Tuesday 29 November 2016

Coconut water


కొబ్బరిబొండం..... 
కొబ్బరి నీరు తాగడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి. దీనిలో సోడియం, పొటాషియం సరైన శాతంలో ఉండటం వల్ల విరోచనాలు, వాంతులు, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకొక్క కొబ్బరి బొండంలో సుమారు250ఎమ్‌ఎల్‌ నుంచి 500ఎమ్‌ఎల్‌ వరకు నీరు ఉంటుంది. కొబ్బరి నీటితో పాటు కొబ్బరి గుజ్జులో కూడా మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నీరు తాగిన వెంటనే అందులో గుజ్జును సుమారు అర్ధగంట తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెపుతున్నారు.
250ఎంఎల్‌... నీటిలో ఉండే ఖనిజాలు, పోషకాలు 
ఎనర్జీ-44 క్యాలరీలు
గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌-6.25 ఎంజీ
కాల్షియం-48ఎంజీ
పొటాషియం-600ఎంజీ
సోడియం-250ఎంజీ
మెగ్నీషియం-60ఎంజీ,
సెలీనం-2-4ఎంజీ,
ఐరన్‌-0.4ఎంజీ,
విటమిన్‌ సి-5.8ఎంజీ,
ఫోలేట్స్‌-7మైక్రోగ్రామ్స్‌



  • కొబ్బరి అనగానే దాని నూనె కేశ సంరక్షిణిగా ఉపయోగపడుతుంది అన్న విషయం ఒక్కటే ఎక్కువగా స్పురిస్తుంది. కానీ, కొబ్బరికి సంబంధించిన వివిధ భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా....
  • కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని (కల్కం) చిన్న కరక్కాయ పరిమాణంలో రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే, మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
  • ఐదారు చెంచాల కొబ్బరి పెంకు చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు రెండు సార్లు సేవిస్తే, తరుచూ మూత్రం వచ్చే దీర్ఘకాలిక ప్రవాహిక సమస్య తగ్గిపోతుంది.
  • కాస్తంత కొబ్బరి పెంకు చూర్ణాన్ని కొంచెం వాముతో కలిపి నూరి సేవిస్తే కడుపులోని పాములు విసర్జన ద్వారా పడిపోతాయి.
  • కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు ర క్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది.
  • కొబ్బరి పెంకు నుంచి తీసిన తైలంతో మర్థన చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి కోరు, కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి.


Sugarcane juice


రసమైనా ఇంట్లో తయారుచేసుకోగలం...ఒక్క చెరకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరికి వెళ్లాల్సిందే! కానీ రోడ్డు మీద అమ్మే చెరకురసమా! అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ రసంతో ఆరోగ్యానికి ఒరిగే లాభాలు లెక్కలేనన్ని. అవేంటంటే.... 
  • దీన్లో సింపుల్‌ షుగర్స్‌ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా చెరకురసం తాగేయొచ్చు.
  •  వేసవి అలసటను పారదోలుతుంది. దీన్లోని పొటాషియం, ప్రొటీన్‌, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు ఇతర పోషకాలు ఎండ వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి. 
  •  చెరకురసానికి లాక్సేటివ్‌ గుణాలుంటాయి. కాబట్టి మలబద్ధకం వదలాలంటే చెరకురసం తాగాలి. 
  •  చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. 
  • కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది. 
  •  జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది. 
  •  మూత్రసంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
  •  కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. 
  •  శరీర బరువును తగ్గిస్తుంది. 
  •  గొంతు నొప్పి, ఫ్లూ, జలుబులను తగ్గిస్తుంది. 
  • మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన మూత్రనాళ సంబంధ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంది.
  • చెరుకు 
    వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్‌, ప్రోటీన్స్‌, ఎలక్ర్టోలైట్స్‌ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్‌ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.
    చెరుకులో పోషకాలు 
    సుక్రోజ్‌ 11నుంచి16శాతం,
    రెడ్యూసింగ్‌ షుగర్‌ 0.4 నుంచి 2శాతం,
    మినరల్స్‌ 0.5 నుంచి1శాతం,
    ఫైబర్‌ 10 నుంచి 16 శాతం వరకు ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్‌, ఫేట్‌, కార్బోహైడ్రేట్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ ఉంటాయి.

Margosa or Neem ( In Telugu : Vepa) leaves, flowers, oil and shade (Botanical Name : Azadirachta indica )






































Margosa or Neem tree has played a key role in Ayurvedic medicine and agriculture since time immemorial.

 The seed contains substantial amount of essential oil, known as Margosa or neem oil.

 The bitter constituents sepearted from this oil are  nimbin, nimbinin and nimbidin.

  The main active constituent of these is nimbidin which contains Sulphur.

 The blossoms yield a glucoside, nimbosterin and a highly pungent essential oil , nimbosterol  nimbecetin and fatty acids.

 The flowers contain  a bitter substance and an irritant bitter oil.

 Then fruits contain a bitter principle, baka yanin and the trunk bark yields nimbin, nimbidin, nimbinin and an essential.

 The gum discharged by the stem/trunk of the tree is a stimulant and tonic with a soothing effect on the skin and mucous membranes.

 Skin Disorders:

The leave applied externally, are very useful in skin diseases. They are especially beneficial in the treatment of boils, chronic ulcers, eruptions of smallpox, syphilitic sores, grandular swellings and wounds. They can be used either as a poultice, decoction or liniment.

 

An ointment prepared from neem leaves is also is very effective in healing ulcers and wounds. This ointment is prepared by frying 50 grams of leaves in 50 grams of pure cow ghee and mashing the mixture thoroughly in the same ghee till an ointment consistency is obtained.

 

A paste prepared from   the neem tree bark, by rubbing it in water, can also be applied on wounds.

 

వేప చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీడతోపాటు వేప చెట్టు గాలి, పూత, కాయలు, ఆకులు, బెరడు...ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యకరమే! కాబట్టి చేదుగా ఉంటుంది కదా అని తేలికగా చూడకుండా వేప కాయలు, విత్తనాల నుంచి తీసిన నూనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించాలి.

ఆరోగ్యపరమైన ప్రయోజనాలు 
  • పరగడుపునే రోజుకి 10 వేపాకులు తింటే మధుమేహం అదుపులోకి వస్తుంది.
  • వేప నూనెతో మర్దన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • నాలుగు కప్పుల నీళ్లలో ఒక కప్పు వేప బెరడును మరిగించి ఆ నీళ్లను కాలిన మచ్చలపై పూస్తే కొద్ది రోజులకు మచ్చలు మటుమాయమవుతాయి.
  • వేప పూలను నూరి ఆ ముద్దతో తలకు పట్టు వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
  • కొన్ని చుక్కల వేప ఆకుల రసం చెవిలో పోస్తే చెవి పోటు తగ్గుతుంది.
  • ఒక టీస్పూను వేప బెరడుకు రెండు టీస్పూన్ల బెల్లం కలిపి తీసుకుంటే మొలలు తగ్గుతాయి.
  • ఒక టీస్పూను వేపాకు పొడిని తింటే అసిడిటీ తగ్గుతుంది.
  • సౌందర్య సాధనాలలో...
  • వేప నూనె యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి వెంట్రుకల సమస్యలున్నవాళ్లు వేప నూనెలో కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి తలస్నానం చేయాలి.
  • ఎగ్జీమా, రింగ్‌ వార్మ్‌, సోరియాసిస్‌ మొదలైన చర్మ వ్యాధులకు చక్కని విరుగుడు వేప నూనె. ఈ సమస్యలున్నవాళ్లు ప్రతిరోజూ వేప నూనెను సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.
  • వేప నూనె చుండ్రును నివారిస్తుంది. కాబట్టి తలస్నానానికి ముందు ఈ నూనెను తలకు పట్టించి మర్దనా చేయాలి.
  • మొటిమలు తగ్గాలంటే వాటిమీద వేప నూనె పూయాలి.



