జామ పండుతో లభించే విటమిన్లు
జామపండులో అత్యధికంగా విటమిన్ సి, పోటాషియం ఉంటాయి. వీటిద్వారా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగినంత లభిస్తాయి. వీటిని తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఉల్లాసంగా ఉంటారు. విటమిన్ సి ఉసిరితో సమానంగా, కమలా కన్నా 5 రెట్లు, నిమ్మ, నారింజ పండుల్లో కంటే 10 రెట్లు అధికంగా జామలో లభిస్తాయి. జామ పండును తొక్కతో పాటు తినటం వల్ల ఇందులోని పీచు పదార్థం శరీరానికి మంచి చేస్తుంది.
చర్మ సౌందర్యంలో...
చర్మసౌందర్యంలో జామపండు గుజ్జు అధిక ప్రాధాన్యం సంతరించుకుందని బ్యూటీషియన్లు అంటున్నారు. బొప్పాయి, టమోటా కంటే జామపండు గుజ్జుతో ఫేషియల్ చేసుకునేందుకు ఎక్కువమంది మహిళలు ఆసక్తి చూపుతునట్లు తెలిపారు. చర్మ సౌందర్యాన్ని పెంచటంతో పాటు నల్లటి మచ్చలను తొలగించే పోషకాలు జామ పండులో ఉన్నాయి.
ఆయుర్వేద వైద్యంలో జామ ఆకుల పాత్ర...
జామ ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. ప్రధానంగా తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, పంటినొప్పితో తరచు బాధపడుతున్న వారికి ఉపయోగించే ఆయుర్వేద మందుల్లో జామ ఆకుల పాత్ర కీలకం. జామ ఆకులను నీటితో శుభ్రం చేసి బాగా ఎండబెట్టిన తరువాత పొడిచేసుకుని మజ్జిగ, తేనెలో కలుపుకుని తినటం వల్ల సైనస్, మైగ్రేన్ (తలనొప్పి) తగ్గుతాయి.
పొట్టవద్ద పేరుకున్న కొవ్వును కరిగించే శక్తి జామ ఆకులకు ఉంది. జామ బెరడు బాగా శుభ్రం చేసి నీటిలో మరిగించి వడకట్టుకుని రెండు పుదీన ఆకులను అందులో వేసుకుని రోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి రక్తం శుద్ధి చేస్తుంది. పళ్ల సమస్యలుండేవారు రోజూ రెండు లేత జామ ఆకులు నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే జామ ఆకులు, పండ్లు తినడానికి ముందు వాటిని నీటితో బాగా శుభ్రం చేయాలని లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
తీపి, వగరు, పులుపు.. మూడు రుచుల కలయిక జామ. పచ్చికాయ కోసుకుని రవ్వంత ఉప్పు, చిటికెడు కారం చల్లుకుని తింటే.. ఆ రుచి ముందు ఆపిల్ కూడా బలాదూర్. రుచి ఒక్కటే కాదు.. అత్యంత చౌకధరలో దొరికే జామలో ఖరీదైన పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. అవేంటంటే..
మిగిలిన పండ్లలో కంటే విటమిన్ సి, ఇనుము జామలోనే అధికం. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు రాకుండా జామ కాపాడుతుంది. ఎందుకంటే ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి. పచ్చి జామ జ్యూస్ తాగితే మరీ మంచిది.
లావు తగ్గడానికి రకరకాల ఖరీదైన మార్గాలను ఎంచుకున్నా కొన్నిసార్లు ఫలితం ఉండదు. రోజుకు ఒక జామపండు తింటే అధిక బరువు సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. జామలో ప్రొటీన్లు, విటమిన్లతో పాటు అధిక పీచుపదార్థం శరీరానికి లభిస్తుంది. ఇది జీర్ణప్రక్రియను చురుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఆపిల్స్, బత్తాయి, ద్రాక్షలతో పోలిస్తే.. పచ్చిజామలోనే షుగర్ తక్కువ మోతాదులో ఉంటుంది. మధుమేహులు తినడానికి ఏ ఇబ్బందీ ఉండదు.
మెదడులోని నరాలకు రక్తప్రసరణ సాఫీగా సాగడానికి విటమిన్ బి3, బి6 ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి రెండూ జామలో అధికం. జామలోని మెగ్నీషియం కండరాలకు, నరాలకు ఉపశమనం ఇస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి రోజుకొక జామ తింటే ఎంతో మేలు.
పళ్లనొప్పికి జామ ఆకు దివ్యౌషధం. పచ్చి జామ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లు, చిగుళ్లకు పట్టించుకుంటే.. నోటిలోని చెడు బ్యాక్టీరియా పోతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తద్వార పంటినొప్పి ఉండదు.
కంటి చూపునకు విటమిన్ ఎ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం సహజం. ఈ సమస్యలను అధిగమించడానికి క్యారెట్‌తోపాటు జామ చేసే మేలు అంతాఇంతా కాదు.
శరీరంలో తలెత్తే పలు సమస్యలకు మలబద్ధకం కారణం. ఎందుకంటే మనం తినే తిండిలో పీచుపదార్థాలు అతి తక్కువ. జామ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. ఒక జామలో రోజుకు ఒక వ్యక్తికి కావాల్సిన పీచుపదార్థంలో సుమారు 12 శాతం లభించినట్లే.
