Tuesday 29 November 2016

కలబంద Alovera

కలబందలో ఇతర సుగుణాలతోపాటు యాంటిబయోటిక్‌ లక్షణాలు కూడా బాగా ఉన్నాయి. ఇది బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహగ్రస్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. అందుకే నిత్యం కలబందను తీసుకుంటే ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కలబందను చర్మ సంబంధిత సమస్యలకు, ఫైటో థెరపీకి, కాస్మొటిక్స్‌లోనూ వివిధ రూపాల్లో వాడుతున్న విషయం తెలిసిందే. డయాబెటిస్‌ రోగులకు కూడా ఇది సంజీవనిలాంటిదని అధ్యయనకారులు చెబుతున్నారు. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలు తగ్గించడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుందని, గుండెజబ్బులు రాకుండా చేస్తుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు మూడునెలల సగటు బ్లడ్‌షుగర్‌ ప్రమాణాన్ని తెలిపే హెచ్‌బిఎ1సి లేదా గ్లైకేటెడ్‌ హిమోగ్లోబిన్‌ను కూడా తగ్గిస్తుంది. గతంలో చేసిన అధ్యయనాల్లో కలబంద ఎగ్జిమా, సొరియాసిస్‌, బర్న్స్‌ తదితర చర్మ సంబంధిత వాటిపై కూడా బాగా పనిచేస్తుందని వెల్లడైంది. ప్రతిరోజూ కలబంద జ్యూస్‌ 50 ఎంఎల్‌ తీసుకుంటే మంచిది. టాబ్లెట్లయితే 200-300 ఎంజి వాడితే మంచి ఫలితాలుంటాయంటున్నారు.


శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద వైద్యనిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.
ఇదీ నేపథ్యం..
కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు ‘కుమారి’ అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు. పాశ్చాత్యులైతే ఐదు దశాబ్దాలుగా కలబందపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మరోగాలు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు. అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

అలోవెరాను కాలిన గాయాలకు, ఎముకల సమస్యలకు ఉపయోగించేవారు. దీన్ని తీసుకున్న వెంటనే వేగంగా రక్తశుద్ధి జరిగి, రక్తంలోని ఉత్ర్పేరక అవశేషాలు తొలగిపోతాయని చెప్పలేం.



అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




అపారమైన ఔషధ గుణాలతో పాటు ఎ, బి, సి, డి, ఇ, బి- 12 వంటి అత్యంత కీలకమై విటమిన్లు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులోంచి లభించే ‘లిపాసెస్‌’ అనే ఎంజైము శరీరంలోని కొవ్వును చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ‘ప్రొటెనెస్‌’ అనే ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బ్రాడికీనెస్‌ అనే ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతోపాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
కలబందలో ప్రధానంగా 20 రకాల లవణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, సెలేనియం, సోడియం, మాంగనీసు, కాపరు, క్రోమియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. జీవశక్తికి కావలసిన లవణాలను క్రమబద్ధంగా అందించే ఎలిమెంట్లుకూడా కావలసినంతగా లభిస్తాయి. కలంబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఇది రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది పలు రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.
 
కలబందలోని ఆంత్రోక్వినోనె్‌సలో 12 రకాలా క్రిమినాశకాలు ఉంటాయి. ఇవి, గ్యాస్ట్రో సమస్యలను నివారించడంతో పాటు నొప్పులను తగ్గిస్తాయి. ఇందులోని అలోయన్‌, ఎమోటిన్‌ పెయిన్‌ కిల్లర్సుగానూ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌గానూ ఉపయోగపడుతుంది.
కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైర్‌సలను, ఈస్ట్‌ ఫంగైలను నాశనం చేస్తుంది.
శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలో ఉన్నాయి. దీని ద్వారా దీర్ఘకాలిక మలబద్దకం, ఎసిడిటి, , సైనస్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా, రంగు మారడం వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. మదుమేహం, లివర్‌ సమస్యలు, గౌట్‌, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, స్త్రీల రుతు సమస్యలు, రక్తహీనత, అధిక బరువు వంటి సమస్యలు కూడా నయమవుతాయి.
చాలా మందిలో అజీర్తి సమస్య ఉంటుంది. దీనివల్ల తీసుకునే ఆహార పదార్థాల్లోని పోషకాలేవీ శరీరానికి పట్టవు. దీనివల్ల శరీరం తరుచూ వ్యాధిగ్రస్తమవుతూ ఉంటుంది కలబందను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కబడటంతో పాటు శరీరంలోని వ్యర్థ, విషపదార్థాలు విసర్జించబడతాయి. శరీరం ఆరోగ్యంగానూ, చైతన్యవంతంగానూ మారుతుంది.





No comments:

Post a Comment