జుత్తుకు మంచి మందుగా ఉపయోగపడే మందార పువ్వు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందన్న విషయం ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. మందార పువ్వులతో తయారు చేసిన టీని తాగితే తొలిదశలో ఉన్న రక్తపోటును త్వరగా తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని హ్యూమన్ న్యూట్రీషియన్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ పరిశోధన నిర్వహించారు. 30 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న సుమారు 50 మంది మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. వీరందరూ రక్తపోటు తొలిదశలో ఉన్నవారే! వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి మందారపూలతో చేసిన టీని ఇచ్చారు. మరో గ్రూపు వారికి మామూలు టీ ఇచ్చారు. కొన్ని వారాల అనంతరం వీరి రక్తపోటును పరిశీలించగా మందార పువ్వులతో తయారు చేసిన టీని తాగిన వారిలో రక్తపోటు క్రమేపీ తగ్గడాన్ని గుర్తించారు. మామూలు టీ తాగిన వారిలో ఎలాంటి మార్పునూ వీరు గమనించలేదు. కేవలం మందార పువ్వుల టీ తాగడం వలనే వీరిలో రక్తపోటు అదుపులో ఉందా? మరే ఇతర కారణాలేమైనా దోహదం చేశాయా? అన్న అంశం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు
శిరోజ సంపద తలకు నిజంగా పెట్టని కిరీటం వంటిది. కానీ పేనుకొరుకుడు వ్యాధి ఆ కిరీటాన్ని ముక్కచెక్కలు చేస్తుంది. వెంట్రుకలు బిల్లలు బ్లిలుగా ఊడిపోతూ తలంతా వికృతంగా మారుతుంది ఇది తీవ్రమైన ఆత్మన్యూనతా భావనకు కూడా గురిచేస్తుంది. ఈ సమస్యతో వెంట్రుకలు మొత్తంగా కాకుండా అక్కడక్కడ పోతుంటాయి. దీనివల్ల బట్టతల భాగాలు భాగాలుగా వచ్చినట్లు అనిపిస్తుంది. అసలు వైద్యమే లేదనుకుని చాలా మంది ఆ వ్యాధి ఇంకా ఇంకా పెద్దదయ్యేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. వాస్తవానికి ఈ సమస్యకు పలు రకాల విరుగుడు మార్గాలు ఉన్నాయి.
చందన తైలాన్ని ప్రతిరోజూ మూడు పూటలావెంట్రుకలు ఊడిపోయిన చోట రాస్తూ ఉంటే ఆ భాగంలో వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంది.
గురువింద గింజను నీటిలో అరగదీసి. అలా వచ్చిన గంధాన్ని వెంట్రుకలు ఊడిన ఖాళీ స్థలంలో రాస్తే సమస్య తొలగిపోతుంది.
వెంట్రుకలు ఊడిపోయిన చోట మందార పువ్వుతో రోజుకు రెండు మూడు సార్లు రుద్దితే వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంది.
No comments:
Post a Comment