Thursday 20 October 2016

Green Chillies

  • మీరు నమ్ముతారో లేదో పచ్చిమిర్చి ‘విటమిన్‌ సి’ కి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్న మాట.
  • మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి - జీర్ణప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చిమిర్చిలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది మిర్చి.
  • పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవనశైలిలో హైపర్‌టెన్షన్‌కు గురికాని వారు అరుదు. దీన్ని అంతోఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిరప.
  • కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్ని దరి చేరనీయదు.
  • ఏ ముప్పు వల్లనో తీవ్రగాయాలైతే బ్లడ్‌క్లాటింగ్‌ జరుగుతుంది. ఈ ముప్పు తీవ్రతను కాపాడే గుణం పచ్చిమిర్చికి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే మిర్చిలో విటమిన్‌ కె ఆ పని చేసిపెడుతుంది.
  • మిర్చికి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. తద్వార దృష్టిలోపాలు రావు. ఇందులోని విటమిన్‌ ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది.
  • వీటన్నిటితోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. చిన్నచిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. రుతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది మిరప.
  • నడివయస్కుల నుంచి వృద్ధుల వరకు చాలామందిని వేధించే సమస్య మలబద్ధకం. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి.. ఆ సమస్యను తొలగిస్తుంది.
  • మిరప రెగ్యులర్‌గా తింటే.. వయసురీత్యా చర్మం మీద వచ్చే
  • ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
  • పచ్చిమిర్చిలో యాంటీ - ఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి సంరక్షణనిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. సహజసిద్ధంగా శరీరాన్ని శుద్ధిచేస్తాయి. క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తాయి. ముదిమి లక్షణాలను నెమ్మదింపచేస్తాయి.
  • పచ్చిమిరపలో విటమిన్‌-సి ఉంటుంది. ఇది ముక్కుపుటాలను తెరుస్తుంది. శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే వ్యాధినిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.
  • కారంగా ఉండే వీటిని తింటే చర్మానికి మేలు కలుగుతుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-ఇ చర్మానికి మెరుపుని తెచ్చే సహజసిద్ధమైన నూనెల్ని విడుదలచేస్తుంది.
  • వీటివల్ల మీకు వచ్చే కాలరీలు శూన్యం. అంటే డైట్‌ చేసేవాళ్లు పచ్చిమిర్చిని తినేందుకు సందేహించక్కర్లేదన్నమాట.
  • మగవాళ్లకు పచ్చిమిరప చేసే మేలు అంతా ఇంతా కాదు. వాళ్లలో సాధారణంగా వచ్చే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధించేందుకు శరీరాన్ని తయారుచేస్తుంది ఇది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటుంది. అంటే డయాబెటిక్‌తో ఉన్న వాళ్ల ఆహారంలో పచ్చిమిరప తప్పకుండా ఉండాలన్నట్టే కదా.
  • జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అందుకు వీటిలో ఉండే పీచుపదార్థమే కారణం.
  • చాలామంది కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల మూడ్‌ పాడయిపోతుంది అనుకుంటారు. కాని వాస్తవం అందుకు పూర్తివిరుద్ధం. పచ్చిమిరపను తినడం వల్ల మెదడులో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మిమ్మల్ని సంతోషంగా ఉంచడమేకాకుండా ఉత్సాహాన్ని నింపుతాయి.
  • పొగతాగే అలవాటు ఉన్న వాళ్లు పచ్చిమిర్చి తింటే లంగ్‌ క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం వస్తుంది. అంతేకాదు ఆ క్యాన్సర్‌ బారిన పడే రిస్క్‌ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ అంశం ఇంకా పరిశోధనల్లోనే ఉంది.
  • సహజసిద్ధంగా ఐరన్‌ శరీరంలోకి వచ్చి చేరాలంటే పచ్చిమిరప కావాల్సిందే. ఇది మహిళల్ని ఐరన్‌ లోపం బారిన పడకుండా కాపాడుతుంది.
  • ఏదేమైతేనేం కాని కారం కారణంగా పచ్చిమిరపను పక్కన పెట్టొద్దు అనే విషయం స్పష్టమవుతుంది. అయితే తినమన్నారు కదా అని ఎడాపెడా తినేయకుండా వారి వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని తినాలి మరి.

No comments:

Post a Comment