Tuesday 11 October 2016

Banana its herbal / medical properties


అరటి ఒక చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక మూలిక. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థ శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీన్ని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం తీసుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడి గుడ్డులోను, 400 గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఇక మోస్తారు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు , వృద్ధులకు వ్యాధుల నుంచి కోలుకునే వారికి ఇది సరైన ఆహారం. అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్ధాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. 

మధుమేహ రోగులు ఇతర పిండి పదారాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరం లేదు.
అరటి పండులో సుమారు 100 కేలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 కేలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటిని తినవచ్చు. అరటిలో కొవ్వు పదార్థాం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంతో దీన్ని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనిలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. దీనిలోని పొటాషియం బీపీ, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మల బద్ధకాన్ని, అల్సర్‌ను అరికడతాయి. డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది.

రోజుకు ఒక అరటిపండు తింటే కంటికి ఎంతో మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. అరటిపండు తినడం వల్ల కంటికి సంబంధించిన జబ్బులు రావట. ఇటీవల వీరు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. అరటిపళ్లల్లో కెరొటనాయిడ్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పళ్లను, కూరగాయలను ఎ విటమిన్‌గా మారుస్తుంది. 
గతంలో చేసిన స్టడీల్లో కూడా కెరొటనాయిడ్‌ ప్రమాణాలు ఎక్కువవున్న ఆహారపదార్థాలు తినడం మంచిదని తేలింది. వాటిని తినడం వల్ల క్రానిక్‌ జబ్బులు రాకుండా నివారిస్తాయని వెల్లడైంది. ఉదాహరణకు కేన్సర్స్‌, గుండెజబ్బులు, డయాబెటిస్‌ వంటివనమాట. నూతనంగా శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో అరటిపళ్లల్లో కెరొటనాయిడ్స్‌ ఉన్నాయని, ఇవి శరీరంలో ఎ విటమిన్‌ను పెంచుతాయని గుర్తించారు. విటమిన్‌-ఎ కంటిచూపుకు ఎంతో మంచిదని గుర్తించారు. విటమిన్‌-ఎ లోపాన్ని నిరోధించడానికి అరటిపళ్లల్లో కెరొటనాయిడ్స్‌ పెరిగే విధానాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
  కెరొటనాయిడ్‌ను ఎక్కువ, తక్కువలను ఉత్పత్తిచేసే రెండు రకాలైన అరటిపళ్లపై శాస్త్రవేత్తలు ఈ స్టడీని చేశారు. కెరొటనాయిడ్‌ కంటికి, ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుందని గమనించారు. అరటిపళ్లు తినడం అన్ని వయసుల వారికీ మంచిదని తేల్చారు. అందులోనూ చిన్నపిల్లలకు అరటిపళ్లు చేసే మంచి అంతా ఇంతా కాదన్నారు. సో... క్రమంతప్పకుండా అరటిపండు తినండి. మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.



తిన్న ఆహారం సులువుగా జీర్ణం చేయటానికి, తక్షణ శక్తి ఇవ్వటానికి ఉపయోగపడే అరటిపండు కంటి ఆరోగ్యానికీమంచిదని తాజా సర్వేలో తేలింది.ప్రతిరోజూ ఓ అరటిపండు మన మెనూలో ఉంటే కంటికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. చక్కని కంటిచూపుతో పాటు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ అరటిని తీసుకుంటే మంచిదని వారంటున్నారు. అరటిలో ఉండే కెరొటినాయిడ్స్‌ లివర్‌నే కాదు కంటిచూపునూ కాపాడుతుంది. ఇంతకుముందు వచ్చిన సర్వేల్లో పండ్లలో అధికంగా ఉండే కెరొటినాయిడ్స్‌ కారణంగా క్రానిక్‌ డిసీజ్‌లతో పాటు క్యాన్సర్స్‌ కూడా రావని తేలింది. అయితే ఈ తాజా సర్వేలో అరటిపండ్లలో రిచ్‌ ప్రొవిటమిన్‌ ఎ కెరొటినాయిడ్స్‌ అధికంగా ఉంటాయని తేలింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీ పరిశోధకులు అరటిపై పరిశోధన చేశారు. అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండు పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మొత్తానికి కంటిచూపు సమస్యలు రాకుండా ఉండాలంటే అరటితో నేస్తం చేయాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు




మెనోపాజ్‌లోకి అడుగుపెట్టిన మహిళలు అరటిపళ్లు తింటే చాలా మంచిదట. అది వాళ్లల్లో స్ట్రోక్‌ రిస్కును తగ్గిస్తుందట. ఇటీవల ఒక స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌ను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ స్టడీలో భాగంగా మెనోపాజ్‌లో ప్రవేశించిన మొత్తం 90,137 మహిళలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ మహిళలందరూ 50-79 వయస్సు వాళ్లు. 11 సంవత్సరాల పాటు ఈ స్టడీని కొనసాగించారు. ఈ కాలపరిమితిలో పొటాషియం ఉన్న ఫుడ్స్‌ను వీళ్లు ఎంత తీసుకుంటున్నారు, స్టడీ సమయంలో వారికేమైనా స్ట్రోక్‌ వచ్చిందా,  చనిపోయారా వంటి అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పోటాషియం ఉన్న ఫుడ్స్‌ తింటే స్ట్రోక్‌ రిస్కు నాల్గవవంతు తగ్గుతుందంటున్నారు. ఈ స్టడీలో పాల్గొన్నవారు రోజుకు 2.622 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకుంటున్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమండేషన్స్‌ ప్రకారమైతే మహిళలు రోజుకు 3,510 మిల్లీగ్రాములు  పొటాషియం ఉన్న ఆహారపదార్థాలు తినాలి. స్టడీలో పాల్గొన్నవారిలో 16.6 శాతం మంది అదే మోతాదులో లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువగా పొటాషియం తీసుకుంటున్నట్టు తేలింది. ఈ స్టడీ ప్రధానంగా ఆహారపదార్థాల్లో ఉండే పొటాషియం పైనే జరిగింది. తక్కువ పొటాషియం తీసుకునే వారిలో కన్నా ఎక్కువ పొటాషియం తీసుకుంటున్న మహిళల్లో 12 శాతం స్ట్రోక్‌ రిస్కు తక్కువ ఉందిట. అలాగే వివిధ రకాల స్ట్రోక్స్‌ వచ్చే అవకాశం 21 శాతం తక్కువగా ఉంది. హైపర్‌టెన్షన్‌ ఉన్న మహిళల్లో పోటాషియం ఎక్కువ తీసుకున్నా స్ట్రోక్‌ రిస్కు మటుకు ఉంటుందట. అందుకేహైపర్‌టెన్షన్‌ పాలపడకముందే పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయట. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన సిల్వియా వాసెర్‌థైల్‌-స్మోలెర్‌ మాట్లాడుతూ స్త్రీలు పొటాషియం ఎక్కువ ఉండే ఆహారపదర్థాలు తప్పనిసరిగా తినాలన్నారు. అదే సమయంలో ఎక్కువ పొటాషియం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిపారు. అలాచేస్తే గుండెకు హానికరమని హెచ్చరిస్తున్నారు. పోషకవిలువలున్న ఆహారాన్ని వీరు బాగా తినాలని సూచిస్తున్నారు.



ఏడాది పొడవునా లభించే అరటి పండు శరీరానికి అమృతతుల్యమే. పోషకాలకు అది పెట్టని కోట. ఒక్క అరటి పండు దాదాపు 100 కేలరీల శక్తినిస్తుంది. ఇందులోని పోషకాలను గమనిస్తే....
 పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌, మాంగనీసు, వంటి ఖనిజాలతో పాటు ఇనుము, జింక్‌, ఫోలిక్‌ ఆమ్లాలు కూడా శరీరానికి అవసరమైన పరిమాణంలో
లభిస్తాయి.
 అరటి పండు తిన్నప్పుడు అందులోని ట్రిఫ్టోఫన్‌ అనేది అమినో సెరటోనిన్‌గా మారుతుంది. ఫలితంగా శరీరంలో ఒత్తిడి తగ్గి మనసుకు సాంత్వన లభిస్తుంది.
 ఇందులోని ఐరన్‌ హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది. పెద్దపేగుకు మేలు చేసే ప్రోబయాటిక్‌ బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. ఈ బ్యాక్టీరియా
ఎంజైములను ఉత్పత్తి చేసి తద్వారా జీర్ణశక్తి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
 అరటి పండులో ఉండే పొటాషియం, చాలా తక్కువ మోతాదులో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
 ఈ పండులో చెక్కరలే కాకుండా, ప్రొటీన్లు సైతం అధికంగానే ఉంటాయి. ఒక్క అరటి పండు 3 ఆపిల్స్‌ లేదా 2 గుడ్లు లేదా అర లీటర్‌ పాలకు సమానం.
 పాలు అరటి పండ్లను రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ చెంతన ఉన్నట్లే.


  • సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తుల అలవాట్లను మానుకోవాలనుకునే వారికి అరటి పండు ఎంతో సహకరిస్తుంది. అరటి పండులో బి-6, బి-12 విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సహజంగానే ఉంటాయి. ఇవి సిగరెట్‌ మానుకున్నప్పుడు వచ్చే నికోటిన్‌ విత్‌డ్రాయల్‌ లక్షణాల నియంత్రణకు తోడ్పడతాయి.
  • అరటి పండులో గ్లూకోజ్‌ నిలువలు చాలా ఎక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు వాటిని తినకూడదని చెప్పడం పరిపాటి. అయితే అరటికాయలో చక్కెర, ఉప్పు నిలువలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు కూడా అరటికాయ కూర తినవచ్చు.
  • అరటి పండులో అత్యధిక శాతం పొటాషియం ఉంటుంది. అందుకే తిన్న వెంటనే శక్తి వస్తుంది. అందుకే బాగా నీరసించిన వారికి సత్వరమే శక్తి రావాలంటే అరటిపండు తినాలి. అరటి పండులోని పొటాషియం హానికరం కాదు కూడా. నీళ్లలో ఉండే పొటాషియం హృద్రోగులకు కొంత నష్టం కలిగిస్తుంది. అయితే అరటి పండులోని పొటాషియంతో ఆ నష్టం ఉండదు.



అరటి
150 గ్రాముల మేక మాంసంలో,  400 మిల్లీలీటర్ల ఆవు పాలలో ఎంత శక్తి ఉంటుందో కేవలం ఒక అరటి పండులో అంత శక్తి ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాధుల నుంచి తక్షణమే కోలుకునే శక్తినిస్తుంది. మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే అరటి పండు తినడంలో అభ్యంతరం లేదు. కానీ వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అరటి పండు తింటే సుమారు వంద క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి శరీరక అవసరాల కోసం సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకుంటే వారు అరటి పండు ను నిరభ్యంతరంగా తినవచ్చు. అరటిలో కొవ్వు పదార్థం చాలా తక్కువగా ఉటుంది. ఈ కారణంతో కామెర్లు, ఇతర కాలేయ వ్యాధులు ఉన్నవారు కూడా తినవచ్చు. దీనిలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని కిడ్నీలు విఫలమైనవారికి ఇది దివ్యౌషధం. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. పచ్చి అరటి కాయలు విరేచనాలను, పండ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. డయేరి యాను తగ్గించడంలో అర టి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ మూడు అరటిపండ్లు తింటే గుండెపోటు రాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.


జిడ్డు మాయం: అరటిపండు చర్మం మీది మృతకణాలను తొలగిస్తుంది. అలానే అదనపు సెబాన్ని తొలగించి చర్మం జిడ్డుగా కనిపించనీయదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద గీతలు, ముడతలను నివారించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
నల్ల మచ్చలు మాయం: ఈ పండులోని ఎ విటమిన్‌, జింక్‌, మాంగనీస్‌లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖం మీద రుద్దుకుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి.
 
కేశాలు పట్టులా: అరటిపండులోని సిలికా కొల్లాజెన్‌ గ్రహించడంలో దోహదపడుతుంది. దీనిలోని కార్బోహైడ్రేట్లు, సహజ నూనెలు వెంట్రుకలకు పోషణనిచ్చి, మృదువుగా మారుస్తాయి. కురులకు బనానా మాస్క్‌ అప్లై చేస్తే వాటికి తేమ అంది, చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌, బ్యాక్టీరియా మటుమాయం అవుతాయి.




No comments:

Post a Comment