మనదేశంలో సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. వేపచెట్టు బెరడు, ఆకులు, విత్తనాలు, జిగురు, వేర్లు .. ఇలా అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి  అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఉపయోగాలేంటంటే...
వేపచెట్టుది ఆయుర్వేదంలో ప్రథమస్థానం. ‘ఒన్‌ ట్రీ ఫార్మసీ’ అని కూడా అంటారు. ఈ చెట్టు ద్వారా ఎక్కువ శాతం  అనారోగ్యసమస్యలను పారద్రోలవచ్చు.
వేపపుల్లతో పండ్లుతోమటం అనాదిగా వస్తున్న ఆచారం. భారతదేశంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ పద్ధతి కనిపిస్తుంది. చేదు వేప పుల్లతో రోజు ఆరంభిస్తే తీపి ఫలితాలే.
వేపాకు యాంటీ బ్యాక్టీరియల్‌. సబ్బుల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు శరీరానికి హానిచేయవు.
వేపాకు ఫంగస్‌ నివారిణిగా పనిచేస్తుంది.
వేపాకు తల్లోని చుండ్రుని తొలగిస్తుంది. వేపాకు పేస్టు జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళి స్ట్రాంగ్‌ హెయిర్‌తో పాటు జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది.
అంతెందుకూ రోజూ రెండు లేదా మూడు వేపాకులు తినటం వల్ల కడుపులో హానికలిగించే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి.
 వేపాకు వాడటం వల్ల చర్మసంబంధ వ్యాధులు రావు. శరీరంపై పొక్కులు, మంటపుట్టడం ఉంటే  వేపాకుతో చక్కటి ఉపశమనం లభిస్తుంది.
దీని వ్లల గాయాలు, ఇన్‌ఫెక్షన్స్‌ నయమవుతాయి.
చర్మం ఎర్రబడటం, ఇరిటేషన్‌, దురద ఉంటే వేపనూనె వాడితే సమూలంగా తగ్గిపోతాయి. వేపాకుతో మొటిమల్ని   నిర్మూలించవచ్చు.
వేపాకు చక్కటి గ్యాస్ట్రో ప్రొటిక్టివ్‌గా పనిచేస్తుంది.
వేపాకు, వేపకాయల్ని సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కల తెగుళ్ళని అంతమొందించి, మంచి పంటను తీయవచ్చు.
రోగనిరోధకశక్తిని మెరుగుపరిచే అత్యద్భుతమైన ఔషధంగా వేపాకు పనిచేస్తుంది.



నలభై రకాల వ్యాధుల నివారిణి.. వేప. సమ శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే దీని పుట్టిల్లు. వేప బెరడు, ఆకు, పువ్వు, పండు.. ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి. మనిషికి, వేప చెట్టుకు ఉన్న బంధం ఈ నాటిది కాదు. ‘పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు.’ అని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలోనే వేప గొప్పతనాన్ని చెప్పాడు చరకుడు. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ దాకా వేప ఉండాల్సిందే. అంతేనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని సైతం మట్టుబెట్టే సుగుణవంతురాలు వేప అని హైదరాబాదీ శాస్త్రవేత్తలు తేల్చారు.
వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్‌ అనే రసాయనం.. పలు రకాల కేన్సర్‌ కణితులను తుత్తునీయలు చేస్తుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు తెలిపారు. నింబోలైడ్‌కు కేన్సర్‌ను అంతమొందించే లక్షణాలు ఉన్నాయని 2014లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయానాన్ని కేన్సర్‌ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించగా ఫలితం అందలేదని, అదే మందు రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్‌ కణితులు మాయమైనట్లు వివరించారు. దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు


చర్మసంరక్షణలో: వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. ఇవి ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను, మొటిమలను నివారిస్తాయి. వర్షాకాలంలో దద్దుర్లు, దురద, మంటతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచీ చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
చుండ్రుకు చెక్‌: వర్షాకాలంలో తలలో పీహెచ్‌ సమతుల్యత దెబ్బతిని జుట్టు ఆయిలీగా, జిడ్డుగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది. ఇలా చుండ్రుతో బాధపడు తున్నవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.
రక్తాన్ని శుద్ధిచేస్తుంది: వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. రోజూ కొద్ది మోతాదులో వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి.
జీర్ణవ్యవస్థ పనితీరులో: కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడుతున్నవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చిగుళ్ల రక్షణలో: చాలా టూత్‌పేస్టులలో, మౌత్‌వాష్‌లలో వేప ఉంటున్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో చల్లటి గాలుల వల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అయితే వేపలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిరోధించడమే కాకుండా చిగుళ్లకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తాయి.




Miriyalu



  • మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.

  •  వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది. 
  •  ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.

  •  మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. 
  • వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది. 
  •  మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది. 
  •  కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది. 
  •  విశేషించి వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి. 
  • దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.సాధారణంగా గొంతు ఇన్ఫెక్షన్‌, దగ్గుతో బాధపడుతున్నప్పుడు మిరియాల కషాయం చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ బాధలను తొలగించడంతోపాటు మెటబాలిజమ్‌ను మెరుగుపరిచే శక్తి కూడా మిరియాలకు ఉందట. ఇందులో ఉండే పైపెరీన్‌ అనే రసాయన సమ్మేళనం చెడు కొవ్వును కరిగిస్తుందట.



మిరియాల చారు కాచారా? గారెల్లో మిరియాలు నూరి వేశారా? దద్దోజనంలో మిరియాలు నల్లగా మెరిసిపోతుంటాయే? ‘పొంగల్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ముద్ద ముద్దకూ రెండు మిరియాలు పంటి కింద నలగాల్సిందే! పండగపూట పొద్దున్నే ఈ మిరియాల గోలేమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం! పండగక్కే కాదు... ప్రతి రోజూ ఆహారంలో మిరియాలు ఏదోరూపంలో తినండి. ఇది ఊబకాయాన్ని దూరం చేసే దివ్యౌషధం! కొవ్వును కరిగించే మహత్తరమైన మందు! తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.
ఎస్వీయూ బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాలతోపాటు హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఆ విశేషాలు లండన్‌కు చెందిన ‘న్యూట్రిషన్‌ అండ్‌ మెటబాలిజం’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధిక బరువు ఒంటరిగా ఉండలేదు. కొన్నాళ్లకు షుగర్‌, రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌ను తోడు తెచ్చుకుంటుంది. అందుకే... బరువు ఎక్కకూడదు. ఎక్కిన బరువును వెంటనే దించేసుకోవాలి. దీనికి సంబంధించి ఎస్వీయూ పరిశోధకులు అల్బినో ఎలుకలపై మిరియాల ప్రయోగం చేశారు. కొన్ని ఎలుకలకు ఊబకాయం వచ్చేలా చేశారు. వాటిని మూడు బృందాలుగా విభజించి... మొదటి గ్రూపులోని ఎలుకలను అలా వదిలేశారు. రెండో గ్రూపులోని ఎలుకలకు మిరియాలను నిర్దిష్ట పరిమాణంలో ఆహారంతోపాటు ఇచ్చారు.


