Tuesday, 29 November 2016

Miriyalu



  • మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.

  •  వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది. 
  •  ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.

  •  మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. 
  • వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది. 
  •  మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది. 
  •  కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది. 
  •  విశేషించి వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి. 
  • దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.సాధారణంగా గొంతు ఇన్ఫెక్షన్‌, దగ్గుతో బాధపడుతున్నప్పుడు మిరియాల కషాయం చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ బాధలను తొలగించడంతోపాటు మెటబాలిజమ్‌ను మెరుగుపరిచే శక్తి కూడా మిరియాలకు ఉందట. ఇందులో ఉండే పైపెరీన్‌ అనే రసాయన సమ్మేళనం చెడు కొవ్వును కరిగిస్తుందట.



మిరియాల చారు కాచారా? గారెల్లో మిరియాలు నూరి వేశారా? దద్దోజనంలో మిరియాలు నల్లగా మెరిసిపోతుంటాయే? ‘పొంగల్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ముద్ద ముద్దకూ రెండు మిరియాలు పంటి కింద నలగాల్సిందే! పండగపూట పొద్దున్నే ఈ మిరియాల గోలేమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం! పండగక్కే కాదు... ప్రతి రోజూ ఆహారంలో మిరియాలు ఏదోరూపంలో తినండి. ఇది ఊబకాయాన్ని దూరం చేసే దివ్యౌషధం! కొవ్వును కరిగించే మహత్తరమైన మందు! తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.
ఎస్వీయూ బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాలతోపాటు హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఆ విశేషాలు లండన్‌కు చెందిన ‘న్యూట్రిషన్‌ అండ్‌ మెటబాలిజం’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధిక బరువు ఒంటరిగా ఉండలేదు. కొన్నాళ్లకు షుగర్‌, రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌ను తోడు తెచ్చుకుంటుంది. అందుకే... బరువు ఎక్కకూడదు. ఎక్కిన బరువును వెంటనే దించేసుకోవాలి. దీనికి సంబంధించి ఎస్వీయూ పరిశోధకులు అల్బినో ఎలుకలపై మిరియాల ప్రయోగం చేశారు. కొన్ని ఎలుకలకు ఊబకాయం వచ్చేలా చేశారు. వాటిని మూడు బృందాలుగా విభజించి... మొదటి గ్రూపులోని ఎలుకలను అలా వదిలేశారు. రెండో గ్రూపులోని ఎలుకలకు మిరియాలను నిర్దిష్ట పరిమాణంలో ఆహారంతోపాటు ఇచ్చారు.


నల్ల మిరియాల (బ్లాక్‌పెప్పర్‌)ను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల అవి కేలరీలు బర్న్‌ చేసి, కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ రాకుండా చూస్తాయని’ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. నల్ల మిరియాల్లో విటమిన్‌ ఎ, సి, కెలతో పాటు మినరల్స్‌, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ సహజసిద్ధమైన మెటబాలిక్‌ బూస్టర్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. క్లినికల్‌ డైటీషియన్‌, న్యూట్రిషనిస్టులైన మామీ అగర్వాల్‌, మెహర్‌ రాజ్‌పుత్‌ వీటిని ఎలా వాడొచ్చో వివరిస్తున్నారు.
  • సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతీరోజూ ఉదయం ఒకటీ రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా చేస్తే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.
  • నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చు.
  • రోజూ తినే వెజిటబుల్‌ సలాడ్స్‌పైన వీటిని చల్లాలి. దీనివల్ల సలాడ్‌ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది.
  • చల్లదనం కోసం చేసే మజ్జిగపైన, పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా బ్లాక్‌పెప్పర్‌ను చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • గ్లాసు నీటిలో ఒక చుక్క ఒరిజినల్‌ బ్లాక్‌పెప్పర్‌ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్‌ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు.
  • ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి, శరీరంలో కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది.

No comments:

Post a Comment