రసమైనా ఇంట్లో తయారుచేసుకోగలం...ఒక్క చెరకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరికి వెళ్లాల్సిందే! కానీ రోడ్డు మీద అమ్మే చెరకురసమా! అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ రసంతో ఆరోగ్యానికి ఒరిగే లాభాలు లెక్కలేనన్ని. అవేంటంటే....
- దీన్లో సింపుల్ షుగర్స్ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా చెరకురసం తాగేయొచ్చు.
- వేసవి అలసటను పారదోలుతుంది. దీన్లోని పొటాషియం, ప్రొటీన్, ఐరన్, కార్బొహైడ్రేట్లు ఇతర పోషకాలు ఎండ వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి.
- చెరకురసానికి లాక్సేటివ్ గుణాలుంటాయి. కాబట్టి మలబద్ధకం వదలాలంటే చెరకురసం తాగాలి.
- చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి.
- కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది.
- జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది.
- మూత్రసంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
- కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది.
- శరీర బరువును తగ్గిస్తుంది.
- గొంతు నొప్పి, ఫ్లూ, జలుబులను తగ్గిస్తుంది.
- మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన మూత్రనాళ సంబంధ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంది.
- చెరుకు వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్, ప్రోటీన్స్, ఎలక్ర్టోలైట్స్ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.సుక్రోజ్ 11నుంచి16శాతం,రెడ్యూసింగ్ షుగర్ 0.4 నుంచి 2శాతం,మినరల్స్ 0.5 నుంచి1శాతం,ఫైబర్ 10 నుంచి 16 శాతం వరకు ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్, ఫేట్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి.
No comments:
Post a Comment