నల్ల మిరియాల (బ్లాక్‌పెప్పర్‌)ను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల అవి కేలరీలు బర్న్‌ చేసి, కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ రాకుండా చూస్తాయని’ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. నల్ల మిరియాల్లో విటమిన్‌ ఎ, సి, కెలతో పాటు మినరల్స్‌, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ సహజసిద్ధమైన మెటబాలిక్‌ బూస్టర్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. క్లినికల్‌ డైటీషియన్‌, న్యూట్రిషనిస్టులైన మామీ అగర్వాల్‌, మెహర్‌ రాజ్‌పుత్‌ వీటిని ఎలా వాడొచ్చో వివరిస్తున్నారు.
  • సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతీరోజూ ఉదయం ఒకటీ రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా చేస్తే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.
  • నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చు.
  • రోజూ తినే వెజిటబుల్‌ సలాడ్స్‌పైన వీటిని చల్లాలి. దీనివల్ల సలాడ్‌ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది.
  • చల్లదనం కోసం చేసే మజ్జిగపైన, పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా బ్లాక్‌పెప్పర్‌ను చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • గ్లాసు నీటిలో ఒక చుక్క ఒరిజినల్‌ బ్లాక్‌పెప్పర్‌ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్‌ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు.
  • ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి, శరీరంలో కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది.

Pine apple



పులపుల్లగా, తీయగా అదోరకమైన రుచిని అందించే పైనాపిల్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇందులోని విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఈ సమ్మర్‌లో కూల్‌గా లాగించేయాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్‌లలో పైనాపిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో ఎండలవేడికి జీర్ణవ్యవస్థ అదుపు తప్పుతుంది. అటువంటి పరిస్థితులను చక్కదిద్దే ఎంజైమ్‌లను వృద్ధి చేసే మంచి గుణం పైనాపిల్‌కు ఉంది. బ్లడ్‌క్లాట్స్‌ను రాకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గాను ప్రముఖపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఇందులోని అత్యధిక పీచు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తద్వార కొవ్వు బాగా తగ్గుతుంది. 




పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ శాతం ఎక్కువ. ఫైబర్‌, కార్బొహైడ్రేట్స్‌ ఉండే పైనాపిల్‌ తింటే సులువుగా జీర్ణమవుతుంది. ఇంతకీ పైనాపిల్‌ వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
కాల్షియం, మాంగనీస్‌ అధికంగా ఉండే ఈ పండు తింటే దంతాలు, ఎముకలకు బలం.
వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. చర్మంపై ఉండే గాయాలు త్వరగా మానిపోతాయి.
విటమిన్‌ ఎ అధికంగా ఉండటం వల్ల పైనాపిల్‌ కళ్లకూ మంచిదే.
దగ్గు, జలుబు దరికి చేరవు.
శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు పైనాపిల్‌ తింటే చర్మసౌందర్యం కూడా వస్తుంది.

రోజుకు వందగ్రాములు మాత్రమే పైనాపిల్‌ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ లాగిస్తే మాత్రం వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది.





Jeera



ప్రతీరోజూ మనం వండుకునే పప్పు లేదా ఇతర కాయగూర వంటల్లో జీలకర్రను కలుపుతాం. కేవలం ఫ్లేవర్‌ కోసమే దీనిని కలుపుతారని చాలా మంది అనుకుంటారు. కాని దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం. ముఖ్యంగా బరువు తగ్గించడంలో జీలకర్ర గణనీయమైన పాత్ర పోషిస్తుందట.
శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించ గల సత్తా జీలకర్రకు ఉందట. జీలకర్రలో ‘థైమోల్‌’ అనే రసాయనంతోపాటు ఉండే కొన్ని ముఖ్యమైన ఆయిల్స్‌ శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయట. అలాగే జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయట.
ఒక గ్లాస్‌ నీటికి ఒక టీ స్పూన్‌ జీలకర్ర కలిపి వేడి చేయాలి. ఆ నీరు బ్రౌన్‌ కలర్‌లోకి మారిన తర్వాత దాన్ని తిరిగి చల్లబర్చి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే డైజేషన్‌ సులభంగా అవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడం కూడా సులభమవుతుంది.


ఆహరమే ఔషదమని మన పెద్దవాళ్లు చెప్పారు. రోజు మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ, మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధపెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకి కడుపునింపుకోవాలని చూస్తుంటాం. ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్టుగా భావిస్తాం. కానీ, తీసుకునే ఆహారం మీద శ్రద్ధలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అలాంటివి తిన్న కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగుళూరు చెందిన డాక్టర్ అంజుసూద్ చెబుతున్నారు. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగమని ఆమె సూచిస్తున్నారు. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయని ఆమె చెప్పారు. దాని వల్ల ఇంకా చాలా ఉపయోగలున్నాయంటున్నారమే. ముఖ్యంగా గర్భిణులు ఇలా తాగడం వల్ల క్షీర గ్రంథులు ఉత్తేజం చెందుతాయంటున్నారు. అంతేకాకుండా మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడవచ్చని ఆమె చెప్పారు. అలాగే డయాబెటిక్ పెషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు. జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉండటం వల్ల గర్భిణులు ఇలాంటివి తాగడం మంచిందంటున్నారు. అలాగే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుందని  చెప్పారు. 

బరువు తగ్గడానికి కొందరు భారీ కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అనేకానేక డైట్‌ ప్లాన్‌లు ఆచరిస్తూ ఉంటారు. అయితే ‘వెయిట్‌ లాస్‌’ మెనూలో జీలకర్ర (జీరా) కూడా ఒకటని అంటున్నారు డైటీషియన్లు. ప్రతిరోజూ తప్పకుండా ఏదో ఒక రూపంలో జీరాను తీసుకుంటే బరువు తగ్గొచ్చంటున్నారు. వంటింటి మసాలాల్లో కామన్‌గా కనిపించే ఈ దినుసుతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటంటే...
జీరాలో పొటాషియం, మాంగనీస్‌, ఐరన్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. ‘‘అధిక న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే, త్వరగా జీర్ణం అవుతుంది. ఒకరకంగా ఇది చ్యవన్‌ప్రాశ్‌లాగా పనిచేస్తుంది’’ అంటున్నారు హెల్త్‌కేర్‌కు చెందిన మహేష్‌ జయరామన్‌. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది.
జీరాలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అది శరీరంలోని అన్ని కణాల కదలికకు తోడ్పడుతుంది. శరీరంలో ఉండే అత్యధిక నీరు వల్ల ఊబకాయం వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ నీటి నిల్వలను జీలకర్ర చక్కగా నియంత్రిస్తుంది.
జీరాలో ‘థైమోల్‌’ అనే కాంపౌండ్‌ ఉంటుంది. ‘ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మెటబాలిజాన్ని, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)ని ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి థైమోల్‌ ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది’ అని ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ హాస్పిటల్‌ చీఫ్‌ డైటీషియన్‌ భక్తి సామంత్‌ అంటున్నారు.
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గినట్టే, జీరా రసాన్ని తాగినా కూడా అదే ఫలితం ఉంటుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే అది రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.
డైట్‌లో ఎలా తీసుకోవాలి?
సహజంగానే భారతీయ వంటకాలలో జీరాను వాడతారు. రెగ్యులర్‌ డ్రింకింగ్‌ వాటర్‌కు బదులుగా జీరా నీటిని కూడా తీసుకోవచ్చు. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు. కడుపులో గ్యాసును పెంచే ఆలూ వంటివి వండినప్పుడు ఆ వంటకాలలో కాస్త జీరా కలిపితే మంచిది.

చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమే.





