ప్రతీరోజూ మనం వండుకునే పప్పు లేదా ఇతర కాయగూర వంటల్లో జీలకర్రను కలుపుతాం. కేవలం ఫ్లేవర్ కోసమే దీనిని కలుపుతారని చాలా మంది అనుకుంటారు. కాని దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం. ముఖ్యంగా బరువు తగ్గించడంలో జీలకర్ర గణనీయమైన పాత్ర పోషిస్తుందట.
శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించ గల సత్తా జీలకర్రకు ఉందట. జీలకర్రలో ‘థైమోల్’ అనే రసాయనంతోపాటు ఉండే కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయట. అలాగే జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయట.
ఒక గ్లాస్ నీటికి ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి వేడి చేయాలి. ఆ నీరు బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత దాన్ని తిరిగి చల్లబర్చి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే డైజేషన్ సులభంగా అవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడం కూడా సులభమవుతుంది.
ఆహరమే ఔషదమని మన పెద్దవాళ్లు చెప్పారు. రోజు మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ, మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధపెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకి కడుపునింపుకోవాలని చూస్తుంటాం. ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్టుగా భావిస్తాం. కానీ, తీసుకునే ఆహారం మీద శ్రద్ధలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అలాంటివి తిన్న కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగుళూరు చెందిన డాక్టర్ అంజుసూద్ చెబుతున్నారు. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగమని ఆమె సూచిస్తున్నారు. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయని ఆమె చెప్పారు. దాని వల్ల ఇంకా చాలా ఉపయోగలున్నాయంటున్నారమే. ముఖ్యంగా గర్భిణులు ఇలా తాగడం వల్ల క్షీర గ్రంథులు ఉత్తేజం చెందుతాయంటున్నారు. అంతేకాకుండా మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడవచ్చని ఆమె చెప్పారు. అలాగే డయాబెటిక్ పెషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు. జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉండటం వల్ల గర్భిణులు ఇలాంటివి తాగడం మంచిందంటున్నారు. అలాగే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుందని చెప్పారు.

బరువు తగ్గడానికి కొందరు భారీ కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అనేకానేక డైట్ ప్లాన్‌లు ఆచరిస్తూ ఉంటారు. అయితే ‘వెయిట్ లాస్’ మెనూలో జీలకర్ర (జీరా) కూడా ఒకటని అంటున్నారు డైటీషియన్లు. ప్రతిరోజూ తప్పకుండా ఏదో ఒక రూపంలో జీరాను తీసుకుంటే బరువు తగ్గొచ్చంటున్నారు. వంటింటి మసాలాల్లో కామన్‌గా కనిపించే ఈ దినుసుతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటంటే...
జీరాలో పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ‘‘అధిక న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే, త్వరగా జీర్ణం అవుతుంది. ఒకరకంగా ఇది చ్యవన్‌ప్రాశ్‌లాగా పనిచేస్తుంది’’ అంటున్నారు హెల్త్‌కేర్‌కు చెందిన మహేష్ జయరామన్. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది.
జీరాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది శరీరంలోని అన్ని కణాల కదలికకు తోడ్పడుతుంది. శరీరంలో ఉండే అత్యధిక నీరు వల్ల ఊబకాయం వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ నీటి నిల్వలను జీలకర్ర చక్కగా నియంత్రిస్తుంది.
జీరాలో ‘థైమోల్’ అనే కాంపౌండ్ ఉంటుంది. ‘ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మెటబాలిజాన్ని, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ని ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి థైమోల్ ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది’ అని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ భక్తి సామంత్ అంటున్నారు.
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గినట్టే, జీరా రసాన్ని తాగినా కూడా అదే ఫలితం ఉంటుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే అది రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.
డైట్‌లో ఎలా తీసుకోవాలి?
సహజంగానే భారతీయ వంటకాలలో జీరాను వాడతారు. రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్‌కు బదులుగా జీరా నీటిని కూడా తీసుకోవచ్చు. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు. కడుపులో గ్యాసును పెంచే ఆలూ వంటివి వండినప్పుడు ఆ వంటకాలలో కాస్త జీరా కలిపితే మంచిది.
చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమే.
No comments:
Post a Comment