Tuesday 29 November 2016

Usiri Useful for Sugar Control




















జీవనశైలితో ముడిపడిన ఆరోగ్య సమస్య మధుమేహం. దేశ జనాభాలో సుమారు 20శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్‌తో బాధపడటం కనిపించదు. అందుకనే మధుమేహ రోగుల ప్రపంచ రాజధానిగా భారత్‌ని పిలుస్తున్నారు. మన దగ్గర ఇంత ప్రబలంగా ఉన్న ఈ ఆరోగ్య రుగ్మతని మనకు తెలిసిన దేశీయ పద్ధతుల్లోనే అదుపులో పెట్టేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. విటమిన్‌ సీ పుష్కలంగా దొరికే ఉసిరిని తీసుకోవడం, యోగాలో కీలకమైన ప్రాణామాయం ఆచరించడం ద్వారా చాలావరకు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచొచ్చునని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌ విభాగం అధ్యయనంలో తేలింది. ఇప్పటిదాకా.. చచ్చేదాకా మందులు వాడుకోవడం తప్ప మరే నియంత్రణ మార్గం లేదనే భావనతో ఉన్న బాధితుల్లో తిరిగి ఆశలను పుట్టించింది.
మందులు, పథ్యం కన్నా..
ఏడాదిపాటు గుంటూరులో అధ్యయనం సాగింది.. యూజీసీ మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ కింద... గుంటూరు జిల్లా పరిధిలో 120 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరంతా 40 ఏళ్ల లోపు వారే. 30 మందిని కంట్రోల్‌ గ్రూప్‌గా, 90 మందిని ఎక్స్‌పరమెంటల్‌ గ్రూపుగా విడగొట్టారు. ఎక్స్‌పరమెంటల్‌ గ్రూపు తిరిగి 30 మంది చొప్పున మూడు భాగాలు చేశారు. ఒక గ్రూపు సభ్యులకు పథ్యం పెట్టారు. రెండో గ్రూపువారితో రోజుకు గంటసేపు ప్రాణాయామం చేయించారు. మూడో గ్రూపు సభ్యులకు పథ్యం, గంట ప్రాణాయామం, రోజుకు 35 కిలోగ్రాముల ఉసిరి అందించారు. ప్రాణాయామం చేస్తూ, ఉసిరి తిన్నవారిలో మధుమేహం నియంత్రణలోకి వచ్చింది. ఇక.. కంట్రోల్‌ గ్రూపులోని 30 మంది మందులు వాడుకొంటూ.. అధ్యయనంలో పాల్గొన్నారు.
శ్వాస మెరుగైతే స్వస్థత దొరికినట్టే

‘‘ప్రాణాయామం ద్వారా శ్వాస మెరుగుపడి మెదడుకి అధికంగా ఆక్సిజన్‌ అందుతుంది. దీనివల్ల మెదడు ఉత్తేజితమై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేస్తుంది. మా అధ్యయనంలో పాలుపంచుకొన్నవారిలో గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ స్థాయి 6.6 నుంచి 7.1 మధ్య నమోదవడం గమనించాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉసిరికి ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ని నియంత్రణలో ఉంచడంలో దోహదపడతాయి’’