Jamuns or neredu pallu












సీజన్‌లో దొరికే ప్రతి పండు ఆరోగ్యానికి మంచిదని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిలో నేరేడు పండు ప్రత్యేకత సంతరించుకుంది. ఆయుర్వేదంలో నేరేడు పండును అమర సంజీవనిగా కీర్తిస్తారు. ఈ పండులో ఏ, సీ విటమిన్‌లతో పాటు ఆక్జాలిక్‌ ఆమ్లం ఉండడంతో మంచి రుచి ఇస్తుంది. నేరేడులో విషాన్ని హరించే శక్తి మెండుగా ఉంటుందని పురాణ వైద్యశాస్త్రంలో విస్తృతంగా వాడేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. కిలో రూ.120 నుంచి 150 వరకు ధర పలుకుతోంది.
  • నేరేడు పండు తింటే కడుపులో నులిపురుగులను చంపడంతోపాటు నోటి కేన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుంది. 
  •  మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు వరప్రసాదిని. నేరేడు పండు గింజలను కాల్చి పొడి చేసిన తరువాత నీటిలో కలిపి తాగితే చక్కర శాతం అదుపులో ఉంటుంది. 
  •  మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి టానిక్‌లా పని చేస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది. 
  •  నేరేడు ఆకులు కూడా ఔషధ గుణం కలిగి ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయమైతే నేరేడు ఆకును గాయంపై ఉంచి కట్టు కడితే నయమైతుంది. 
  •  నోటిపూత, చిగుళ్ళవ్యాధులు, దంతక్షయం ఉన్నా నేరేడు ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం పొందవచ్చు.


గజానునికి ఇష్టమైన పదార్థాలలో వెలగపండ్లుతో పాటుగా నేరుడుపళ్ళు, ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు ఫలం వల్ల ఉపయోగాలు కోకొల్లలు. నేరుడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. సంస్కృతంలో దీనిని జంభూ ఫలం అంటారు. మన దేశానికి ప్రాచీన నామం కూడా ‘‘జంభూ ద్వీపం’’ అందుకే హైందవ మంత్రాలలో జంభూ ద్వీపే....భరత వర్షే....భరత ఖండే......అని ఉంటుంది. పేరుకు తగ్గట్టే మన దేశంలో ఇవి అధికంగా పండుతాయి. సిజీజీయం క్యూమిస్‌ దీని శాస్త్రీయ నామం. ఇవి సీజనల్‌ పళ్ళు. సాధారణంగా వేసవి ఆఖరు నుంచి వర్షాకాలం మొదలైన రెండు మూడు వారాల వరకూ ఉంటాయి. ఇవి సున్నితంగా ఉండటం వల్లకింద పడితే పాడవుతాయి. అందువల్ల వీటిని జాగ్రత్తగా కోస్తారు. వీటిలో అల, చిట్టి, జంబో తదితర రకాలు ఉన్నాయి.
రాముని వనవాసంలో: వనవాస సమయంలో రామ లక్ష్మణ సీతలు ఈ పండ్లును తిని కడుపు నింపుకునే వారని రామాయణంలో ప్రస్తావన  ఉంది. అందుకే గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో దీనిని దేవతా వృక్షంగా పూజిస్తారు. పోర్చుగీసు వారు మన దేశానికి వలస వచ్చినప్పుడు వీటి విత్తనాలు తీసుకువెళ్ళి బ్రెజిల్‌కు పరిచయం చేశారని చెబుతారు.ఈ చెట్లు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. వీటిని అక్కడ గిని చెట్లు అంటారు. వందేళ్ల వరకు జీవిస్తాయి. 
తూర్పుగోదావరి జిల్లాలో..
ఏజెన్సీ. గండేపల్లి, మురారి, నందరాడ, దోసకాయలపల్లి, యర్రంపాలెం వంటి పల్లెటూళ్ళ నుంచి బుట్టలు, ప్లాస్టిక్‌ ట్రేలలో వీటిని తీసుకువచ్చి రాజమహేంద్రవరంలో కంబాలచెరువు సమీపంలో ఉన్న రెండు హోల్‌సేల్‌ దుకాణాలలో విక్రయిస్తారు. ఒక్కో దానిలో 30 నుంచి 50 కేజీల వరకూ ఉంటాయి. తోపుడు బండ్లు, సైకిల్‌ వ్యాపారులు హోల్‌సేల్‌గా కొని రిటైల్‌గా కేజీ రూ.120 వరకూ విక్రయిస్తారు. ఇక్కడి  నుంచి విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తాడేపల్లిగూడెంలతో పాటు దూర ప్రాంతాలకు, జిల్లాలో పలుప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. 
ఆరోగ్య సంవర్థని 
సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో నేరుడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి, రోజు ఒక యాపిల్‌ తినండి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అంటారు. అయితే రోజూ నాలుగు నేరేడు పళ్ళు తిన్నా అంతకన్నా వంద రేట్లు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కేంద్ర నాడీ మండలం అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం నేరేడు గింజలకు ఉన్నట్టు లక్నోకు చెందిన సెంట్రల్‌ డ్రగ్‌ ఇనిస్టిట్యూట్‌ చెబుతుంది. వర్షాకాలంలో సాధారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించే గుణం ఆకులకు, పండ్లకు ఉంది, కాల్షియం, ఐరన్‌, పోటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్ళు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది. నేరేడు ఆకులతో చేసే కషాయం బాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంది. డేయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కేన్సర్‌ రాకుండా చేయడంలో నేరుడు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాసులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్ళతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది.నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడే వారికి 30 ఎంఎల్‌ నీళ్ళలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం కనిపిస్తుంది.జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరుడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. నులిపురుగులు నశిస్తాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పని చేస్తాయి. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళలో కలిపి తీసుకోవాలి.
శరీరంలో వేడిని తగ్గించి....తక్షణ శక్తిని ఇస్తాయి: ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విజమిన్లు, క్రోమియం...వంటివి నేరేడులో పుష్కలం. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. తక్షణ శక్తిని ఇస్తాయి.
డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది :  గుజరాతీ భాషలో ‘‘లంబూ జీవతి ఛే...తో జంబూ ఖావు ఛే...’’ అనే సామేత ఉన్నది. అంటే నేరేడును తింటే చక్కెర వ్యాధి పరార్‌ అని అర్థం. మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. గింజల్ని ఎండెబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే చక్కెర తగ్గుతుంది.
నెలసరి సమస్యలకు :చాలా మంది స్త్రీలు నెలసరిలో విపరీతమైన నొప్పి వంటి వాటితో బాధ పడతారు. అలాంటి వారు నేరుడు చెక్క కషాయాన్ని 25 రోజుల పాటు 30 ఎంఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది
అల్ల నేరేడు చెట్టు కాడా.. 
నేరేడు పండ్లను కవుల కలాలు వదల్లేదు. తెలుగు సినిమాల్లో నేరేడు చెట్టుపై పలు పాటల పల్లవులతో ప్రయోగాలున్నాయి. ఆడపిల్లల కళ్ళను.. నేరేడుతో పోల్చడం విశేషం.
నేరేడు పండ్ల జ్యూస్‌  ఇలా చేయవచ్చు.. (కావలసినవి ): నేరుడు పండ్ల రసం ఒక కప్పు, రాగి పిండి అరకప్పు, ఖర్జూర పళ్లు 6, రోజ్‌ వాటర్‌ ఒక కప్పు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ఒకటి..
తయారు చేసే విధానం : ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి.. గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. రాగిపిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నాలుగు కప్పుల నీరు పోసి స్టౌపై మరుగుతుండగా రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా  వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత దించాలి. ఖర్జూర పండ్లముక్కలు, ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ ముక్కలు, రోజ్‌ వాటర్‌ కలిపి మిక్సీలో వేసి తిప్పి అందులో నేరేడు పండ్ల రసం, రాగి మిశ్రమం వేసి మరోసారి తిప్పితే పోషకాలు గల జంభూ జ్యూస్‌ రెడీ..
పోషకాలు (వంద గ్రాముల్లో)..
తేమ 83.7 గ్రా., పిండి పదార్థం 19 గ్రా, మాంసకృత్తులు 1.3 గ్రా, కొవ్వు 0.1, ఖనిజాలు  0.4 గ్రా, పీచుపదార్థం 0.9 గ్రా, కాల్షియం 15.30 మి.గ్రా, ఇనుము 0.4 గ్రా- 1 మి.గ్రా, సల్ఫర్‌, 13 మి. గ్రా, విటమిన్‌ సి 18 మి.గ్రా, ఫోలిక్‌ యాసిడ్‌ 3 మి.గ్రా, మెగ్నీషియం 35.మి.గ్రా, ఫాస్పరస్‌ 15 మి.గ్రా, సోడియం 28 మీ.గ్రా, శక్తి 82 కేలరీలు ఉంటాయి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్ఫియం, ఫాస్పరస్‌, మాంగనీసు, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ సీ,ఏలు, రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌ యాసిడ్లు  లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
డయాబెటీస్‌ నియంత్రణ జాగ్రత్తలు 
నేరుడు వగరుగా ఉండి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కొద్దిగా ఉప్పు వేసి తీసుకుంటే రుచితో పాటు వగరు, అరుగుదల సమస్య ఉండదు. భోజనంగంట తర్వాత తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు.


