నారింజపండు తొక్క పడేసి పండు తింటాం. కానీ ఆ తొక్కతో కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి. నారింజపండు తొక్కలను మూడు రోజుల పాటు ఎండబెట్టి ఆ తరువాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.
- నారింజ తొక్కలో ఉండే సి-విటమిన్ చర్మం నిగారించేందుకు దోహదపడుతుంది. నేచురల్ సన్‌స్ర్కీన్‌గానూ ఉపయోగపడుతుంది.
ఉపయోగించే విధానం : రెండు టీ స్పూన్ల నారింజపండు తొక్కల పొడిని తీసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ పెరుగు, తేనె వేసి కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడపై రాసుకుని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు, మూడు రోజులు ఇలా చేస్తే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
- నారింజ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మంపై వచ్చే ముడతలకు, చర్మం సాగిపోవడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌పై పోరాడేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి.
No comments:
Post a Comment