Monday, 18 September 2017

parijatam poolu

పారిజాతం ఆకులను మెత్తగా దంచి, ఆముదం కలిపి వేడి చేసి కడితే, వాతపు నొప్పులు తగ్గుతాయి.రోజుకు ఒక పారిజాతం గింజ చొప్పున తింటూ ఉంటే అర్శమొలలు తగ్గుతాయి.
బాగా పెరిగిన 15 పారిజాతం ఆకులను సన్నని ముక్కలుగా తరిగి, రెండు కప్పుల నీళ్లల్లో వేయాలి. ఆ తర్వాత సన్నని మంట పైన అరకప్పు ద్రావణం మాత్రమే మిగిలేలా మరిగించి, వడబోయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో పావు స్పూను మిరియాల పొడి కలిపి, ప్రతి రోజూ, ఉదయం, సాయంత్రం సేవిస్తే, సయాటికా నొప్పి తగ్గిపోతుంది.
 పారిజాతం ఆకులు, సీతమ్మ నూలు పోగులు (అమర్‌బేల్‌), ఊడుగ ఆకులు ప్రతిదీ పిడికె డు చొప్పున తీసుకుని, వాటిని పావు లీటరు ఆవనూనెలో నీరంతా ఆవిరైపోయే దాకా మరిగించి వడబోసి అందులో ఒక తులం రాతి పువ్వు చూర్ణం కలపాలి. ఆకుల కషాయాన్ని లోనికి సేవిస్తూ, ఈ తైలాన్ని మర్ధనం చేస్తూ, విశ్రాంతి తీసుకుంటే సయాటికా నొప్పి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది.
 ఎండిన పారిజాతం గింజలను మెత్తగా పొడి చేసుకుని, ఆ పొడికి తగినంత నీటిని కలిపి పేస్టులా చేసుకుని తలకు పట్టిస్తూ ఉంటే చుండ్రు, తలపైన వచ్చే పొక్కులు నశిస్తాయి.
గుప్పెడు పారిజాతం ఆకులను ముక్కలుగా కత్తిరించి, లీటరు నీటిలో వేసి, 200 మి.లీ అయ్యేదాకా మరిగించి ఆ కషాయాన్ని 100 మి.లీ మోతాదులో రోజుకు రెండు పూటల 5 రోజుల పాటు తాగితే రక్త శుద్ధి కలుగుతుంది.

No comments:

Post a Comment