Tuesday, 29 November 2016

Til



నువ్వులు బెల్లం కలిపి చేసిన తినుబండారాలు, నువ్వుల నూనెతో చేసిన 
వంటకాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనాదిగా అవి బాగా 
వాడుకలో ఉన్నాయి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంటూ ఇవి వేరు వేరుగా 
క నిపించినా ఈ రెంటిలోనూ పోషకాలు దాదాపు సమానంగానే ఉంటాయి. 
మొత్తంగా చూస్తే కాపర్‌, మెగ్నీషియం, సిలికాన్‌, కాల్షియం, జింక్‌, థయామిన్‌, 
సెలీనియం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. 


  •  నిజానికి మాత్రల రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు. కానీ, నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో 20 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్‌ వల్ల శరీరంలో కొలెసా్ట్రల్‌ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్లనువ్వుల్లో ఫైటో స్టెరాల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 
  •  నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోనూ, రక్తపోటును తగ్గించడంలోనూ బాగా ఉపయోగపడతాయి. కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే ఫైటిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, ఫైటోస్టెరాల్స్‌ కూడా నువ్వుల్లో ఎక్కువే. శరీర వ్యవస్థను నిదానింపచేసే థయామిన్‌, ట్రిఫ్టోఫాన్‌ విటమిన్లు, ఒంటినొప్పుల్ని తగ్గించి మనసును ఉత్తేజితం చేసి, గాఢనిద్రకు దోహదం చేసే సెరొటోనిన్‌ కూడా నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి. 
  • నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుళ్లబరిచే ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి రాకుండా కాపాడతాయి. పిడికెడు నువ్వుల్లో లభించే దానికన్నా గ్లాసు పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వీటిల్లో జింక్‌ కూడా ఎక్కువగానే ఉండడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచే లవణాలు లభిస్తాయి. నువ్వుల్లో ఉండే కాపర్‌, ఆర్థరైటిస్‌ సమస్య రాకుండా నివారించడంలోనూ వచ్చిన ఆర్థరైటిస్‌ సమస్యనుంచి విముక్తం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, ఎముకలను, కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే అంశాలు కూడా నువ్వుల్లో ఉన్నాయి. 
  • మద్యపానం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కాలేయాన్ని కాపాడటంతోపాటు కాలేయం పనితనాన్ని పెంచే అంశాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల్లోని మెగ్నీషియం ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు, శ్వాసనాళాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి మీరు నువ్వుల్ని తినడం మరవొద్దు.  




మనం తినే తిండిలో తెల్లనువ్వులు, నల్లనువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో అత్యధిక పోషకవిలువలు, ఔషధగుణాలు ఉంటాయి.. నువ్వుల్లో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. తక్షణ శక్తికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
నువ్వుల్లో మెగ్నీషియంతో పాటు మరిన్ని అదనపు పోషకవిలువలు ఉంటాయి. ఇందులోని నూనె మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు మెగ్నీషియం రూపంలో నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. బీపీని నియంత్రణలో పెట్టేందుకు ఇవి తోడ్పడతాయి.
మనం తినే ఆహారంలో కొవ్వులు అధికం. ఇవి రక్తంలో పేరుకుపోతే హృద్రోగాలు వస్తాయి. కొవ్వుల్ని తగ్గించడంలో నువ్వులు చేసే మేలు అంతాఇంతా కాదు.
జీర్ణశక్తి లోపించడానికి అజీర్తి పెద్ద కారణం. ఈ సమస్యను తొలగించే గుణం నువ్వులకు ఉంది.
నువ్వుల నూనెకు క్యాన్సర్‌ కారకాలను అడ్డుకునే శక్తి అధికం. అందులోను చర్మ సంబంధిత వ్యాధుల్ని దరి చేరనివ్వదు. నువ్వుల్లో జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది.
వీటిలోని మెగ్నీషియం, కాల్షియం మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. సుఖనిద్రకు దోహదం చేసే స్వభావం నువ్వులకు ఉంది.
నల్లటి నువ్వుల్లో అత్యధిక ఇనుము ఉంటుంది. ఇవి ఎనీమియా, బలహీనతలను తగ్గిస్తాయి.

మద్యపానం సేవించే వాళ్లలో కాలేయ సమస్యలు అధికం. అందుకని నువ్వులతో చేసిన ఆహారాన్ని తింటే లివర్‌ సమస్యలు తొలగుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి.
నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాల్ని తినడం వల్ల.. అత్యధిక కాల్షియం దొరుకుతుంది. ఎముకలు బలిష్టంగా మారతాయి.
అన్నిటికంటే ముఖ్యమైనది నేత్ర ఆరోగ్యం. నువ్వుల్లో కొన్ని ఔషధగుణాలు కంటిచూపును మెరుగుపరిచి.. వయసురీత్యా వచ్చే సమస్యల్ని అడ్డుకుంటాయి.
నువ్వుల నూనెలో జుట్టుకు కావాల్సిన పోషకాలు పుష్కలం. వారానికి రెండు రోజులు తలకు నువ్వుల నూనె రాసుకుంటే.. జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది.


నిత్యం తినాల్సిన సూపర్‌ సీడ్స్‌లో నువ్వులు ఒకటి. ఎందుకంటారా... వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...
మాంగనీసు, కాపర్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, డైటరీ ఫైబర్‌, బి1 విటమిన్లు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి.
విటమిన్‌-ఇ, విటమిన్‌-బి కూడా బాగా ఉన్నాయి. నొప్పిని తగ్గించే గుణం వీటికి ఉంది. ఎముకలను పటిష్టం చేస్తాయి కూడా.
నువ్వులు అధికరక్తపోటును తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్తమాలాంటి వాటిని నిరోధిస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
పెరుగుదలకు అవసరమయ్యే ఎమినో యాసిడ్స్‌ వీటిలో ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతో సహాయపడతాయి.
తల్లులు కాబోయే వాళ్లు వీటిని తినడం వల్ల వారికి పుట్టబోయే శిశువుల్లో నరాలకు సంబంధించిన లోపాలు తలెత్తవు.
రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి కూడా.
నువ్వుల్లో ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా అడ్డుకుంటాయి. రక్తహీనతనుతగ్గిస్తుంది.
నువ్వుల నూనె సన్‌స్ర్కీన్‌లా పనిచేస్తుంది.






No comments:

Post a Comment