చలికాలంలో లభించే ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. దీనితోపాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, మురబ్బా, క్యాండీ, జ్యూస్‌.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఉసిరి కాయలు నేరుగా కూడా తినేయొచ్చు. డ్రై ఆమ్లా క్యాండీలు కూడా చప్పరించేయొచ్చు.
  • గొంతు మంట, జలుబుతో బాధపడేవారు 2 టీస్పూన్ల ఉసిరి పొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 
  • ఇందులో ఉన్న పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
  • రోజూ పరగడుపున ఉసిరి రసం పుక్కిలించడం ద్వారా నోటిలో వచ్చే పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
  • ఆర్థరైటిస్‌ వంటి కీళ్ల నొప్పుల నివారణకు ఎండు ఉసిరి ఉపయోగపడుతుంది. 
  • రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. 
  • దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఉసిరి నూనె వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన కేశసంపదను అందిస్తుంది. కుదుళ్లకు తగిన బలాన్నిచ్చి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. 
  • తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. 
  • ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెసా్ట్రల్‌ స్థాయులు తగ్గి, గుండె పనితీరు మెరుగు పడుతుంది. 
  • శరీరం నుంచి చెడు టాక్సిన్లను బయటకు పంపడానికి ఉసిరి రసం సహాయపడుతుంది.విటమిన్లు, లవణాలు, ఎంజైములు వీటికోసం ప్రతి రోజూ మనం పలురకాల ఆహార పానీయాలు తీసుకోవచ్చు. అయితే, అలా తీసుకున్న వాటిలో ఏ ఒక్క అంశాన్నీ శరీరం గ్రహించలేకపోతే ఏమవుతుంది? ఎంతో పౌష్టికాహారం తీసుకుంటున్నాం కదా అని మనం అనుకుంటాం. కానీ, రోజురోజుకూ శరీరం క్షీణిస్తుంటుంది. అయితే ఉసిరి కాయను ఆహారపానీయాలతో కలిపి తింటే, మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా వంటబడతాయి. వీటితో పాటు, జీర్ణాశయంలోని ఆమ్లాలను సమస్థితికి తేవడం, కాలేయాన్ని ఉత్తేజితం చేయడం, మెదడు శక్తిని పెంచడం, ప్రాణశక్తిని పెంచడం, కండరాల పటుత్వాన్ని పెంచడం, శ్వాసకోశాల బలాన్ని పెంచడం, శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను బయటికి పంపడం వంటి విధులన్నీ ఉసిరి సమర్థవంతంగా నిర్వహి స్తుంది. వీటితో పాటు రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా చేయడం, చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గించడం వంటి ప్రక్రియలు కూడా ఉసిరి వల్ల సాధ్యమవుతాయి. చర్మసౌందర్యాన్ని పెంచడంలో కూ
    • ఆరోగ్యానికి ఉ‘సిరి’!
    • ఔషధఫలం అంటున్న వైద్య నిపుణులు
    • త్రిఫలాల్లో ఒకటిగా ప్రసిద్ధి
    • ఎన్నో వ్యాధుల నివారణకు దివ్యౌషధం
    ఉసిరి..ఆరోగ్యానికి దివ్యౌషధమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అలాగే..మన పూర్వీకులు ఔషధగుణాలున్న త్రిఫలాల్లో ఒకటిగా భావించేవారు. ఉసిరి, కరక్కాయ, తాని (తాండ్ర)కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపేవారు.
    చెట్టుకూ ప్రత్యేకత..
    ఉష్ణప్రదేశాల్లో సహజసిద్ధంగా పెరిగే ఉసిరి చెట్టు భారతీయ సంస్కృతిలో ఎంతో పేరొందింది. హిందువులకు ఉసిరిచెట్టు ఒక పవిత్ర వృక్షం. ఉత్తర భారతదేశం వారు అక్షయ పర్వదినం సందర్భంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు. తెలుగువారు కూడా కార్తీక వనసమారాధనలో ఈ చెట్టు నీడలో వనభోజనాలు చేస్తారు. ఎన్నో వైద్య పరమైన ప్రయోజనాలున్నాయని మన పూర్వీకులు పద్మపురాణంలో చెప్పగా, ఆయుర్వేదం.. ఉసిరి ఔషధ గుణాలను తెలియజేస్తోంది. ఉసిరి కాయల రంగు, సైజులనుబట్టి రకరకాలున్నాయి. త్రిఫలాలను పంచదారతో కలిపి గతంలో ఏనుగులకు తినిపించేవారని.. అవి ఎంతో బలిష్టంగా ఉండేవని చెబుతారు. దీంతో ఇవి ఎంతో బలవర్థకమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు నశింపకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో నిల్వచేసుకోవాలి. లేదా ఎండబెట్టి పొడిచేసుకోవాలి.
    ప్రయోజనాలు ఇవీ..
    • ఉసిరి అమృత ఫలం. శరీరానికి చలువ చేస్తుంది.
    • వీర్యవృద్ధి, కేశవృద్ధి కలుగుతుంది.
    • ఉసిరి కాయ తిన్నవెంటనే నీరు తాగితే.. ఎంతో తియ్యగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో, కఫాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
    • ఉసిరిలో ‘సి’ విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒక పెద్ద నారింజ పండులోకంటే ఉసిరిలో ఇరవై రెట్లు సి విటమిన్‌ లభిస్తుంది.
    • ఉసిరి కాలేయానికి పనికి వచ్చే లివర్‌టానిక్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజు వినియోగిస్తే లివర్‌ పనితనం పెరిగి మనిషికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
    • మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే దివ్యౌషధంగా ఉపయోగపడుతోంది.
    • అజీర్ణం, గ్యాస్టిక్‌లకు ఔషధంగా పనిచేస్తుంది.
    • తేనెతో కలిపి తాగితే కడుపులోని క్రిములు నశించి, పచ్చకామెర్లు, దగ్గు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
    • ఉసిరి కాయలోని పిక్కల పప్పును తీసి చూర్ణం చేసి, దాని కషాయం తాగితే జ్వరాలు తగ్గడమే కాకుండా మధుమేహ నివారణకు ఉపయోగకరం.
    • పలు ఆయుర్వేద ఔషధాల్లోనూ, శిరోజాల వృద్ధి మందులు, నూనెల్లోనూ, షాంపూలు వంటి అనేక రకాలైన వాటిలో ఉసిరిని ప్రధాన ఔషధంగా వినియోగిస్తున్నారు.
    డా ఉసిరి పాత్ర కీలకమే. ఉసిరిని రసంగా, మురబ్బాగా, పచ్చడిగా, చట్నీగా ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరి ఫలితాలు పరిపుష్టంగా లభిస్తాయి.





