Thursday, 14 September 2017

Jaji kaya ( Nut meg)

జాజి ఆకులను నమిలి మింగుతూ ఉంటే నోటి అల్సర్లు తగ్గుతాయి. ఓ 20 ఆకులను కషాయంగా కాచి దానితో పుక్కిలించినా ఈ అల్సర్లు తగ్గుతాయి. జాజి ఆకుల రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి, సన్నని మంటపై రసం ఇగిరే దాకా కాచి తయారు చేసిన తైలాన్ని చెవిలో వేస్తే, చెవిలో రంధ్రం కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
20 తాజా జాజి పూలను మెత్తగా రుబ్బి, ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం క్రమక్రమంగా కాంతి వంతంగా తయారవుతుంది.
జాజి ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతి రోజూ పట్టిస్తే, పగుళ్లు మానడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి.
జాజి పూల యుక్తంగా కొమ్మలను ముక్కలుగా కత్తిరించి ఆరలీటర్‌ నీటిలో వేసి, పావులీటరు మిగిలేదాకా కాచి, ఆ తర్వాత వడబోయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తయారు చేసుకుని సేవిస్తే, రుతుక్రమం చక్కబడుతుంది. స్త్రీ జననాంగానికి సంబంధించిన పలు వ్యాధులు తొలగిపోయి సంతాన యోగ్యత కలుగుతుంది.
చీము పట్టి దీర్ఘకాలికంగా వేధిస్తున్న మొండి వ్రణాలను జాజి ఆకుల కషాయంతో కడిగితే చాలా త్వరితంగా మానిపోతాయి.
30 మి.లీ జాజి ఆకుల కషాయాన్ని కొద్ది రోజుల పాటు తాగితే మూత్రాశయం నొప్పి తగ్గుతుంది.

No comments:

Post a Comment