Wednesday, 26 October 2016

Jaggery and its uses (Bellam in Telugu)



బెల్లం
రోజుకో బెల్లం ముక్క తింటే ఆరోగ్యం వంద రెట్లు మెరుగవుతుంది. బెల్లంలో చక్కెర లాగ ఎక్కువ రసాయనాలు వాడరు. ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతి 100 గ్రామలు బెల్లంలో 383 క్యాలరీల శక్తి, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు,  50 మిల్లీ గ్రాముల కాల్షియం, 40 మిల్లీ గ్రాముల పాస్పరస్‌, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్‌ లభిస్తాయి. రోజుకో బెల్లం ముక్క తినడంతో రక్త్తశుద్ధి జరిగి, వ్యాధుల ముప్పు తగ్గుతుంది. లివర్‌ను శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లతో  రోగనిరోధకశక్తిని పెంచుతాయి. బెల్లంలో పుష్కలంగా  లభించే ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ మహిళల్లో రక్తహీనతను నివారి స్తాయి. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు చురుగ్గా ఉండి, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బొగ్గుగనులు, సిమెంటు ఫ్యాక్టరీలు, జిన్నింగ్‌ మిల్లుల్లో పనిచేసే వారికి శ్వాసద్వార లోపలికి చేరిన దుమ్ము, ధూళి లాంటి వ్యర్థాలు తొలగి పోతాయి. కీళ్ల నొప్పుల బాధితులు రోజూ 50గ్రాముల బెల్లం అల్లం ముక్క కలుపుకుని తింటే  అలాంటి నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. రోజూ గ్లాసు పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు బలంగా మారుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం చాలా మంచి ఔషధం. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పలు సమస్య లకు బెల్లంతో ఉపశమనం పొందవచ్చు. బెల్లం తినడం వల్ల పొటాషియం, సోడియం అంది రక్త పోటు అదుపులో ఉంటుంది. బెల్లంను నువ్వులతో కలిపి తింటే ఆస్తమా, బ్రాంకైటీస్‌ సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి బోజనం అయ్యాక ఒక బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.


రక్తహీనత రానివ్వదు
బెల్లంలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. రక్తకణాలకు ఆక్సీజన్‌ సరఫరా చేసే హీమోగ్లోబిన్‌లో ఐరన్‌ పాత్ర కీలకం. రోజూ క్రమం తప్పకుండా బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎర్ర రక్తకాణాల ఐరన్‌ అందుతుంది. దీంతో ఊపిరితిత్తుల నుంచి దేహం మొత్తానికి ఎర్ర రక్తకణాల ద్వారా ఆక్సీజన్‌ అందడానికి దోహదపడుతుంది. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి బెల్లం వల్ల అధిక ప్రయోజనం చేకూరుతుంది. 

జీర్ణవ్యవస్థకు బలం
జీర్ణవ్యవస్థపై బెల్లం సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే బెల్లం వేసిన టీ తాగినట్లయితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బెల్లంలో ఉండే పలు ఖనిజాల వల్ల శీతాకాలంలో శరీరంలో వెచ్చదనం పెరిగేలా చేస్తుంది.

పోషకాల గని
బెల్లంలో అధిక పోషకాలు ఉంటాయి. దీంతో ఆరోగ్యపరంగా చూసినా పంచదార కన్నా బెల్లమే ఉత్తమం. బెల్లంలో అనేక విటమిన్లు ఫాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటవల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో కలిగే ముప్పు నుంచి రక్షణ ఏర్పడుతుంది. త్వరగా వృద్ధాప్యం రావడానికి ఫ్రీ రాడికల్సే కారణం. దేహాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం మేలైన డి–టాక్సిన్‌గా పనిచేస్తుంది. దీంట్లో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా టాక్సిన్లను వెలుపలకు పోయేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. 

బరువు తగ్గిస్తుంది
నిత్యం తగిన పరిమాణంలో బెల్లం ఆహారం ద్వారా తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నాలు సులభతరం అవుతాయి. పొట్ట ప్రాంతంలో అదనపు కిలోలను కరిగించడం తేలికవుతుంది. మెటబాలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి సహాయ ఎంజైములను బెల్లం ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం మెరుగ్గా, వేగంగా జీర్ణమవుతుంది. అందువల్ల కొందరు భోజనం చేసిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాన్ని తినడానికి ఆసక్తి కనబరుస్తారు.
మహిళలకు మేలు
రోజూ ఆహారంలో బెల్లం ఉండేలా చూసుకుంటే మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారి ఆహారంలో బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతుంది.  రుతుక్రమంలో వచ్చే చికాకులు, కడుపునొప్పి బెల్లంతో దూరమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

ఆయుర్వేదంలో
పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాల తయారీలో బెల్లాన్ని వినియోగిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి దీనిని సిఫార్సు చేయరు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, పార్శనొప్పి (మైగ్రేన్‌), ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు వివిధ మూలికల్లో బెల్లం ఉపయోగించి చేసిన ఔషధాలను రూపొందిస్తారు. 

మధుమేహం ఉంటే
మధుమేహం సమస్య ఉన్నవారికి పంచదార మాదిరిగానే బెల్లం ప్రభావం కూడా ఉంటుంది. అయితే దేహంలో బెల్లం పూర్తిగా శోషితం (ఇంకడానికి) పంచదార కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఒక టీస్పూన్‌ పంచదార ద్వారా 60 క్యాలరీలు లభిస్తే అదే పరిమాణం ఉన్న బెల్లం ద్వారా 27 క్యాలరీలు వస్తాయి. బెల్లంలో 70 శాతం సూక్రోజు, 10 శాతం గ్లూకోజు, ఫ్రక్టోజు ఉంటాయి. పంచదారలో 50 శాతం ఫ్రక్టోజు ఉంటుంది. అందువల్ల నూట్రిషనిస్టులు పంచదార వాడకం సరైనదికాదని చెబుతారు.  అధిక పంచదార వినియోగం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వస్తాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ కూడా హెచ్చరిస్తోంది. పంచదార ద్వారా కేవలం క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. అయితే బెల్లం తయారీలో రసాయనాల వినియోగం లేనందున విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. పంచదారతో పోల్చితే బెల్లం నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయినా, మధుమేహులు బెల్లంతో చేసిన పదార్థాలను పరిమితంగానే తినాలి.








No comments:

Post a Comment