Friday 15 September 2017

Kalabanda Aloe vera

శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద వైద్యనిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.
ఇదీ నేపథ్యం..
కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు ‘కుమారి’ అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు. పాశ్చాత్యులైతే ఐదు దశాబ్దాలుగా కలబందపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మరోగాలు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు. అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

అలోవెరాను కాలిన గాయాలకు, ఎముకల సమస్యలకు ఉపయోగించేవారు. దీన్ని తీసుకున్న వెంటనే వేగంగా రక్తశుద్ధి జరిగి, రక్తంలోని ఉత్ర్పేరక అవశేషాలు తొలగిపోతాయని చెప్పలేం.


అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




 సాధారణంగా మనకు అందుబాటులో ఉండే కలబంద ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెంట్రుకల మొదళ్ల నుంచి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని జట్టుకు క్రమం తప్పుకుండా పట్టించడం వల్ల జుట్టు పెరగటంతో పాటు, పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. వీటిని ఎలా వాడాలో ఓసారి చూద్దాం...
  • తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లకు పట్టించాలి. ఈగుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతకాణాలను తొలగించి చండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలిగిస్తుంది. అంతే కాక తేమను అందించి జట్టు పొడిబారకుండా చేస్తుంది.
  • పావు కప్పు కలబంద గుజ్జులో రెండు చెంచాల అలివ్‌ ఆయిల్‌ కలపాలి. ఈ మిశ్ర మాన్ని కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే చండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జుకి పెద్ద చెంచా ఆము దం, చెంచా మెంతి పిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారా క ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి వారం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

No comments:

Post a Comment