సిరిలోని ఔషధ గుణాలు ఇవే... 
ఉసిరిని ఎక్కుగా ఆయుర్వేద మందుల తయా రీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబు తున్నారు. ఇందులో క్యాల్షియం. ఐరన్‌, ప్రొటీన్లు, పా స్పరస్‌ కార్బోహైడ్రేడ్లు, సివిటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయని వారు అంటున్నారు. జ్ఞాపకశక్తిని, తెలివి తేటలను పెంచేందుకు ఉసిరి దివ్యౌషధంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. ఉసిరిని పొడిగా లేదా ముక్కలుగా ఏదోఒక రూపంలో ప్రతీ రోజు కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. 
ఉసిరితో మరెన్నో ఉపయోగాలు... 
ఉసిరితో మరిన్ని ఉపయోగాలున్నాయి. శరీ రంలోని వేడిని, జలుబు, కోరింత దగ్గును తగ్గి స్తుంది. వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తుంది. కడుపు, పేగుల్లో మంటను అరికడుతుంది. అధిక దాహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. ఉసిరి కలిపిన నూనెను వాడితే జుట్టు నిగనిగ లాడడంతో పా టు జుట్టు రాలడం ఆగుతుంది. దీనితో త యారు చేసిన టానిక్‌ వాడితే ఊపిరి తిత్తుల పని తీరును మెరుగుపరుస్తుంది. 
చరిత్రతోనే ఉసిరికి ప్రత్యేక పూజలు... 
పురాణాల కా లం నుంచే ఉసిరికి ఓ చరిత్ర ఉంది. ఆ కాలంలో జలంధరుడు అనే రాక్షసుడు ఒకానొక సందర్భం లో పార్వతిని మోసం చేస్తాడు. దీంతో ఆమె విష్ణు మూ ర్తికి ఫిర్యాదు చేస్తుంది. దీంతో విష్ణువు జలంధరుడిని అదే రీతిలో మోసం చేయాలని ప్లాన్‌ చేస్తాడు. జలంధరుడి భార్య బృందను మోసగించేం దుకు విష్ణుమూర్తి జలం ధరుడి రూపంలో అతడి ఇంటికి వెళతాడు. బృందముగ్ద రూపాన్ని చూసిన విష్ణు తొలి చూపులోనే ఆమెపై మో హం పెంచుకుంటాడు. ఎలాగైనా ఆమెను తన వశం చేసు కోవాలని ఒక రోజు జలంధరుడి రూపంలో ఇంటికి వెళ్లి బృందను తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వచ్చిం ది జలంధరుడు కాదని అతని రూపంలో ఉన్న విష్ణువు అని విష్ణువు మోసాన్ని గ్రహించిన బృంద ఆత్మార్పణ చేసు కుంటుంది. అది చూసిన విష్ణువు తీవ్ర మనస్థాపానికి గురౌతాడు. విషయం గ్రహించిన లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతీ దేవీలు బృంద చితా బస్మంపై మూడు విత్తులు నాటుతారు. పార్వతీదేవి నాటిన విత్తు తులసి మొక్కగా, లక్ష్మీదేవి నాటిన విత్తు ఉసిరిగా, సరస్వతీ దేవి నాటిన విత్తు మాలతిగా మొలకెత్తుతాయి. ఇది చూసిన విష్ణు తన బాధనంతా మరిచిపోయి సాధా రణ స్థితికి చేరుకుంటాడు. అందుకే ఆ చరిత్రను ఆధా రంగా చేసుకుని కార్తీక పౌర్ణమి రోజున మహిళలు తమ పూజలో ఉసిరిని చేర్చి భక్తితో పూజలు చేస్తారు.



