Thursday 8 June 2017

Onions

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే వండే ప్రతీ కూరలో ఉల్లి తప్పనిసరి చేశారు మన పూర్వీకులు. తాజాగా, ఎర్రని ఉల్లిగడ్డను తింటే కేన్సర్‌ను దీటుగా ఎదుర్కొనవచ్చంటున్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ గుల్ఫ్‌ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధకుల బృందంలో భారతీయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఉల్లిగడ్డలో ఉండే ‘క్వెర్సెటిన్‌’ కేన్సర్‌ కణాలకు ప్రతికూల వాతావరణం కల్పించి కణాల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుందని, తద్వారా కేన్సర్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని వివరించారు. కేన్సర్‌ కణాలను అచేతనంగా కూడా మార్చుతుందని వెల్లడించారు.

 ఉల్లిపాయలో ఉండే క్విర్‌సిటైన్‌(quercetin ) అనే ఫ్లేవనాయిడ్స్‌ పలు వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. ఇప్పుడు ఈ గుణాలు ప్రా‍ణాంతకమైన కేన్సర్‌తో పోరాడతాయన్న విషయం కెనడా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఎర్ర ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్‌తో పాటు ఆంథోసియానిన్‌ (anthocyanin )ను కలిగి ఉంటాయంటున్నారు. వీరు ఐదురకాల ఉల్లిపాయలను పరిశీలించారు. వీటిల్లో ఎర్ర ఉల్లిపాయలోనే ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఇవి కేన్సర్‌ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని చెబుతున్నారు. ఎర్ర ఉల్లిపాయ కేన్సర్ కణాలను ఎదుర్కొంటుందే తప్ప రాకుండా అడ్డుకోలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కేన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చా అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేదు, ఉల్లిపాయలలో ఎర్ర ఉల్లిపాయను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిదని వీరు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయను దగ్గర పెట్టుకోమని మన ఇంట్లో పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటారు. అంతేకాదు చర్మ, కేశ సౌందర్యానికి అండగా నిలుస్తుంది ఉల్లి. అలాంటి ఉల్లి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.

  • శ్వాసకోశ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
  • ఎముకలను బలోపేతం చేస్తుంది.
  • క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది.
  • మెదడును పరిరక్షిస్తుంది.
  • జీర్ణక్రియ సరిగా జరిగేలా చూస్తుంది.
  • రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది.
  • యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.
  • యాంటిబయోటిక్‌ కూడా పనిచేస్తుంది.
  • బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
  • చర్మానికి ఎంతో మంచిది.
  • జలుబు, ఫ్లూ జ్వరాలపై బాగా పనిచేస్తుంది.
  • శిరోజాలు పెరిగేందుకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది.
  • గాస్ట్రోఇంటస్టైనల్‌ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
  • ఎలర్జీలను నివారిస్తుంది.
  • మూత్ర సంబంధమైన సమస్యలను తగ్గిస్తుంది.
  • కలరా తగ్గించడంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది.
  • విటమిన్‌-సి, విటమిన్‌-బి6, విటమిన్‌- బి1, విటమిన్‌-బి9లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కాపర్‌, మాంగనీసు, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం ఖనిజాలు ఉన్నాయి.
  • నిద్రలేమిని తగ్గిస్తుంది.
  • గుండెకు మేలు చేస్తుంది.
  • పీచు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు పుష్కలం ఉల్లిలో.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • తేనెటీగ కుట్టినపుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తహీనతతో బాధపడేవారు ఉల్లిని తింటే మంచిది.
  • గొంతునొప్పి, దగ్గుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
  • చర్మంపై కురుపులను, తలలో చుండ్రును తగ్గిస్తుంది.


No comments:

Post a Comment