Margosa or Neem tree has played a key role in Ayurvedic
medicine and agriculture since time immemorial.
The seed contains substantial amount of essential oil,
known as Margosa or neem oil.
The bitter constituents sepearted from this oil are nimbin, nimbinin and nimbidin.
The main active
constituent of these is nimbidin which contains Sulphur.
The blossoms yield a glucoside, nimbosterin and a highly
pungent essential oil , nimbosterol nimbecetin and fatty acids.
The flowers contain
a bitter substance and an irritant bitter oil.
Then fruits contain a bitter principle, baka yanin and
the trunk bark yields nimbin, nimbidin, nimbinin and an essential.
The gum discharged by the stem/trunk of the tree is a stimulant
and tonic with a soothing effect on the skin and mucous membranes.
Skin Disorders:
The leave applied externally, are very useful in skin
diseases. They are especially beneficial in the treatment of boils, chronic
ulcers, eruptions of smallpox, syphilitic sores, grandular swellings and
wounds. They can be used either as a poultice, decoction or liniment.
An ointment prepared from neem leaves is also is very
effective in healing ulcers and wounds. This ointment is prepared by frying 50
grams of leaves in 50 grams of pure cow ghee and mashing the mixture thoroughly
in the same ghee till an ointment consistency is obtained.
A paste prepared from the
neem tree bark, by rubbing it in water, can also be applied on wounds.
వేప చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీడతోపాటు వేప చెట్టు గాలి, పూత, కాయలు, ఆకులు, బెరడు...ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యకరమే! కాబట్టి చేదుగా ఉంటుంది కదా అని తేలికగా చూడకుండా వేప కాయలు, విత్తనాల నుంచి తీసిన నూనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించాలి.
మనదేశంలో సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. వేపచెట్టు బెరడు, ఆకులు, విత్తనాలు, జిగురు, వేర్లు .. ఇలా అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఉపయోగాలేంటంటే...
వేపచెట్టుది ఆయుర్వేదంలో ప్రథమస్థానం. ‘ఒన్ ట్రీ ఫార్మసీ’ అని కూడా అంటారు. ఈ చెట్టు ద్వారా ఎక్కువ శాతం అనారోగ్యసమస్యలను పారద్రోలవచ్చు.
వేపపుల్లతో పండ్లుతోమటం అనాదిగా వస్తున్న ఆచారం. భారతదేశంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ పద్ధతి కనిపిస్తుంది. చేదు వేప పుల్లతో రోజు ఆరంభిస్తే తీపి ఫలితాలే.
వేపాకు యాంటీ బ్యాక్టీరియల్. సబ్బుల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు శరీరానికి హానిచేయవు.
వేపాకు ఫంగస్ నివారిణిగా పనిచేస్తుంది.
వేపాకు తల్లోని చుండ్రుని తొలగిస్తుంది. వేపాకు పేస్టు జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళి స్ట్రాంగ్ హెయిర్‌తో పాటు జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది.
అంతెందుకూ రోజూ రెండు లేదా మూడు వేపాకులు తినటం వల్ల కడుపులో హానికలిగించే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి.
వేపాకు వాడటం వల్ల చర్మసంబంధ వ్యాధులు రావు. శరీరంపై పొక్కులు, మంటపుట్టడం ఉంటే వేపాకుతో చక్కటి ఉపశమనం లభిస్తుంది.
దీని వ్లల గాయాలు, ఇన్‌ఫెక్షన్స్ నయమవుతాయి.
చర్మం ఎర్రబడటం, ఇరిటేషన్, దురద ఉంటే వేపనూనె వాడితే సమూలంగా తగ్గిపోతాయి. వేపాకుతో మొటిమల్ని నిర్మూలించవచ్చు.
వేపాకు చక్కటి గ్యాస్ట్రో ప్రొటిక్టివ్‌గా పనిచేస్తుంది.
వేపాకు, వేపకాయల్ని సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కల తెగుళ్ళని అంతమొందించి, మంచి పంటను తీయవచ్చు.
రోగనిరోధకశక్తిని మెరుగుపరిచే అత్యద్భుతమైన ఔషధంగా వేపాకు పనిచేస్తుంది.
నలభై రకాల వ్యాధుల నివారిణి.. వేప. సమ శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే దీని పుట్టిల్లు. వేప బెరడు, ఆకు, పువ్వు, పండు.. ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి. మనిషికి, వేప చెట్టుకు ఉన్న బంధం ఈ నాటిది కాదు. ‘పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు.’ అని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలోనే వేప గొప్పతనాన్ని చెప్పాడు చరకుడు. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ దాకా వేప ఉండాల్సిందే. అంతేనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్ మహమ్మారిని సైతం మట్టుబెట్టే సుగుణవంతురాలు వేప అని హైదరాబాదీ శాస్త్రవేత్తలు తేల్చారు.
వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్ అనే రసాయనం.. పలు రకాల కేన్సర్ కణితులను తుత్తునీయలు చేస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు తెలిపారు. నింబోలైడ్‌కు కేన్సర్‌ను అంతమొందించే లక్షణాలు ఉన్నాయని 2014లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయానాన్ని కేన్సర్ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించగా ఫలితం అందలేదని, అదే మందు రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్ కణితులు మాయమైనట్లు వివరించారు. దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు
చర్మసంరక్షణలో: వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను, మొటిమలను నివారిస్తాయి. వర్షాకాలంలో దద్దుర్లు, దురద, మంటతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచీ చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
చుండ్రుకు చెక్: వర్షాకాలంలో తలలో పీహెచ్ సమతుల్యత దెబ్బతిని జుట్టు ఆయిలీగా, జిడ్డుగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది. ఇలా చుండ్రుతో బాధపడు తున్నవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.
రక్తాన్ని శుద్ధిచేస్తుంది: వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. రోజూ కొద్ది మోతాదులో వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి.
జీర్ణవ్యవస్థ పనితీరులో: కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడుతున్నవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చిగుళ్ల రక్షణలో: చాలా టూత్‌పేస్టులలో, మౌత్‌వాష్‌లలో వేప ఉంటున్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో చల్లటి గాలుల వల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అయితే వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిరోధించడమే కాకుండా చిగుళ్లకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తాయి.
No comments:
Post a Comment