బాదంపప్పు అనగానే..ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటాం. అయితే ఆల్‌మండ్‌లో ఉండే ఫ్యాట్ శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అడపాదడపా బాదాంపప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. బాదంతో కలిగే లాభాలు..
బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్ కారక కణాలను నిలువరిస్తాయి.
బాదంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం డయాబెటిక్‌ను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
శరీర బరువు తగ్గించడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం అవుతుంది.
బాదంలో సమృద్ధిగా ఉండే కాపర్, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.
రోజూ కొన్ని పప్పుల్ని తినడం వల్ల ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.
No comments:
Post a Comment