Tuesday 1 November 2016

Red Chilli fruits

పచ్చిమిరపకాయలు తింటే నోరు మండిపోతుందని వాటిని దూరం పెట్టేస్తున్నారా? కానీ ఈ కబురు వింటే ఘాటెత్తే పచ్చిమిరపకాయల్ని ఇష్టంగా లాగించేస్తారు. వీటిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ అనే ఓ పదార్థం ఉంది.  దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు అమెరికాలోని వ్యోమింగ్‌ యూనివర్శిటీ పరిశోధకులు. పైగా తెలుపు, గోధుమ రంగు కొవ్వు కణాలు ఉష్ణోగ్రతలను బట్టి రూపాల్ని మార్పిడి కూడా చేసుకుంటాయట. అంటే క్యాప్సైసిన్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే శరీరంలో తెల్ల కొవ్వు కణాలు గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారిపోయి, ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారని తేలింది.

No comments:

Post a Comment