Tuesday, 29 November 2016

Fruits colours and its nutrients

రోజూ ఏదో ఒకటి తీసుకోవడం కాదు. ఏ రంగు పండ్లు, ఆహారపదార్థాలను తీసుకుంటున్నారనే విషయం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ రంగును కలిగి ఉండే పండ్లు, కూరగాయాల్లో ఎక్కువ పోషకపదార్థాలుంటాయని ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో వెల్లడయింది. రంగు ఎంత ముదురుగా ఉంటే అన్ని ఎక్కువ పోషకాలుంటాయట.
 
ఎరుపు : వాటర్‌మెలన్‌, టొమాటోలు ఎరుపు రంగు కిందకు వస్తాయి. ఈ రంగు లైకోపిన్‌ లభ్యతను తెలియజేస్తుంది. ఈ రంగు కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. స్టాబెర్రీలు, యాపిల్స్‌, చెర్రీలు కూడా తీసుకోవచ్చు. 
ఆకుపచ్చ : ఈ రంగు ఆహారపదార్థాల్లో ఐసోథయోసినేట్‌, సల్ఫ్‌రఫేన్‌, ఇండోల్స్‌ అనే మిశ్రమాలుంటాయి. ఐసోధయెసినేట్‌ అనే మిశ్రమం లంగ్‌, ఇసియోఫేగల్‌ కేన్సర్‌పై ప్రభావవంతంగా పోరాడుతుంది. సల్ఫ్‌రఫేన్‌ కేన్సర్‌ ఫైటింగ్‌ కాంపౌండ్‌గా పనిచేస్తుంది. బ్రొక్కోలి, క్యాబేజీ, బఠానీ వంటివి ఆకుపచ్చ ఆహారపదార్థాల కోవలోకి వస్తాయి. 
తెలుపు : వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి సహజంగా తెల్లగా ఉండే పదార్థాల్లో ఫ్లవనాయిడ్‌ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 
పసుపు : ఈ రంగు పదార్థాల్లో కెరొటినాయిడ్స్‌, ల్యూటిన్‌, జెంక్సాంథిన్‌ వంటి మిశ్రమాలుంటాయి. ఇవి కళ్లకు మేలు చేస్తాయి. అరటిపండ్లు, మొక్కజొన్న పసుపు వంటివి ఈ కోవకు చెందుతాయి. 
నారింజ రంగు : వీటిలో ఆల్ఫా, బీటా కెరోటిన్‌ ఉంటుంది. కణాల మధ్య సమాచార మార్పిడి బాగుండేందుకు ఉపయోగపడుతుంది. కేన్సర్‌ నిరోధకంగానూ పనిచేస్తుంది. బొప్పాయి, నారింజపండ్లు, తర్బుజా వంటివి ఈ కోవకు చెందుతాయి. 
పర్పుల్‌ : వంకాయ, బ్లాక్‌ గ్రేప్స్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటిలో యాంథోసైనిన్‌ అనే మిశ్రమం ఉంటుంది. ఇది రక్తసరఫరాను మెరుగుపరచడంలోనూ, కిడ్నీల పనితీరు, కళ్ల పనితీరు మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment