Sunday, 9 October 2016

Bantipoolu




















ముద్దబంతిపువ్వు అనగానే అదేదో అలంకారానికే అన్నట్టు చూస్తాం. కానీ, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకించి పైల్స్‌, పంటినొప్పి, చెవినొప్పి వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. వివరాల్లోకి వెళితే.... 
బంతిపూల నుంచి తీసిన 5 నుంచి 10 మి. లీటర్ల రసాన్ని రోజూ మూడు పూటలా తీసుకుంటే పైల్స్‌ నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.
10 గ్రాముల బంతి ఆకులు రెండు గ్రాముల మిరియాలను మెత్తగా నూరి తింటే పైల్స్‌ సమస్య తగ్గుతుంది. అలాగే 5 నుంచి 10 గ్రాముల బంతిపూల రెక్కలను నేతిలో వేయించి రోజూ మూడు పూటలా తింటే పైల్స్‌ నుంచి వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
బంతి ఆకుల రసం తాగితే పైల్స్‌ నుంచి రక్తం కారడం నిలిచిపోతుంది. లేదా 250 గ్రాముల బంతి ఆకుల్ని 250 గ్రాముల అరటి వేరును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు వాటి రసాన్ని తీసి రోజూ 10 నుంచి 20 మి,.లీ. రసాన్ని సేవించినా ఈ రక్తస్రావం ఆగిపోతుఉంది.  
వీటితో పాటు బంతి ఆకుల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే, పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. బంతి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 



No comments:

Post a Comment