- సూక్ష్మపోషకపదార్థాలతోపాటు విటమిన్-ఎ, ఐరన్, రిబోఫ్లావిన్ ఉంటాయి. ఫోలేట్, బి6 విటమిన్లు కూడా దీంట్లో అధికం.
- నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది.
- దీనివల్ల జీర్ణక్రియ, జీవక్రియ రెండూ బాగా జరుగుతాయి.
- క్యాబేజీలో పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. పోలీఫెనల్స్, సల్ఫర్ కాంపౌండ్లు కూడా ఇందులో ఉన్నాయి.
- క్యాబేజీలో విటమిన్-సి ఎక్కువ. ఇది గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది.
- కంటిచూపును కాపాడుతుంది. కాటరాక్ట్ రిస్కు నుంచి పరిరక్షిస్తుంది.
- కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.
- రెడ్ క్యాబేజీలో పొటాషియం ఎక్కువ. దీన్ని తింటే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.
- చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను తగ్గించే రెండు పదార్థాలు క్యాబేజీలో ఉండడం మరో విశేషం.
- క్యాబేజీలో విటమిన్- కె అధికంగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్-సొల్యుబుల్ విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి. విటమిన్-కె శరీరంలోని పలు ముఖ్య క్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్-కె లేకపోతే రక్తం సరిగా గడ్డకట్టదు. రక్తస్రావం బాగా జరిగే రిస్కు ఉంటుంది.
- క్యాబేజీలోని ఒక రసాయనం రేడియేషన్ వల్ల తలెత్తే దుష్ఫలితాల నుంచి రక్షిస్తుంది. రేడియేషన్ చికిత్స నుంచి కూడా సంరక్షిస్తుంది.
- రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
- ఇందులో సల్ఫర్, సిలికాన్ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల వెంట్రుకలు బిరుసెక్కవు. క్యాబేజీలో విటమిన్-ఎ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- బరువు తగ్గుతారు. రక్తపోటును ఇది క్రమబద్ధీకరిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు తొందరగా తగ్గుతాయి.
క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ సి పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. దీంతోపాటు కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాబేజీని తినాలి. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. క్యాబేజీని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
క్యాబేజీలో అనేక సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకనే క్యాబేజీ ఆ వాసన వస్తుంది. అయితే ఈ సమ్మేళనాలు మనకు మేలు చేస్తాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
క్యాబేజీని విటమిన్ కె కు మంచి మూలం అని చెప్పవచ్చు. క్యాబేజీని తింటే విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా జాగ్రత్త పడవచ్చు.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తింటే చాలా తక్కువగా క్యాలరీలు లభిస్తాయి. పైగా ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
No comments:
Post a Comment