౌషధంగా మారింది. కాకరకాయ జ్యూస్‌ బ్లడ్ సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్‌ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్‌ బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి. దీని ఆకులు, పండిన కాయలు ఉడికించి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మొటిమలు, మచ్చల నివారిణి కూడా.

No comments:

Post a Comment