ఉసిరి
షడ్రుచుల్లో కారం తప్ప అన్ని రుచులూ కలిసినదే ఉసిరి. నిత్యజీవితంలో ఉసిరిని అనేక రకాలుగా వాడుకోవచ్చు. నాలుగు పదుల వయసు దాటాక కూడా ఆరోగ్యంగా, వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండాలంటే చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో లభించే విటమిన్‌ సి, మరే ఇతర ఏ కాయలోనూ దొరకదు. ఉసిరికాయను తరచు ఆహారంలో తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తల వెంట్రుకలు త్వరగా తెల్లబడవు. చర్మం మృదువుగా ఉంటుంది. కీళ్ల వ్యాధులు, నొప్పులు, దంత సంబంధ వ్యాధులు దరిచేరవు. ఇస్లోఫీలియా అలర్జిక్‌ బ్రాంకైటీస్‌లాంటి రోగాలతో బాధపడేవారు ఉసిరి రసంలో తేనె కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. మానసిక వైకల్యం గల పిల్లల్లో బుద్ధివికాసానికి దోహదపడుతుంది. గుండె దడ, గుండెనొప్పితో బాధపడేవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చర్మంపై పొక్కులు వస్తే ఉసిరి రసాన్ని చిక్కపడేవరకు కాచి, చల్లార్చి వాటిపై రాస్తే త్వరగా నయమవుతాయి. ఉసిరి పిండిని శనగ, సున్ని పిండితో కలిపి పళ్లు తోముకుంటే తళతళా మెరుస్తాయి. ఉసిరిలో విటవిన్‌ సితోపాటు ఫైబర్‌, క్యాల్షి యం, ఫాస్పరస్‌, ఐరన్‌, కెరోటిన్‌, విటమిన్‌ బి కాంప్లెక్స్‌, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని నేరుగా తింటే మంచిది.

ఉసిరి ‘సి’ విటమిన్‌ నిధి. అందుకే దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైరల్‌, బాక్టీరియల్‌ జబ్బులు సైతం రాకుండా ఉసిరి నిరోధిస్తుంది. వీటిల్లో అనేక పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు... కేన్సర్‌ను నిరోధించే పాలీఫినాల్స్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి. 

ఉసిరి వల్ల పొందే కొన్ని ఆరోగ్య లాభాలు :-
 
ఉసిరి జలుబును, గొంతునొప్పిని తగ్గిస్తుంది. రెండు టీస్పూన్లు ఉసిరి పొడిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ మూడు లేదా నాలుగు పర్యాయాలు తాగితే దగ్గు, జలుబుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాటరాక్టు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరిలోని ఒక ప్రొటీన్‌ క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. అందుకే అన్నం తినే ముందర ఒక గ్లాసుడు ఉసిరి జ్యూసు తాగితే కడుపు నిండినట్టయి అన్నం తక్కువగా తింటాం. ఉసిరి వల్ల జీవక్రియ బాగా పనిచేస్తుంది. బరువు తగ్గుతారు. అంతేకాదు ఉసిరిలో పీచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
 
ఉసిరి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌ గ్లూకోజ్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది. ఉసిరి జ్యూసు రోజూ తాగితే మంచిది. ముఖ్యంగా రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు ఉసిరి జ్యూసు తాగడం వల్ల వెంటనే నియంత్రణలోకి వస్తుంది.
 
ఉసిరిలో రోగనిరోధకశక్తి గుణం బాగా ఉంది. అంతేగాక ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కూడా.
 
చర్మ సౌందర్యాన్ని మెరుగులీనేలా చేస్తుంది.
 
నల్లటి కురులకు ఆమ్లా సంజీవని. కరివేపాకు మల్లే ఇది కూడా వెంట్రుకలకు బలమైన టానిక్‌లాంటిది. జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంతోపాటు వెంట్రుకలు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. పైగా నేచురల్‌ కండిషనర్‌ కూడా అయిన ఉసిరి శిరోజాలను మృదువుగా, పట్టులా ఉంచుతుంది.
 
ఆర్థరైటిస్‌ సంబంధిత నొప్పులను తగ్గిస్తుంది. నోటి అల్సర్లను కూడా నివారిస్తుంది. నోటిలో పుండ్లు ఏర్పడితే ఒక కప్పులో కొద్దిగా ఉసిరి రసం, నీళ్లు కలిపి పలచగా చేసి ఆ నీళ్లను నోటిలో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
ఉసిరి యాంటీ-ఏజింగ్‌గా కూడా పనిచేస్తుంది.



No comments:

Post a Comment