Tuesday 29 November 2016

Coconut water


కొబ్బరిబొండం..... 
కొబ్బరి నీరు తాగడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి. దీనిలో సోడియం, పొటాషియం సరైన శాతంలో ఉండటం వల్ల విరోచనాలు, వాంతులు, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకొక్క కొబ్బరి బొండంలో సుమారు250ఎమ్‌ఎల్‌ నుంచి 500ఎమ్‌ఎల్‌ వరకు నీరు ఉంటుంది. కొబ్బరి నీటితో పాటు కొబ్బరి గుజ్జులో కూడా మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నీరు తాగిన వెంటనే అందులో గుజ్జును సుమారు అర్ధగంట తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెపుతున్నారు.
250ఎంఎల్‌... నీటిలో ఉండే ఖనిజాలు, పోషకాలు 
ఎనర్జీ-44 క్యాలరీలు
గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌-6.25 ఎంజీ
కాల్షియం-48ఎంజీ
పొటాషియం-600ఎంజీ
సోడియం-250ఎంజీ
మెగ్నీషియం-60ఎంజీ,
సెలీనం-2-4ఎంజీ,
ఐరన్‌-0.4ఎంజీ,
విటమిన్‌ సి-5.8ఎంజీ,
ఫోలేట్స్‌-7మైక్రోగ్రామ్స్‌



  • కొబ్బరి అనగానే దాని నూనె కేశ సంరక్షిణిగా ఉపయోగపడుతుంది అన్న విషయం ఒక్కటే ఎక్కువగా స్పురిస్తుంది. కానీ, కొబ్బరికి సంబంధించిన వివిధ భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా....
  • కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని (కల్కం) చిన్న కరక్కాయ పరిమాణంలో రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే, మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
  • ఐదారు చెంచాల కొబ్బరి పెంకు చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు రెండు సార్లు సేవిస్తే, తరుచూ మూత్రం వచ్చే దీర్ఘకాలిక ప్రవాహిక సమస్య తగ్గిపోతుంది.
  • కాస్తంత కొబ్బరి పెంకు చూర్ణాన్ని కొంచెం వాముతో కలిపి నూరి సేవిస్తే కడుపులోని పాములు విసర్జన ద్వారా పడిపోతాయి.
  • కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు ర క్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది.
  • కొబ్బరి పెంకు నుంచి తీసిన తైలంతో మర్థన చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి కోరు, కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి.


No comments:

Post a Comment