తమ పిల్లలు ఆటల్లో రాణించాలని కోరుకునే తల్లిదండ్రులకు శుభవార్త అంటున్నారు పరిశోధకులు. పిల్లలకు ఆహారంలో పాలకూరను ఎక్కువగా ఇవ్వడం వలన వారిలో శారీరక దృఢత్వం మరింత మెరుగుపడి ఆటల్లో బాగా రాణిస్తారని వారు చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువ సేపు ఆటలు ఆడినప్పుడు ఆక్సిజన్ స్థాయి తగ్గి త్వరగా అలసిపోవడం జరుగుతుంది. అయితే పాలకూర తీసుకున్నవారు అంత త్వరగా అలసిపోరనీ, దానికి కారణం పాలకూరలో ఉండే నైట్రేట్ కారణమని వారు అంటున్నారు. ఇదే విషయం మీద సుమారు 30 మంది క్రీడాకారుల మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఆహారంలో పాలకూరను అందించారు. మరో గ్రూపు వారికి పాలకూరను ఇవ్వలేదు. కొన్ని రోజుల అనంతరం వీరిని పరిశీలించగా, పాలకూరను తీసుకున్న వారు ఎక్కువ శక్తితో ఆడడాన్ని వీరు గమనించారు. పాలకూరను తీసుకోని వారు మామూలుగానే త్వరగా అలసిపోవడం వీరి దృష్టికి వచ్చింది. అయితే పాలకూర వల్లనే ఇది సాధ్యమైందా? అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
- పాలకూర తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.
- వయసు వల్ల వచ్చే మాక్యులర్ డీజనరేషన్ తలెత్తకుండా నిరోధిస్తుంది.
- రక్తపోటు సాధారణస్థాయిలో ఉండేలా చూస్తుంది.
- ఆస్టియోపొరాసిస్, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.
- జీవక్రియను పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా తోడ్పడుతుంది.
- ఇందులోని విటమిన్-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో ఉంది.
- పాలకూరలోని విటమిన్-కె వల్ల కాల్షియం ఉత్పత్తి అయి ఎముకలు పటిష్టంగా ఉంటాయి.
- శుక్లాల రిస్కును తగ్గిస్తుంది. గాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తుంది.
- కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరిగేలా, నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా సహాయపడుతుంది.
- ఎసిడిటీని తగ్గిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తుంది.
- అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంతోపాటు దీర్ఘకాలంలో చర్మ కాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. యాక్నే సమస్యను నివారిస్తుంది. చర్మం కాంప్లెక్షన్ పెరుగుతుంది. కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి.
- యాంటి-ఏజింగ్ గుణాలు పాలకూరలో బాగా ఉన్నాయి.
- పాలకూరలో ఫ్యాట్, క్యాలరీలు తక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతాం. ఇందులో కొవ్వును కరిగించే డయటరీ పీచుపదార్థాలున్నాయి.
- ఈ పీచుపదార్థాల వల్ల మలబద్దకం సమస్య పోవడంతోపాటు అతిగా తినడం తగ్గుతుంది.
- శరీరానికి ఒత్తిడికి లోనుకాకుండా సాంత్వననిస్తుంది.
- సీనియర్ సిటిజన్లలో బ్రెయిన్ ఆరోగ్యంగా పనిచేసేలా సహాయపడుతుంది. వయసు పైబడిన వారు రోజూ పాలకూర తినడం వల్ల యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు.
- పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
No comments:
Post a Comment