Saturday, 16 September 2017

Juvvi chettu

జువ్వి పండ్లను మధ్యకు రెండుగా కోసి తేనెలో వేసి నెల రోజుల పాటు ఊరనిస్తే లేహ్యంగా తయారవుతుంది. ఈ లేహ్యాన్ని ఒక ఉసిరికాయ పరిమాణంలో రోజుకు రెండు పూటలా తింటే, అన్ని రకాల వాపులూ హరించుకుపోతాయి.
జువ్వి పట్ట చూర్ణంతో గానీ, జువ్వి పుల్లతో గానీ, దంత దావనం చేస్తే దంత వ్యాధులు నశించడంతో పాటు, కదులుతున్న దంతాలు కూడా గట్టిపడతాయి.
జువ్వి చెట్టు పాలు తీసి పుండ్ల మీద పట్టు వేస్తే, తీవ్రమైన రాచపుండ్లు కూడా మానిపోతాయి. జువ్వి పట్ట కషాయంతో పుండ్లను కడిగినా తొందరగా మానిపోతాయి.
100 మి. లీ జువ్వి బెరడు కషాయంలో 10 గ్రాముల చక్కెర కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తే తల తిరుగుడు వ్యాధి (వెర్టిగో) తగ్గిపోతుంది.
మర్రి, రావి, మేడి, గంగరావి, జువ్వి వీటి బెరడులను కషాయంగా కాచి, స్త్రీలు తమ జననాంగాన్ని శుభ్రం చేస్తే, ఆ బాగంలోంచి వచ్చే దుర్ఘంధ స్రావాలు త గ్గిపోతాయి. గర్భాశయ ముఖద్వారంలో వచ్చే పుండ్లు (సర్వికల్‌ ఎరోషన్స్‌) సమూలంగా హరించుకుపోతాయి. లేదా పచ్చి జువ్వి పట్టను మెత్తగా నూరి ఉండలా చేసి జననాంగంలో ఉంచినా ఈ స్రావాలు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యుల మాట.

No comments:

Post a Comment