Monday, 20 November 2017

battayi

పండులో ఫ్లావనాయిఢ్స్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ బి- కాంప్లెక్స్‌, విటమిన్‌- సి సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటు నివారణకు ఈ పండు మంచిది. గుండెకు బలాన్ని ఇస్తుంది. బత్తాయి రసంలో తేనె కలిపి పడుకునే ముందు తీసుకుంటే సుఖవిరేచనం అవుతుంది. బత్తాయి రసాన్ని రోజూ తీసుకుంటే మచ్చల్ని మాయం చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేసేలా గ్రంధుల్ని ప్రేరేపించే గుణాలు బత్తాయిలో ఉన్నాయి. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాలను బయటికి వెళ్లిపోయేలా చేస్తాయి.
 
బత్తాయి రసం ఊపిరి తిత్తులను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లకు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కామెర్ల వ్యాధినుంచి కోలుకున్న వారిలో ఉండే బలహీన తను నీరసాన్ని పోగొట్టడంలో బత్తాయి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, ర క్త ప్రసరణ చక్కబడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
ఉదయం వేళ యోగా, వాకింగ్‌, జాగింగ్‌ చేసిన తర్వాత ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే, అలసిన శరీరం వెంటనే శక్తివంతమవుతుంది. ఎసిడిటీకి కారణమయ్యే బుడగలను నివారించడం లో బత్తాయి రసం ఉపకరిస్తుంది. రుమాటిక్‌ తరహా వాపు సంబంధిత రుగ్మతలనుంచి బత్తాయి ఉపశమనం కలిగిస్తుంది.

No comments:

Post a Comment