  • ముదిరిన నేరేడు పండ్ల గింజలను శుభ్రపరిచి, నీడన ఎండించి పొడిచేసి, రెండు స్పూన్‌ల మోతాదులో భోజనం తర్వాత రోజూ రెండు పూటలా సేవిస్తే మధుమేహం వల్ల వచ్చే అతి మూత్ర వ్యాధి సమస్య తగ్గిపోతుంది. లేదా ముదిరిన నేరేడు కాండం లోపలి గుజ్జును నీడన ఎండించి కాల్చిన బూడిదెను, ఒక స్పూను మోతాదులో రోజుకు రెండు సార్లు నీటిలో కలిపి సేవించినా ఈ అతిమూత్ర వ్యాధి సమస్య తొలగిపోతుంది.
  •  నేరేడు కాండపు ముక్కలను నీటితో దంచి రసాన్ని తీసి, 5 స్పూన్‌ల రసాన్ని మేక పాలలో కలిపి, ప్రతి రోజూ పరగడుపున వారం రోజుల పాటు సేవిస్తే, విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి.
  • ప్రసవించిన స్త్రీలు, నేరేడు చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కషాయంగా కాచి ఆ కషాయంతో జననాంగాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకంటే, ఏమైనా దుర్గంధం ఉంటే తొలగిపోతుంది. ఆ భాగంలో పుండ్లు కూడా ఏర్పడవు.
  • నేరేడు చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, రోజూ మూడు పూటలా తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
  •  నేరేడు గింజల కషాయాన్ని తేనెతో సేవిస్తే, వివిధ కారణాల వల్ల కలిగే వాంతులు తగ్గుతాయి. వాంతుల వల్ల ఏప్పడే దప్పిక కూడా పోతుంది.

వేసవిలో లభించే పండ్లలో అల్లనేరేడుకు ప్రత్యేక స్థానం ఉంది. వగరు, తీపి, పులుపు కలగలిసిన రుచితో ఈ పండు నోరూరిస్తుంది దీనిని ఆయుర్వేదంలో ఔషధఫలంగా అభివర్ణిస్తారు. పేగుల్లో ఉండే వెంట్రుకలను సైతం శరీరం నుంచి బయటకు పంపించే శక్తి అల్లనేరేడు సొంతం. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలిగించి, ఒంటికి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేసి, ఆకలిని పెంచుతుంది. పైత్యాన్ని, విరోచనాలను తగ్గిస్తుంది. ఈ పండు తింటే ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒక్కసారి చూద్దాం..
  • సీజన్‌లో ప్రతిరోజూ 10 నుంచి 20 అల్లనేరేడు పళ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • వేసవిలో అతిదాహాన్ని అరికడుతుంది. ఒంటికి చలువ చేస్తుంది.
  • మూత్రం రాకా ఇబ్బంది పడే వారికి అల్లనేరుడు ఔషధం లాంటిది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. చిన్నచిన్న రాళ్లను కరిగిస్తుంది.
  • కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. నోటి, ముత్రాశయ కాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది.
  • చిగుళ్ల వ్యాధులతో భాధపడే వారు ఈచెట్టు బెరడు, ఆకుల రసాన్ని ఆయిల్‌ పుల్లింగ్‌ పుక్కిలిస్తే చాలా మంచింది.
  • కడుపులో ఉన్న ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగించివేస్తాయి.
  • అల్లనేరేడు కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.
  • అల్లనేరుడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. పంచాదారకు బదులు తేనె కలిపి తాగాతే ఆరికాళ్లు, ఆరిచేతుల మంటలు, కండ్ల మంటలు తగ్గుతాయి.
  • విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే అతిమూత్ర వ్యాధి అదుపులోకి వస్తుంది.
  • పండ్లే కాదు, నేరేడు ఆకులను ఎండబెట్టి చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడతాయి.
  • అల్లనేరేడు ఆకును గాయంపై కట్టుగా కట్టవచ్చు.
  • అల్లనేరేడు పుల్లతో పండ్లు తోముకుంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్లు నుంచి రక్తస్రావం తగ్గుతుంది నోటి దుర్వాసన దూరమవుతుంది.
  • లేత ఆకులతో కషాయం కాసి రోజుకు మూడుసార్లు, నాలుగైదు టేబుల్‌ స్పూన్లు తాగితే డయేరియా, మొలలు తగ్గుతాయి.

నేరేడు పండ్లలో ఉండే పోషకాలు గైనమిక్‌ ఇండెక్‌ శాతాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతుంది. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, పొలిక్‌ యాసిడ్‌, పీచు ప్రోటీన్లు, కెరోటిన్లు అధికంగా లభిస్తాయి. నేరేడు పండ్లను తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తకారడం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి అదుపులోకి వస్తుంది. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు వీటని తీసుకుంటే శరీరానికి మంచిది. శరీరానికి ఇనుము అందుతుంది. నీరసం తగ్గి తక్షణమే శక్తి అందుతుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మెదడు, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగ్గా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నేరేడు పండ్లు తీసుకుంటే రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు పరిష్కారమవుతాయు. నమిలినప్పుడు పులుపు, వగరు కలపోతగా ఉండి బ్యాక్టీరియాను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నేరేడు పండ్లు తింటే విటమిన్లు అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.




Til



నువ్వులు బెల్లం కలిపి చేసిన తినుబండారాలు, నువ్వుల నూనెతో చేసిన 
వంటకాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనాదిగా అవి బాగా 
వాడుకలో ఉన్నాయి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంటూ ఇవి వేరు వేరుగా 
క నిపించినా ఈ రెంటిలోనూ పోషకాలు దాదాపు సమానంగానే ఉంటాయి. 
మొత్తంగా చూస్తే కాపర్‌, మెగ్నీషియం, సిలికాన్‌, కాల్షియం, జింక్‌, థయామిన్‌, 
సెలీనియం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. 


