Sunday, 23 October 2016

Batani


ఠాణీ.... అంటే టైంపాస్‌కి చిరుతిండిగానే అందరికీ తెలుసు. కానీ దీనిలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక నిల్వలు ఉన్నాయని కొందరికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా పచ్చి బఠాణీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌తో పాటు కర్రీగా కూడా వీటిని వినియోగిస్తుంటారు. ఎండిన బఠాణీలను చిరుతిండిగా ఉపయోగిస్తారు. నవంబర్‌ నుంచి జనవరి వరకు ఎక్కవగా పండే ఈ బఠాణీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని వంటల్లో వినియోగించుకునేందుకు కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ వృక్షశాస్త్రవేత్త మెండల్‌ బఠాణీమొక్కపైనే అనువంశికత సిద్ధాంత రూపకల్పన కోసం పరిశోధనలు జరిపి ఎన్నో ఆశక్తి కరమైన అంశాలను నిర్ధారించారు. ప్రస్తుతం ఇండియాలో బఠాణీ పచ్చ రంగులో మాత్రమే లభిస్తుండగా వివిధ దేశాల్లో వంకాయ, బంగారు రంగుల్లో కూడా లభ్యమౌతున్నాయి. 
వంటల్లో దీని వినియోగం ఎక్కువే.... 
పచ్చి బఠాణీలో పోషక నిల్వలు ఉన్న విషయం తెలియకుండానే ఎందరో భోజన ప్రియులు వీటిని ఇతర కూరగాయలతో ఉడికించుకుని తింటున్నారు. ఆలు, పన్నీర్‌, మటన్‌ ఇలా రకరకాల కూరల్లో, బిర్యానీలోనూ కలిపి వండడం బాగా పెరిగింది. బఠాణీ సూప్‌ కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. మార్కెట్‌లో పచ్చి బఠాణీ పావుకిలో రూ 50 చొప్పున విక్రయిస్తున్నా అమ్మకాలు తగ్గడం లేదంటే దీనిని ఎంత మంది ప్రత్యేకంగా తింటున్నారో అర్థమౌతోంది. 
పచ్చి బఠాణీలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువే.... 
పచ్చి బఠాణీలో సి-విటమిన్‌ పుష్కలంగా లభ్యమౌతుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. కంటిచూపును మెరుగు పరిచే కెరోటిన్‌ ల్యూటెన్‌ జియాక్సాంథీన్‌... వంటి యాంటీ ఆక్సిడెంట్లూ వీటిల్లో ఎక్కువగా ఉన్నాయి. బఠాణీల్లో కార్బోహైడ్రేడ్లు పీచు. ప్రొటీన్లు, విటమిన్లు ఖనిజలవణాలు వంటి పోషకాలు కూడా ఎక్కువే. పచ్చి బఠాణీల్లో మాత్రమే లభ్యమయ్యే కొమెసా్ట్రల్‌ అనే ఫైటో న్యూట్రియంట్‌(శాపోనిన్‌) ఉదరానికి సంబంధించిన క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. కొలెసా్ట్రల్‌ తగ్గించే బీటా సైటోస్టెరాల్‌ నిల్వలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటి ఖనిజాలు కూడా ఉండడంతో బఠాణీ పోషకాల గని కాదని మాత్రం ఎవరు చెప్పగలరు. 
రంగువేసిన బఠానీతో జాగ్రత్త 
పచ్చి బఠాణీ అని నమ్మించడానికి వ్యాపారులు ఎండిన బఠాణీలను నీటిలో నానబెట్టి వాటికి పచ్చరంగును కలిపి విక్రయిస్తుంటారని ఈవిషయలో కొనుగోలు దారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వేళ తప్పని సరిగా కొనుగోలు చేయాల్సి వస్తే రంగు పూర్తిగా పోయే వరకు ఒకటిని నాలుగు సార్లు బఠాణీని కడిగి వాడుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment