పుచ్చకాయ..
శరీరాన్ని చల్లబరిచే గుణం పుచ్చకాయకు అధికంగా ఉంది. ఇది ఉదరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని ఆమ్లాలను తొలగిస్తుంది. మూత్రపిండాలు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. పుచ్చకాయ రసం జీలకర్ర, పంచదార కలిపి రాస్తే గనేరియా వంటి వ్యాధులు నయమవుతాయి. తేనే కలిపి తాగితే గుండె, మూత్రపిండాల సమస్యలు నయమవుతాయి. పుచ్చకాయ రసాన్ని కొద్దిగా వేడి చేసి తాగితే ఆస్తమా, జలుబు తగ్గుతాయి. అజీర్తికి మందులా పని చేస్తుంది. విత్తనాల రసాన్ని తాగితే బీపీ, మూత్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో క్యాన్సర్‌ను నిరోధించే గుణం కూడా ఉంది.
- పొటాషియం 319 మి.గ్రా
- కార్బొహైడ్రేట్స్ 5.9 గ్రాములు
- ప్రోటీన్‌లు0.6గ్రాములు
- ఫ్యాట్0.2గ్రాములు
- ఫైబర్ 0.2గ్రాములు
- కాల్షియం 6 మి.గ్రాములు
- ఫాస్పరస్ 11మి.గ్రాములు
- థయామిన్ 0.04మి.గ్రా
- రిబో ప్లేవిన్ 0.05మి.గ్రా
- నియాసిన్ 0.2మి.గ్రాములు
మనకు మార్కెట్లో చౌకగా లభించే పుచ్చకాయ.
40 ఏళ్లు దాటిన పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ప్రధానమైన కారణం రక్తనాళాలు సన్నబడడం. మధుమేహం, అధిక కొవ్వు, అధిక రక్తపోటు వంటి అనేక కారణాల వల్ల రక్తనాళాలు సన్నబడవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వయాగ్రా ఉపయోగపడుతుంది.
అయితే పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే అమీనో యాసిడ్ కూడా ఈ పని సమర్థంగా చేయగలదని తాజా అధ్యయనాల్లో రుజువైందట! ‘‘పుచ్చకాయ సహజ వయాగ్రాగా పనిచేస్తుందని తేలింది. అందులోని సిట్రులిన్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత అర్గీనిన్‌గా మారుతుంది. ఇది రక్త నాళాల్లో అడ్డంకుల్ని తొలగిస్తుంది. దీనివల్ల అంగానికి రక్త ప్రసరణ పెరిగి స్తంభన సమస్యలు తొలగుతాయి’’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న న్యూట్రిషనిస్ట్ లిలీ సౌటర్ చెప్పారు. 24 మంది పేషెంట్లపై కొన్ని నెలలపాటు పరిశోధన చేసిన అనంతరం ఈ విషయాన్ని గుర్తించారు.
వేసవి కాలంలో కూల్ డ్రింక్స్‌తో పాటు ఆ తాపం నుంచి బయటపడటానికి చాలామంది పుచ్చకాయలను తింటుంటారు. అయితే పుచ్చకాయలు తినే వారిలో ఎక్కువ మంది వాటి విత్తనాలను పడేస్తుంటారు. కానీ పుచ్చకాయల విత్తనాల వల్ల అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయట. పుచ్చ విత్తనాల్లో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ప్రొటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయట. పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులను అరికట్టొచ్చట. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతోందట.
వేసవిలో పుచ్చకాయ తినడంవలన కలిగేలాభాల గురించి తెలిసిందే! ఇది సంతానలేమి సమస్యను తగ్గిస్తుందన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వలన పురుషులలో వీర్యకణాలు వృద్ధిచెందుతాయని తేలింది. అంతేకాకుండా మగవారిలో పురుష హార్మోన్లు రెట్టింపు అవుతాయన్న విషయాన్ని వీరు గుర్తించారు. నాచురల్ వయగ్రాలాగా పనిచేసే పుచ్చకాయను ఎక్కువగాతీసుకున్నప్పుడే ఈ ఫలితాన్ని పొందవచ్చని వారు అంటున్నారు. అయితే స్త్రీలలో సంతానోత్పత్తికి సంబంధించి పుచ్చకాయ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందన్న విషయంమీద ఇంకా అధ్యయనాలు చేయాలని వారు స్పష్టంచేస్తున్నారు. పుచ్చకాయను కేవలం వేసవిలో మాత్రమే కాకుండా వీలున్నప్పుడల్లా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

పుచ్చలో చక్కెర పదార్థం కేవలం ఆరుశాతం ఉంటే , 93 శాతం నీరు ఉంటుంది. అందుకే దీన్ని ‘నేచురల్ టోనర్’ అంటారు. దీన్ని షవర్ జెల్‌లు, లిప్‌స్టిక్‌లు, లిప్ గ్లాసెస్ తయారీలో వాడతారు.
- విటమిన్‌ఎ, బి6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండటం వల్ల పుచ్చరసం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నివారిస్తుంది.
- పుచ్చగుజ్జును టోనర్‌గానూ వాడొచ్చు. గుజ్జును చర్మంపైన రాసి దానిపై ఫ్రూట్‌ప్యాక్ వేసుకుని 30 నిమిషాలుంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మాలకు ఇలా చేయవచ్చు. చర్మాన్ని చల్లబరచటమే కాదు యవ్వనంగా ఉంచుతుంది. చర్మం చుట్టూ పొరలా ఏర్పడి తేమ బయటకు వెళ్లకుండా చేస్తుంది. దీనివల్ల పొడి చర్మం కూడా మృదువుగా మారుతుంది.
- వయసు పెరిగే ప్రక్రియను నిరోధించే గుణాలు పుచ్చలో ఉన్నాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండెపోటు, రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది.
- బరువు తగ్గటానికి కూడా ఈ వాటర్‌మెలన్ అద్భుతంగా పనిచేస్తుంది. అమైనోయాసిడ్‌లు పుచ్చలో పుష్కలం. ఇవి కేశనాళికలకు రక్తప్రవాహాన్ని పెంచుతాయి. వెంట్రుకలకు పుచ్చగుజ్జును రాసి 30 నిమిషాల పాటు ఉంచితే కేశాలు బాగా ఎదుగుతాయి.
- ఈ జ్యూస్‌ను దూదితో ముఖంపైన రాస్తే చర్మం బిగుతుగా, కాంతివంతం అవుతుంది.
No comments:
Post a Comment