  •  నిజానికి మాత్రల రూపంలో తీసుకునే కాల్షియం చాలా భాగం జీర్ణమే కాదు. కానీ, నువ్వుల ద్వారా లభించే కాల్షియం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిల్లో 20 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. నువ్వుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్‌ వల్ల శరీరంలో కొలెసా్ట్రల్‌ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్లనువ్వుల్లో ఫైటో స్టెరాల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 
  •  నువ్వులు జీర్ణశక్తిని పెంచడంలోనూ, రక్తపోటును తగ్గించడంలోనూ బాగా ఉపయోగపడతాయి. కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే ఫైటిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, ఫైటోస్టెరాల్స్‌ కూడా నువ్వుల్లో ఎక్కువే. శరీర వ్యవస్థను నిదానింపచేసే థయామిన్‌, ట్రిఫ్టోఫాన్‌ విటమిన్లు, ఒంటినొప్పుల్ని తగ్గించి మనసును ఉత్తేజితం చేసి, గాఢనిద్రకు దోహదం చేసే సెరొటోనిన్‌ కూడా నువ్వుల్లో పుష్కలంగా ఉన్నాయి. 
  • నువ్వులు ఎముకలను పటిష్టం చేయడం ద్వారా ఎముకలను గుళ్లబరిచే ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి రాకుండా కాపాడతాయి. పిడికెడు నువ్వుల్లో లభించే దానికన్నా గ్లాసు పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వీటిల్లో జింక్‌ కూడా ఎక్కువగానే ఉండడం వల్ల ఎముకల దృఢత్వాన్ని పెంచే లవణాలు లభిస్తాయి. నువ్వుల్లో ఉండే కాపర్‌, ఆర్థరైటిస్‌ సమస్య రాకుండా నివారించడంలోనూ వచ్చిన ఆర్థరైటిస్‌ సమస్యనుంచి విముక్తం చేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే, ఎముకలను, కీళ్లను, రక్తనాళాలను శక్తివంతం చేసే అంశాలు కూడా నువ్వుల్లో ఉన్నాయి. 
  • మద్యపానం వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నుంచి కాలేయాన్ని కాపాడటంతోపాటు కాలేయం పనితనాన్ని పెంచే అంశాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల్లోని మెగ్నీషియం ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు, శ్వాసనాళాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి మీరు నువ్వుల్ని తినడం మరవొద్దు.  




మనం తినే తిండిలో తెల్లనువ్వులు, నల్లనువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో అత్యధిక పోషకవిలువలు, ఔషధగుణాలు ఉంటాయి.. నువ్వుల్లో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. తక్షణ శక్తికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
నువ్వుల్లో మెగ్నీషియంతో పాటు మరిన్ని అదనపు పోషకవిలువలు ఉంటాయి. ఇందులోని నూనె మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటు కలిగిన వాళ్లకు మెగ్నీషియం రూపంలో నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. బీపీని నియంత్రణలో పెట్టేందుకు ఇవి తోడ్పడతాయి.
మనం తినే ఆహారంలో కొవ్వులు అధికం. ఇవి రక్తంలో పేరుకుపోతే హృద్రోగాలు వస్తాయి. కొవ్వుల్ని తగ్గించడంలో నువ్వులు చేసే మేలు అంతాఇంతా కాదు.
జీర్ణశక్తి లోపించడానికి అజీర్తి పెద్ద కారణం. ఈ సమస్యను తొలగించే గుణం నువ్వులకు ఉంది.
నువ్వుల నూనెకు క్యాన్సర్‌ కారకాలను అడ్డుకునే శక్తి అధికం. అందులోను చర్మ సంబంధిత వ్యాధుల్ని దరి చేరనివ్వదు. నువ్వుల్లో జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది.
వీటిలోని మెగ్నీషియం, కాల్షియం మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. సుఖనిద్రకు దోహదం చేసే స్వభావం నువ్వులకు ఉంది.
నల్లటి నువ్వుల్లో అత్యధిక ఇనుము ఉంటుంది. ఇవి ఎనీమియా, బలహీనతలను తగ్గిస్తాయి.

మద్యపానం సేవించే వాళ్లలో కాలేయ సమస్యలు అధికం. అందుకని నువ్వులతో చేసిన ఆహారాన్ని తింటే లివర్‌ సమస్యలు తొలగుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి.
నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాల్ని తినడం వల్ల.. అత్యధిక కాల్షియం దొరుకుతుంది. ఎముకలు బలిష్టంగా మారతాయి.
అన్నిటికంటే ముఖ్యమైనది నేత్ర ఆరోగ్యం. నువ్వుల్లో కొన్ని ఔషధగుణాలు కంటిచూపును మెరుగుపరిచి.. వయసురీత్యా వచ్చే సమస్యల్ని అడ్డుకుంటాయి.
నువ్వుల నూనెలో జుట్టుకు కావాల్సిన పోషకాలు పుష్కలం. వారానికి రెండు రోజులు తలకు నువ్వుల నూనె రాసుకుంటే.. జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది.


నిత్యం తినాల్సిన సూపర్‌ సీడ్స్‌లో నువ్వులు ఒకటి. ఎందుకంటారా... వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...
మాంగనీసు, కాపర్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, డైటరీ ఫైబర్‌, బి1 విటమిన్లు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి.
విటమిన్‌-ఇ, విటమిన్‌-బి కూడా బాగా ఉన్నాయి. నొప్పిని తగ్గించే గుణం వీటికి ఉంది. ఎముకలను పటిష్టం చేస్తాయి కూడా.
నువ్వులు అధికరక్తపోటును తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్తమాలాంటి వాటిని నిరోధిస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
పెరుగుదలకు అవసరమయ్యే ఎమినో యాసిడ్స్‌ వీటిలో ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతో సహాయపడతాయి.
తల్లులు కాబోయే వాళ్లు వీటిని తినడం వల్ల వారికి పుట్టబోయే శిశువుల్లో నరాలకు సంబంధించిన లోపాలు తలెత్తవు.
రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి కూడా.
నువ్వుల్లో ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా అడ్డుకుంటాయి. రక్తహీనతనుతగ్గిస్తుంది.
నువ్వుల నూనె సన్‌స్ర్కీన్‌లా పనిచేస్తుంది.






కలబంద Alovera

కలబందలో ఇతర సుగుణాలతోపాటు యాంటిబయోటిక్‌ లక్షణాలు కూడా బాగా ఉన్నాయి. ఇది బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహగ్రస్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. అందుకే నిత్యం కలబందను తీసుకుంటే ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కలబందను చర్మ సంబంధిత సమస్యలకు, ఫైటో థెరపీకి, కాస్మొటిక్స్‌లోనూ వివిధ రూపాల్లో వాడుతున్న విషయం తెలిసిందే. డయాబెటిస్‌ రోగులకు కూడా ఇది సంజీవనిలాంటిదని అధ్యయనకారులు చెబుతున్నారు. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలు తగ్గించడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుందని, గుండెజబ్బులు రాకుండా చేస్తుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు మూడునెలల సగటు బ్లడ్‌షుగర్‌ ప్రమాణాన్ని తెలిపే హెచ్‌బిఎ1సి లేదా గ్లైకేటెడ్‌ హిమోగ్లోబిన్‌ను కూడా తగ్గిస్తుంది. గతంలో చేసిన అధ్యయనాల్లో కలబంద ఎగ్జిమా, సొరియాసిస్‌, బర్న్స్‌ తదితర చర్మ సంబంధిత వాటిపై కూడా బాగా పనిచేస్తుందని వెల్లడైంది. ప్రతిరోజూ కలబంద జ్యూస్‌ 50 ఎంఎల్‌ తీసుకుంటే మంచిది. టాబ్లెట్లయితే 200-300 ఎంజి వాడితే మంచి ఫలితాలుంటాయంటున్నారు.


శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద వైద్యనిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.
ఇదీ నేపథ్యం..
కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు ‘కుమారి’ అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు. పాశ్చాత్యులైతే ఐదు దశాబ్దాలుగా కలబందపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మరోగాలు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు. అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

అలోవెరాను కాలిన గాయాలకు, ఎముకల సమస్యలకు ఉపయోగించేవారు. దీన్ని తీసుకున్న వెంటనే వేగంగా రక్తశుద్ధి జరిగి, రక్తంలోని ఉత్ర్పేరక అవశేషాలు తొలగిపోతాయని చెప్పలేం.



అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




అపారమైన ఔషధ గుణాలతో పాటు ఎ, బి, సి, డి, ఇ, బి- 12 వంటి అత్యంత కీలకమై విటమిన్లు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులోంచి లభించే ‘లిపాసెస్‌’ అనే ఎంజైము శరీరంలోని కొవ్వును చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ‘ప్రొటెనెస్‌’ అనే ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బ్రాడికీనెస్‌ అనే ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతోపాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
కలబందలో ప్రధానంగా 20 రకాల లవణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, సెలేనియం, సోడియం, మాంగనీసు, కాపరు, క్రోమియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. జీవశక్తికి కావలసిన లవణాలను క్రమబద్ధంగా అందించే ఎలిమెంట్లుకూడా కావలసినంతగా లభిస్తాయి. కలంబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఇది రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది పలు రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.
 
కలబందలోని ఆంత్రోక్వినోనె్‌సలో 12 రకాలా క్రిమినాశకాలు ఉంటాయి. ఇవి, గ్యాస్ట్రో సమస్యలను నివారించడంతో పాటు నొప్పులను తగ్గిస్తాయి. ఇందులోని అలోయన్‌, ఎమోటిన్‌ పెయిన్‌ కిల్లర్సుగానూ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌గానూ ఉపయోగపడుతుంది.
కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైర్‌సలను, ఈస్ట్‌ ఫంగైలను నాశనం చేస్తుంది.
శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలో ఉన్నాయి. దీని ద్వారా దీర్ఘకాలిక మలబద్దకం, ఎసిడిటి, , సైనస్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా, రంగు మారడం వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. మదుమేహం, లివర్‌ సమస్యలు, గౌట్‌, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, స్త్రీల రుతు సమస్యలు, రక్తహీనత, అధిక బరువు వంటి సమస్యలు కూడా నయమవుతాయి.
చాలా మందిలో అజీర్తి సమస్య ఉంటుంది. దీనివల్ల తీసుకునే ఆహార పదార్థాల్లోని పోషకాలేవీ శరీరానికి పట్టవు. దీనివల్ల శరీరం తరుచూ వ్యాధిగ్రస్తమవుతూ ఉంటుంది కలబందను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కబడటంతో పాటు శరీరంలోని వ్యర్థ, విషపదార్థాలు విసర్జించబడతాయి. శరీరం ఆరోగ్యంగానూ, చైతన్యవంతంగానూ మారుతుంది.





Corn fibre

కౌమార దశలో ఉన్న బాలికలకు, మెనోపాజ్‌ దాటిన మహిళలకు సాల్యుబుల్‌ కార్న్‌ ఫైబర్‌ ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆహార సప్లిమెంట్ల రూపంలో దీన్ని తీసుకోవడం ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతుందట. బోన్స్‌లో కాల్షియం పెరగడంతో పాటు నిల్వ ఉండటానికి ఇది దోహదం చేస్తుంది. శరీరం తనకు అవసరమైన కాల్షియంను ఉపయోగించుకోవడంలో దీని పాత్ర కీలకం. సాల్యుబుల్‌ కార్న్‌ ఫైబర్‌ను తీసుకున్నప్పుడు ఆది ఎముకల పరిరక్షణకు అవసరమైన చిన్నచిన్న ఫాటీ యాసిడ్ల రూపంలోకి మారుతుంది. మెనోపాజ్‌ దశను దాటిన కొంతమంది మహిళలకు ఈ సప్లిమెంట్‌ను రోజూ 10 గ్రా. 20గ్రా చొప్పున 50 రోజుల పాటు అందించారు. వారి ఎముకల్లో కాల్షియం 4.8 శాతం, 7 శాతం చొప్పున పెరిగింది. అలాగే 11-14 ఏళ్ల బాలికలకు 10గ్రా., 20గ్రా చొప్పున సాల్యుబుల్‌ కార్న్‌ ఫైబర్‌ను నాలుగు వారాలపాటు అందించారు. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో కాల్షియంను శోషించుకునే శక్తి 12 శాతం పెరిగినట్లు తేలింది. బేకరీ, డెయిరీ ఉత్పత్తులు, గింజలు, సెరల్స్‌, కార్న్‌ఫ్లేక్స్‌, చాక్లెట్‌ క్యాండీలు తదితరాల్లో సాల్యుబుల్‌ కార్న్‌ ఫైబర్‌ లభిస్తుంది

Almonds

రీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మెదడుకు మేలు చేసే తిండి మీద దృష్టి పెట్టం. రోజుకు మూడు నాలుగు పలుకుల బాదం పప్పు తింటే చాలు మెదడు చురుగ్గా, ఆరోగ్యవంతంగా మారుతుంది. 
  •  బాదంలోని ప్రొటీన్లు బ్రెయిన్‌సెల్స్‌ను యాక్టివేట్‌ చేస్తాయి. ఈ ప్రొటీన్లు శక్తిని ఇవ్వడమే కాదు. మెదడులోని కణజాలాన్ని కాపాడతాయి. వయసుతోపాటు వచ్చే మతిమరుపువ్యాధిని అడ్డుకోవచ్చు. 
  •  కొన్నిసార్లు మెదడులోని కణాలు తగ్గుముఖం పడుతూ వస్తాయి. అవి అత్యంతవేగంగా డ్యామేజ్‌ కాకుండా బాదంలోని ఔషధం కాపాడుతుంది. 
  •  బాదంలోని జింక్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్‌ ఇ అయితే వయసుతోపాటు వచ్చే ముదిమిఛాయల్ని అంత త్వరగా రానివ్వదు. 
  •  బాదంలోని విటమిన్‌ బి6 మెదడుకు ఎంతో ఉపకారి. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
  •  బ్రెయిన్‌సెల్స్‌ డ్యామేజ్‌ కాకుండా ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్‌ కాపాడతాయి. 

