Sunday 9 October 2016

Menthem Vada for health Telugu dishes






కావలసిన పదార్థాలు:సజ్జపిండి- ఒకటిన్నర కప్పు, తరిగిన మెంతెం కూర- ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి- ఆరు, పసుపు- అర టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, దనియాల పొడి- ఒక టీ స్పూను, పెరుగు- పావు కప్పు, నువ్వులు- అర టీ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేగించడానికి సరిపడా. 
 
తయారీ విధానం: ఒక గిన్నెలో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత వడల్లా చేసుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఎరుపు రంగు వచ్చేదాకా వేగించుకోవాలి. చాలా రుచిగా ఉంటాయివి.

No comments:

Post a Comment