Thursday, 3 November 2016

Sweet oranges (Nagpur Kamala/Santra )



కమలాఫలం వృద్ధులే తినాలి అని మనకో నమ్మకం ఉంది. కానీ ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను కడుపారా తినండి. 
గుండెకు మేలు: వీటిలోని హెర్పెరెడిన్‌ అనే ఎంజైమ్‌ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. దీన్లోని ఫోలేట్‌ గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 
జీర్ణాశయం సురక్షితం: ఈ పండ్లలోని విటమిన్‌ సి అల్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. 
మూత్రపిండాలకు మేలు: వ్యర్థాలను వడగట్టడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది. 
కేన్సర్‌ నుంచి రక్ష: సిట్రస్‌ జాతి పళ్లు తినే వాళ్లకు కేన్సర్‌ వచ్చే అవకాశం 40 - 45 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. 
రోగనిరోధక శక్తి: విటమిన్‌ సి శరీరంలో ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌లు దరిచేరవు. ఫలితంగా జలుబు, జ్వరాల ఇబ్బంది ఉండదు. 
ఆరోగ్యవంతమైన చర్మం: కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. 
కళ్లకు మంచిది: వీటిలోని కెరోటినాయిడ్స్‌ నైట్‌ బ్లైండెడ్‌నెస్‌, మస్క్యులర్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి

No comments:

Post a Comment