ప్రతీరోజూ తమలపాకు లు , తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుందంటారు. ఇంతేకాదు తమలపాకులతో మనకు ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తమలపాకుల్ని రోజూ తింటే శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుందని పలువురు సైంటిస్టులు తెలిపారు. తమలపాకును తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు తలెత్తవు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడటంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. తమలపాకులకు తేనెను జతచేసి నమిలితే దగ్గు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి తమలపాకులు బాగా ఉపకరిస్తాయి. వీటిని తగిన మోతాదులో తేనెతో కలిపి తింటే శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది.
- తమలపాకు తొడిమలను సున్నంతో కలిపి దంచి, అంటిస్తే పులిపిర్లు రాలిపోతాయి.
- ఒక స్పూను తమలపాకు రసాన్ని తే నెతో కలిపి సేవిస్తే, దగ్గు ఆయాసం తగ్గుతాయి.
- నువ్వుల నూనె రాసిన తమలపాకులను వెచ్చచేసి కడుపు మీద కట్టుకడితే కడుపు ఉబ్బరం, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- తమలపాకు రసం, పటిక కలిపి తేలు కరచిన చోట అంటిస్తే బాధ తగ్గుతుంది.
- నువ్వుల నూనె రాపి వెచ్చ చేసిన ఆకులను దెబ్బ తగిలిన చోట క డితే వాపు, నొప్పి తొలగిపోతాయి.
- వెచ్చచేసిన ఆకులను కనురెప్పలపై వేసి కట్టిన కండ్లనొప్పి, మంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- రోజుకు మూడుసార్లు తమలపాకు నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.
No comments:
Post a Comment