గుండె ఆరోగ్యానికి సోడియం, పొటాషియం ముఖ్యమైనవి. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు దోహదం చేస్తాయవి. లేకుంటే అధిక ఒత్తిడికి గురైనప్పుడు హైపర్‌టెన్షన్ వంటివి చుట్టుముడతాయి. జామతో అది తగ్గుతుంది. దీంతోపాటు గుండెజబ్బులకు కారణమయ్యే ట్రైకోగ్లిజరైడ్స్, ఎల్‌డిఎల్ (చెడుకొవ్వు)లను అడ్డుకుంటుంది జామపండు. తద్వారా మంచి కొవ్వు (హెచ్‌డిఎల్) పెరుగుతుంది.
అనేక పోషకాలు కలిగి ఉన్న జామ పండు ఆరోగ్యానికి నిధి లాంటిది. విటమిన్- సి, కెరోటినాయిడ్స్, ఫోలేట్, పొటాషియం, పీచుపదార్థరం, క్యాల్షియం, ఐరన్.... ఇలా దాదాపు అన్ని విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమై పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్, సోడియం అసలే ఉండవు. పైగా, రక్తంలో త్వరితంగా కరిగిపోయే పీచు, జామలో అధికంగా ఉంటుంది. అందుకే ఇది ర క్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
అయితే మధుమేహం ఉన్నవారు బాగా మగ్గిన పండ్లను కాకుండా దోరగా అప్పడే పక్వానికి వచ్చినవి మాత్రమే రోజుకు ఒకటి రెండు తినడం ప్రయోజనకరం. మలబద్ధకం నివారణలో జామ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. జామ కాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా అంటే 100 గ్రాముల కాయలో సుమారు 300 మి. గ్రాముల విటమిన్ - సి లభిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే 6 కమలా పండ్లలో ఎంత సి- విటమిన్ ఉంటుందో బాగా పండి న ఒక్క జామ పండులో అంత ఉంటుంది.
క్యాల్షియం, పాస్పరస్‌లు కూడా ఇందులో సరిపడా లభిస్తాయి. మిగతా అన్ని పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల కంటే ఎక్కువగా లభించేది ఈ పండులోనే. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి ఇందులోని విటమిన్- ఏ కంటి చూపును పరిరక్షించడంతో పాటు చర్మ ఆరోగాన్ని కాపాడుతుంది. గౌటు వ్యాధి ఉన్న వారికి ఇది మంచి చేస్తుంది. దంతాల పటిష్టతకూ ఉపయోగపడుతుంది.
భోజనానికి ముందు ప్రతి రోజూ జామ పండు తినేవారిలో కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది ఇలా జామండును రోజు వారీ ఆహారంలో బాగం చేసుకుంటే రక్తనాళాలకు సంబంధించిన పలు ఇబ్బందులనుంచి బయటపడవచ్చు. పచ్చి కూరగాయలు తినేవారు జామ ముక్కలను చేర్చుకుంటే శ్వాసకోశాలు బాగా పనిచేస్తాయి. వయసు పైబడిన వారికి వచ్చే మతిమరుపు సమస్యను జామ వీలైనంత దూరం చేస్తుంది. అల్పాహారంతో పాటు జామ పండును తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు. ఎసిడిటీ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
జామ పండు ఆరోగ్యప్రదాయని. ఇదో పోషకాల గని. ఒక్క జామపండు తింటే పది యాపిల్స్ తిన్నంత మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో విరివిగా లభించే జామపండ్లను తరుచూ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు నిగారింపును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. విటమిన్ సీ పుష్కలంగా లభ్యమయ్యే జామపండ్లను చిన్న పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చనీ, మధుమోహం, గుండెజబ్బులు ఉన్నవారు సైతం జామపండ్లను ఎంచక్కా తినవచ్చని స్పష్టంచేస్తున్నారు.
ఎన్నో ఉపయోగాలు..
జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. కళ్లకు రక్షణ ఇస్తుంది. కళ్ల మంటలు తగ్గుతాయి, కళ్ల కింద చారలు పోతాయి. వివిధ క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారం
త్వరగా జీర్ణమవుతుంది. దంతాలు, చిగుళ్లవాపు, గొంతు నొప్పిని అరికడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. వీటి గింజల్లో ఒమోగా-3 ఒమోగా-6 కొవ్వు అమ్లాలు, పీచు పదార్ధలు ఉంటాయి. మెగ్నీషియం, కెరబోనాయిడ్లు ఉండడంవల్ల దంత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని పీచు పదార్ధం మల్లబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. జామ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని నమిలితే పంటి నొప్పిలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. రోజుకో జామ పండు తినడం వల్ల ఎసిడిటీ, కడుపుఉబ్బరం, కడుపులో మంటలు తగ్గుతాయి. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.
ఏ బీ సీ విటమిన్లు..
జామ పండులో విటమిన్ ఏ, బీ, సీ విటమిన్లు ఉన్నాయి. క్యాల్షియమ్, పొస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలీక్‌యాసిడ్ మెండుగా లభిస్తాయి.
పోషకాలు బొలెడు..
100 గ్రాముల జామ పండులో 0.3గ్రాముల కొవ్వు , 0.9గ్రాముల ప్రొటీన్, 5.2 గ్రాముల పీచు పదార్ధం, 212 మిల్లీ గ్రాముల సీ విటమిన్, 5.5మిల్లీ గ్రాముల సోడియం, 91 మిల్లీ గ్రాముల ఇనుము, 51 కిలో కాల్యలరీల శక్తి లభిస్తాయి.
No comments:
Post a Comment