Tuesday, 29 November 2016

Pine apple



పులపుల్లగా, తీయగా అదోరకమైన రుచిని అందించే పైనాపిల్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇందులోని విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఈ సమ్మర్‌లో కూల్‌గా లాగించేయాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్‌లలో పైనాపిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో ఎండలవేడికి జీర్ణవ్యవస్థ అదుపు తప్పుతుంది. అటువంటి పరిస్థితులను చక్కదిద్దే ఎంజైమ్‌లను వృద్ధి చేసే మంచి గుణం పైనాపిల్‌కు ఉంది. బ్లడ్‌క్లాట్స్‌ను రాకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గాను ప్రముఖపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఇందులోని అత్యధిక పీచు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తద్వార కొవ్వు బాగా తగ్గుతుంది. 




పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ శాతం ఎక్కువ. ఫైబర్‌, కార్బొహైడ్రేట్స్‌ ఉండే పైనాపిల్‌ తింటే సులువుగా జీర్ణమవుతుంది. ఇంతకీ పైనాపిల్‌ వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
కాల్షియం, మాంగనీస్‌ అధికంగా ఉండే ఈ పండు తింటే దంతాలు, ఎముకలకు బలం.
వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. చర్మంపై ఉండే గాయాలు త్వరగా మానిపోతాయి.
విటమిన్‌ ఎ అధికంగా ఉండటం వల్ల పైనాపిల్‌ కళ్లకూ మంచిదే.
దగ్గు, జలుబు దరికి చేరవు.
శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు పైనాపిల్‌ తింటే చర్మసౌందర్యం కూడా వస్తుంది.

రోజుకు వందగ్రాములు మాత్రమే పైనాపిల్‌ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ లాగిస్తే మాత్రం వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది.





No comments:

Post a Comment