Saturday, 24 June 2017

Gummadi /Pumpkin and its seeds



























  • గుమ్మడి గింజల్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
  • గుమ్మడి గుజ్జులోని బీటా కెరొటిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఇందులోని ప్రొటీన్లు జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తాయి.
  • విటమిన్‌-కె ఇందులో బాగా ఉంది. ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.
  • పోషకవిలువలు కూడా అధికంగా ఉన్నాయి. పైగా కెలొరీలు తక్కువ.
  • దోసగింజలు, వాటి ఆకులు, జ్యూసుల్లో పోషకాలు బాగా ఉంటాయి.
  • గుమ్మడిలోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  • ఇందులోని యాంటాక్సిడెంట్లు కంటిచూపు తగ్గకుండా కాపాడతాయి.
  • బేకింగ్‌ రెసిపీల్లో వెన్న, నెయ్యికి బదులు గుమ్మడి ప్యూరీని వాడితే ఆరోగ్యానికి మంచిది.
  • గుమ్మడిలోని బీటా కెరొటిన్‌ కొన్ని క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.
  •  ఇందులోని విటమిన్‌-సి వల్ల గుండెజబ్బులు, ఆస్తమా సమస్యలు ఉండవు.
  •  చర్మం సాగకుండా, శరీరం శుష్కించకుండా కాపాడుతుంది.
  • గుమ్మడిలాంటి మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులను తింటే బరువు పెరగరు.
  • ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.
  • దీని వినియోగం వల్ల చర్మం చాయ పెరగడంతోపాటు శిరోజాలూ పెరుగుతాయి. ఎనర్జీ పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉంటుంది.
  • పీచుపదార్థాలు కూడా ఇందులో ఎక్కువ.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • మెనోపాజ్‌లో అడుగుపెట్టిన మహిళల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంతో మంచిది.
  • యాంటి-ఇన్‌ఫ్లెమేటరీ ప్రయోజనాలు కూడా పొందుతాము.
  • మంచి నిద్ర పడుతుంది.
  • గుమ్మడికాయ వినియోగం వల్ల బ్లాడర్‌ స్టోన్స్‌ రిస్కు తగ్గుతుంది.



గుమ్మడి కాయలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అనేకం. మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా-కెరోటిన్‌ చాలా ఎక్కువ. అంతగా చె ప్పుకునే క్యారెట్‌లో కన్నా ఇది గుమ్మడిలోనే ఎక్కువ. బీటా కెరోటిన్‌ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమయ్యే పదార్థం కూడా. దీన్ని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు ఇస్తే హాయిగా తినేసి ఆరోగ్యంగా ఉంటారు. దీని విశేషాల గురించి తెలిసి, కొంతకాలంగా విదేశీయులు కూడా భోజనంలో వాడేస్తున్నారు. ప్రత్యేకించి సూప్స్‌లో దీని వాడకం బాగా ఎక్కువయ్యింది. కూరగానో, సాంబార్‌గానో వాడే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ.
చర్మానికీ, శిరోజాలకూ ఇవెంతో ఉపకరిస్తాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఇట్టే తొలగిపోతుంది., విటమిన్‌-సి కూడా ఎక్కువగా ఉండే గుమ్మడి వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా విశేషమైనవే. వీటిలో సమ్దద్ధిగా ఉండే జింకు, ప్రోస్టేట్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా స్త్రీ పురుషులు ఇరువురిలోనూ లైంగిక వ్యవస్థను ఆరోగ్యపరుస్తుంది. వీటితో పాటు రప్రొటీన్‌, పొటాపియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఎస్నెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉండడం వల్ల గుమ్మడినొక సమస్త పోషకాల నిధిగా న్యూట్రిషియన్లు చెబుతుంటారు ఇవేమీ తెలియక చాలా మంది పందిరి మీద అవి ఓ భారమన్నట్లు తెంపి పారేస్తుంటారు. కానీ, ఒకసారి ఈ విశేషాలన్నీ తెలిస్తే, అమృతంలా ఆస్వాదిస్తారు.




గుమ్మడిలోని ఆరోగ్య సుగుణాలివి...
  • గుమ్మడికాయలో కెరొటనాయిడ్స్‌, పీచుపదార్థాలు, పొటాషియం, విటమిన్‌-సిలతో పాటు జింక్‌, ఐరన్‌, కాల్షియం, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు ఉన్నాయి.
  • చలికాలంలో జింకు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • పోషక విలువలు కూడా వీటిల్లో పుష్కలం. విటమిన్‌-ఎ అధికం.
  •  క్యాలరీలు తక్కువ.
  •  వీటిల్లోని యాంటి ఆక్సిడెంట్ల వల్ల క్రానిక్‌ జబ్బుల రిస్కు తక్కువ.
  • ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.
  • గుమ్మడికాయలో విటమిన్‌-సి ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్తకణాలను వృద్ధి చేస్తుంది. దీంతో రోగనిరోధక కణాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు తొందరగా మానిపోతాయి.
  • వీటిలోని విటమిన్‌-ఎ, ల్యూటిన్‌, జెక్సాన్‌థిన్‌లు కంటిచూపును పరిరక్షిస్తాయి. విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసి కంటిలోని కణాలను ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.
  •  పోషకవిలువల గాఢత ఎక్కువ. ఇందులోని తక్కువ క్యాలరీల వల్ల బరువు తగ్గుతారు.
  • గుమ్మడికాయలోని యాంటి ఆక్సిడెంట్లు ఉదరం, గొంతు, పాంక్రియాస్‌, రొమ్ము కేన్సర్ల రిస్కు నుంచి కాపాడతాయి.
  •  పొటాషియం, విటమిన్‌-సి, పీచుపదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  •  గుమ్మడికాయలోని బెటా కెరొటినా సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా నేచురల్‌ సన్‌బ్లాక్‌గా పనిచేస్తుంది.
  • ఇందులోని విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • గుమ్మడికాయ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి.
  • మధుమేహాన్ని గుమ్మడి నియంత్రిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ని కట్టడి చేస్తుంది.
  • చర్మ సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. దాంతో యంగ్‌గా కనిపిస్తారు.
  • కాలేయాన్ని శుభ్రంచేస్తుంది. దీన్ని కొద్దిగా తింటే చాలు కడుపునిండుగా ఉండి ఆకలి ఉండదు.


No comments:

Post a Comment