How to reduce weight in natural methods

నేటి కాలంలో బరువు పెరగడం సాధారణ సమస్యగా మారిపోయింది. అందుకు తగిన ట్టుగానే బరువు తగ్గించే పరికరాలు, మందులెన్నో మార్కెట్లో ప్రవేశించాయి. కానీ ఇంట్లోనే లభించే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల శరీర బరువును మనమే నియంత్రించుకోగలుగుతాం. అంతేకాదు పెరిగిన బరువు తగ్గించుకోనూగలం. పైగా ఇంట్లోనే ఎంపిక చేసుకున్న ఆహారం తినడంవల్ల బరువు తగ్గినప్పుడు నీరసం రాకుండా శరీరం ఎనర్జటిక్‌గా ఉండేందుకివి సహాయపడతాయి. మరి ఆ పదార్థాలేంటో మీరూ చదివేసేయండి!
ఫైబర్‌ ఫుడ్స్‌ 
త్వరగా బరువు తగ్గించుకోవాలనుకునే వారు రోజూవారి ఆహారంలో ఫైబర్‌ పదార్థాలు తీసు కోవాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గుతారు. ఓట్స్‌, బ్రౌన్‌రైస్‌, గోధుమలు, జొన్నలు లాంటి ఆహార పదార్థాలలో ఈ ఫైబర్‌ ఉంటుంది. వీటిని తినడంవల్ల కడుపు నిండిన ఫీలింగ్‌ ఉంటుంది. సులభంగా బరువు తగ్గించడానికి ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. ఆకలి కూడా త్వరగా వేయదు. ఇవి వ్యాధి నిరోధకతను కూడా పెంచుతాయి.
బాదం పప్పులు బాదం పప్పులు అంటే చాలా మందికి ఇష్టం. రోజూ ఓ గుప్పెడు బాదం పప్పులు రాత్రి నాన బెట్టి ఉదయాన్నే అయిదు పలుకులు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అందుతుంది. ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది.
గ్రీన్ టీ 
గ్రీన్ టీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తాగడం వల్ల త్వరలోనే బరువు తగ్గుతారు.
ఎగ్‌వైట్‌ 
ఎగ్‌వైట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎగ్‌వైట్‌ కాల్షియంను అందిస్తుంది. ఇది ఎముకలకు మంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్లలో ఉండే గ్లూకాగాన్ హార్మోన్ ఫ్యాట్‌ బర్నింగ్‌కు సహాయ పడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎనర్జీ కలగడంతో పాటు బరువూ తగ్గుతారు.
పెరుగు 
బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరో ఆహార పదార్థం పెరుగు. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి, ఇంకా పొటాషియం, జింక్‌, విటమిన్ బి 6, బి 12 అధికంగా ఉండడం వల్ల పొట్టదగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.
వెల్లుల్లి 
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే గుణాలు పుష్క లంగా ఉన్నాయి. అందులో ఉండే అలిసిన అనే పదార్థం చెడు కొలెస్ర్టాల్‌ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. దీన్ని రోజూవారి ఆహారంగా తీసుకుంటే శరీర బరువు తగ్గించుకుని గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
దానిమ్మ 
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఫోలిక్‌ యాసిడ్స్‌ ఎక్కువ. అందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. దానిమ్మ తింటే స్వీట్‌ తినాలన్న కోరిక తగ్గి, అదనపు బరువు పెరగకుండా చూస్తుంది.
నిమ్మరసం 
నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మూడు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసంలో ఒక చెంచా తేనె, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి గ్లాసు నీటిలో మిక్స్‌ చేయాలి. ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఉదయం పరగడపునే తాగాలి. ఇలా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తాగడంవల్ల మెటబాలిజం ఆలస్యమై శరీరానికి శక్తి లభిస్తుంది.
కరివేపాకు 
ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే 10 కరి వేపాకు ఆకులు తినడం వల్ల కూడా ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్‌కు కారణమయ్యే ఊబకాయం, అధిక బరువు తగ్గించడంలో కరి వేపాకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
టమోటాలు 
ప్రతిరోజు ఉదయం పరగడపునే రెండు మూడు టమోటాలు తినాలి. విత్తనాలు తొక్కతో పాటు అలాగే తినాలి. వీటిలో పైబర్‌ అధికంగా ఉంటుంది. టమోటాలో ఉండే కొన్ని రకాల పదార్థాలు ఆకలిని తగ్గించే హార్మోన్లను ఉత్పతి చేస్తాయి. దాంతో ఆకలి తగ్గించే ఆహారాల మీద కోరిక కలగకుండా నియమిత ఆహార సేవనానికి దోహదపడుతుంది.

లావు తగ్గాలనుకునే వాళ్లకి టొమాటో సూప్‌ తాగమని న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు చెప్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం టొమాటో సూప్‌లను ఆహారంలో చేర్చడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఆకలి కాలేదంటే తినడం తగ్గిపోతుంది కదా. దాంతో బరువు తగ్గుతారన్నమాట. టొమాటోల్లో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలతో పాటు లైకోపిన్‌ కూడా ఉంటుంది. 
అందుకని బరువు తగ్గించుకోవాలనే వాళ్ల కోసం రెండు రకాల టొమాటో సూప్‌లు ఇవి. 
స్పైసీ సూప్‌ 
కావలసినవి: బంగాళాదుంప, క్యారెట్‌, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, టొమాటో తరుగు - ఒక కప్పు, నీళ్లు - 250 మిల్లిలీటర్లు, వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు) - 250 మిల్లిలీటర్లు, టొమాటో గుజ్జు - ఒక టేబుల్‌ స్పూన్‌, కారం - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా. 
తయారీ: 
  • ఉల్లి, క్యారెట్‌, బంగాళా దుంప ముక్కల్ని సాస్‌ పాన్‌లో వేసి నీళ్లు, కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి కలపాలి. సాస్‌పాన్‌ను స్టవ్‌ మీద పెట్టి మంట పెద్దదిగా పెట్టి ముక్కల్ని ఉడికించాలి. తరువాత టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి 25 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో గరిటెతో మిశ్రమాన్ని కలుపుతుండాలి. 
  • అవసరమనుకుంటే మధ్యలో నీళ్లు కలపొచ్చు. అన్నీ ఉడికాక స్టవ్‌ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తటి సాసీ సూప్‌లా గ్రైండ్‌ చేయాలి. సూప్‌ బౌల్‌లో వేడివేడి సూప్‌ వేసుకుని తాగితే హాయిగా ఉంటుంది. 
టొమాటో, తులసాకుల సూప్‌ 
కావలసినవి: బంగాళాదుంప - ఒకటి (పెద్దది), పచ్చి టొమాటోలు - ఏడు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం - చిన్న ముక్క, టొమాటో గుజ్జు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఆలివ్‌ నూనె - అర టేబుల్‌ స్పూన్‌, తాజా తులసాకులు (తరిగి) - ఒక కట్ట, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్‌. 
తయారీ: 
  • ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, బంగాళాదుంపలను సన్నగా తరగాలి. మీడియం సైజ్‌ సాస్‌పాన్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని మెత్తగా అయ్యేవరకు వేగించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి మరో నిమిషం వేగించి అరలీటరు నీళ్లు పోయాలి. 
  • బంగాళాదుంప ముక్కలు కాస్త మెత్తబడ్డాక స్టవ్‌ మంటను తగ్గించి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి. తరువాత అందులోనే తులసాకుల తరుగు, ఉప్పు, మిరియాలు వేసి కాసేపు ఉంచి స్టవ్‌ ఆపేయాలి. ఈ సూప్‌ను వేడివేడిగా బ్రెడ్‌ స్టిక్స్‌తో కలిపి తాగితే రుచిగా ఉంటుంది.

  • పెసరపప్పు: ఇందులో ఎ, బి, సి, ఇ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్‌, పొటాషియం వంటి మినరల్స్‌ కూడా బోలెడు ఉన్నాయి. అందుకని కొవ్వుపదార్థాలకు బదులుగా ఈ పప్పుని తినమంటున్నారు డైటీషియన్లు. బరువు తగ్గించే పెసరపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలం. అందుకే కాబోలు పెసరపప్పు ఒక గిన్నెడు తింటే పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు కూడా. బరువు తగ్గించడంతో పాటు జీవక్రియలు, వ్యాధినిరోధక వ్యవస్థల్ని మెరుగుపరచడమే కాకుండా ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడుతుంది కూడా. ఈ పప్పుని చపాతీలతో తినొచ్చు. అలా నచ్చలేదంటే వీటిని మొలకెత్తించి అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ కారం, చాట్‌ మసాలా, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తిన్నా రుచిగానే ఉంటుంది.