Thursday, 3 November 2016

Kothimeera and its benefits



































కొత్తిమీరను చూడగానే రోజూ వాడుకునేదే కదాని తీసిపారేస్తుంటాం. కానీ ఎండాకాలం మీ డైట్‌లో కొత్తిమీర ప్రధానంగా ఉండేలా చూసుకోండి. అందులో పీచు, ఇనుము, జింక్‌, ఫొలేట్‌, పాస్ఫరస్‌, విటమిన్‌ కె, థియామైన్‌ ఇన్నేసి ఉంటాయి మరి. వేసవిలో అరోమాలా పనిచేసే గుణాలు కొత్తిమీరలో మెండు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేసే గుణం కూడా ఎక్కువ. శరీరంలోని వ్యర్థాలను తరిమేసేందుకు చక్కగా ఉపకరిస్తుంది కొత్తిమీర. వీటన్నిటికంటే శక్తివంతమైన గుణం.. బరువు తగ్గించగలగడం. వేసవిలో క్రమం తప్పకుండా కొత్తిమీర తింటే ఉహించని ఫలితాలు లభిస్తాయి.




కొత్తిమీర వంటకాల్లో పడితే వచ్చే టేస్టేవేరు. అంతేకాదు.. ఇందులో ఆరోగ్యాన్ని కాపాడే బహుమంచి గుణాలు ఉన్నాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. 
ప్రతి ఒక్కరం ఇంట్లో సర్వసాధారణంగా ‘కొత్తిమీర’ వాడుతుంటాం. వేల సంవత్సరాల క్రితమే దీనిని మధ్యదరా ప్రాంతాల్లో పెంచేవారు. కాలక్రమేణా ప్రపంచమంతటా దీనిని వినియోగించడం మొదలెట్టారు. ఇది సుమారు రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది. విలక్షణమైన సువాసన కలిగి ఉంటుంది. తెలుపు లేదా లేత గులాబి వర్ణం పూలనిస్తుంది. దీని ఆకులు, గింజలను మసాలాగా వాడతారు. వీటిలో ఉన్న ఎసెన్షియల్‌ తైలాలైన కొరియాండరాల్‌ లాటి ఆల్‌డీహైడ్లు, టర్పీన్లు వినాయీల్‌, పైనీన్‌ కొరియాండర్‌లకు ప్రత్యేక సువాసనలుంటాయి. అప్పుడే తీసిన ఆకులు, తయారు చేసిన గింజల పౌడర్‌ కూడా బాగా సువాసనగా ఉంటాయి. దీంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు, లోహాలు కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. థాయ్‌వంటకాలలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు.
బహుళ ప్రయోజనాలు
కొత్తిమీర త్రిదోషాలను హరిస్తుంది. 
ఉదర సమస్యలను నివారిస్తుంది. 
జఠర రసములను ఉత్పత్తి చేసి, జీర్ణశక్తిని పెంచి, ఆకలి కలిగిస్తుంది. పైత్యరసంను తగ్గించి మేహశాంతినిస్తుంది. 
విషపూరిత ఆహారపదార్థాల దుష్ప్రభావాలను నివారించే విషహరిణిగా పని చేస్తుంది. 
యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌గా పనిచేయడం ద్వారా జ్వరాల నివారణకు, ఆహారపదార్థాల ప్రిజర్వేటివ్‌గా ఉపయోగపడుతుంది. 
టానిక్‌లాగా పనిచేసి ఉత్సాహాన్నిచ్చి లైంగిక పటిష్టతను కలుగజేస్తుంది. 
జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుంది. 
కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడం వల్ల విటమిన్‌ ఎ,బి-1, బి-2, సి లభిస్తాయి. ఐరన్‌ లోపాలతో బాధపడుతున్న వారు ఈ సమస్యను అధికమించటానికి కొత్తిమీర మంచి ఔషధం. 
ఫ్లావోనాయిడ్లు లాంటి ఫైటోకెమికల్స్‌ కూడా అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. 
కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెసా్ట్రల్‌, ఇతర లిపిడ్స్‌ తగ్గుతాయి. యువతులలో హార్మోనల్‌ సమతుల్యతను కాపాడుతుంది. 
నోటి దుర్వాసనను నివారించడమే కాకుండా దీని తైలాలు పెర్ఫ్యూంలలో, జిన్‌ లాంటి ఆల్కహాల్‌ పానీయాలలో వాడతారు. 
ఇక కొత్తిమీరతో వంటింటి అవసరాలు ఎన్నో చెప్పక్కర్లేదు. దీనిని చట్నీలు, సలాడ్స్‌, సూపులలో వినియోగిస్తారు. గార్నిషింగ్‌ హెర్బ్‌గా కూడా కొత్తిమీరని ఉపయోగిస్తారు. 



No comments:

Post a Comment