శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మెదడుకు మేలు చేసే తిండి మీద దృష్టి పెట్టం. రోజుకు మూడు నాలుగు పలుకుల బాదం పప్పు తింటే చాలు మెదడు చురుగ్గా, ఆరోగ్యవంతంగా మారుతుంది.
- బాదంలోని ప్రొటీన్లు బ్రెయిన్‌సెల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. ఈ ప్రొటీన్లు శక్తిని ఇవ్వడమే కాదు. మెదడులోని కణజాలాన్ని కాపాడతాయి. వయసుతోపాటు వచ్చే మతిమరుపువ్యాధిని అడ్డుకోవచ్చు.
- కొన్నిసార్లు మెదడులోని కణాలు తగ్గుముఖం పడుతూ వస్తాయి. అవి అత్యంతవేగంగా డ్యామేజ్ కాకుండా బాదంలోని ఔషధం కాపాడుతుంది.
- బాదంలోని జింక్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్ ఇ అయితే వయసుతోపాటు వచ్చే ముదిమిఛాయల్ని అంత త్వరగా రానివ్వదు.
- బాదంలోని విటమిన్ బి6 మెదడుకు ఎంతో ఉపకారి. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- బ్రెయిన్‌సెల్స్ డ్యామేజ్ కాకుండా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ కాపాడతాయి.
No comments:
Post a Comment