రోజూ టొమాటో తింటున్నారా? ఎందుకంటారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా ఇందులో ప్రొస్టేట్ కేన్సర్‌పై పోరాటం చేసే శక్తివంతమైన కాంపొనెంట్ ఉందిట. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి్‌సకు చెందిన అధ్యయనకారులు చేశారు. టొమాటోల్లో లైకోపిన్ అనే బయోయాక్టివ్ రెడ్ పిగ్‌మెంట్ ఉంటుంది. ఇది రకరకాల జంతువుల్లో ప్రొస్టేట్ ట్యూమర్లు పెరగకుండా అడ్డుకున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. మానవశరీరంలో లైకోపిన్ జీవక్రియ ఎలా ఉంటుందో కనిపెట్టలేదు. అందుకే మనుషుల్లో దీని జీవక్రియ గుర్తించడానికి అధ్యయనకారులు పూనుకున్నారు. జీవక్రియలో లైకోపిన్ రసాయనికంగా పలు మార్పులకు గురవడమే కాకుండా ఆరోగ్యం మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది. లైకోపిన్ ఎంత వేగంగా శరీరంలోకి ఇంకుతుందో అంత వేగంగా బయటకు కూడా పోతుంది. లైకోపిన్ శరీరంలోకి గ్రహించబడిన తర్వాత నిర్మాణాత్మకంగా మార్పులు సంభవిస్తాయి. లైకోపిన్ ప్రొస్టేట్ కేన్సర్ రిస్కు, తీవ్రతలను మనుషుల్లో ఎంత మేర తగ్గిస్తాయన్నది ముందు ముందు అధ్యయనకారుల పరిశోధనల్లో మరింత విస్పష్టంగా తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వయసు పెరిగి కండరాలు బాగా బలహీనపడ్డాయా? అయితే దీనికి ఒక సింపుల్ చిట్కా ఉంది. ఈ సమస్య తీవ్రత తగ్గాలంటే యాపిల్, గ్రీన్ టొమాటోలు బాగా తినాలట. వీటిని తింటే కండరాల బలహీనత తగ్గుతుందట. వీటిల్లోని రసాయనాలు కండరాల సమస్యలను పరిష్కరిస్తాయట. ఇటీవల అయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కండరాల బలహీనతకు కారణమవుతున్న ప్రొటీన్‌ను కనుక్కునే ప్రయత్నంలో ఆడమ్స్ నాయకత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని గుర్తించింది. ఎటిఎ్‌ఫఎ4 అనే ప్రొటీన్ కండరాల్లో మార్పుకు కారణమవుతోంది. ఫలితంగా కండరాల ప్రొటీన్ సింథసిస్, మాస్, బలం క్షీణిస్తున్నాయి. యాపిల్ పండు తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే గ్రీన్ టొమాటోల్లో టొమాటైడైన్ ఉండడాన్ని గుర్తించారు. ఇవి రెండూ కూడా కండరాలు దెబ్బతినకుండా నివారిస్తాయని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు కండరాల బలహీనతను పోగొట్టడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని కూడా తేలింది. శరీరానికి సరైన యాక్టివిటీ లేకపోవడం, వయసు పెరగడం వంటి కారణాల వల్ల కండరాలు బలహీనపడతాయి. కండరాల్లోని బలహీనతను తగ్గించడానికి కావాల్సిన సుగుణాలు యాపిల్, టొమాటాల్లోని ఉర్సోలిక్ యాసిడ్, టొమాటైడైన్‌లలో పుష్కలంగా ఉన్నాయి. కండరాల బలహీనతకు మూల కారణాన్ని కూడా వీటి ద్వారా కనుక్కోవచ్చుట. ఈ పరిశోధనా ఫలితాలు కండరాల బలహీనత, యాట్రోఫీ వంటి సమస్యల నివారణకు కొత్త చికిత్సలకు కనుక్కోవడానికి సహాయపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను ఎలుకలపై జరిపారు. వయసు వల్ల తలెత్తిన కండరాల బలహీనత, యాట్రోఫీ ఉర్సోలిక్ యాసిడ్, టొమాటైడైన్‌ల వల్ల తగ్గాయని తేలింది కూడా. మొత్తానికి యాపిల్, టొమాటోల వాడకం వల్ల కండరాల మాస్ 10 శాతం పెరిగింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే కండరాల దృఢత్వం, నాణ్యతలు కూడా 30 శాతం పెరిగాయి. సో... వీటి సహాయంతో వృద్ధాప్యంలో తలెత్తే కండరాల బాధల నుంచి మనం సులభంగా బయటపడొచ్చన్నమాట.
అతిగా ధూమపానం, మద్యపానం వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని టమాట, యాపిల్ పూర్వస్థితికి తీసుకొస్తాయని పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు తెలిపారు. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ టమాటలు, మూడు కప్పుల పండ్లు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా తయారవుతుందని వెల్లడించారు. పండ్లతో తయారయ్యే ప్రాసె్‌సడ్ ఆహారం, టమాట సాస్ లాంటి వాటితో ప్రయోజనం లేదని, తాజా పండ్లు, టమాటలు తింటేనే కాలేయం బాగైనట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు.
అతిగా ధూమపానం, మద్యపానం వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని టమాట, యాపిల్ పూర్వస్థితికి తీసుకొస్తాయని పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు తెలిపారు. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ టమాటలు, మూడు కప్పుల పండ్లు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా తయారవుతుందని వెల్లడించారు. పండ్లతో తయారయ్యే ప్రాసె్‌సడ్ ఆహారం, టమాట సాస్ లాంటి వాటితో ప్రయోజనం లేదని, తాజా పండ్లు, టమాటలు తింటేనే కాలేయం బాగైనట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు.
టొమాటోలు లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ వాడే ఈ కూరగాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టొమాటోల వాడకం వల్ల అందం సైతం ఇనుమడిస్తుంది. అందం, ఆరోగ్యానికీ టొమాటో ఎలా పనికొస్తుందంటే...
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. డయేరియాను నివారిస్తుంది. పచ్చకామెర్లను నివారిస్తుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
కళ్లకు మంచిది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
మధుమేహం, చర్మసమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
రక్తప్రసరణ బాగా జరిగేలా సహకరిస్తుంది.
కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తుంది.
శరీరంలో ఫ్లూయిడ్స్ సమతులంగా ఉండేలా క్రమబద్ధీకరిస్తుంది.
టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తుంది.
వయసుపైబడ్డ ఛాయలను కనిపించనీకుండా యంగ్‌గా ఉంచుతుంది.
కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది.
వీటిలోని రకరకాల యాంటిక్సిండెంట్లు క్యాన్సర్ నివారణలో బాగా పనిచేస్తాయి.
విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిల్లో పోషకాలు పుష్కలం. విటమిన్-ఎ, సి, కె అలాగే విటమిన్-బి6, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వ ంటివి అధికంగా ఉన్నాయి. డైటరీ ఫైబర్‌తోపాటు పలు ఆర్గానిక్ కాంపౌడ్స్ కూడా టొమాటోల్లో ఉన్నాయి.
నిత్యం టొమాటోలను తినడం వల్ల రక్తంలో ఉన్న ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ప్రమాణాలు తగ్గుతాయి.
టొమాటోలు తరచూ తినడం వల్ల దంతాలు, చర్మం, జుట్టు, ఎముకలకు ఎంతో మంచిది. టొమాటో జ్యూసు సన్‌బర్న్స్‌ను తగ్గిస్తుంది.
వీటిని నిత్యం తినడం వల్ల గాల్‌స్టోన్స్ సమస్య తలెత్తదు.
No comments:
Post a Comment