Sunday, 16 October 2016

Pomagranate its natural healing / ayurvedic properties


 దానిమ్మపండును చూడగానే నోరూరుతుంది. కెంపుల్లా మెరిసిపోయే దానిమ్మ గింజల్లో పోషకాలు కోకొల్లలు. ఈ పండు వృద్ధాప్యాన్ని దరి చేరనీయదని ఓ పరిశోధనలో తేలింది. 
  •  కండరాల్లోని కణాలు బలహీనం కావడమే వయసు పైబడేలా చేస్తుంది. దానిమ్మ గింజల్లోని అణువులు ఈ కణాలను శక్తివంతంగా చేస్తాయి. దీంతో శరీరంలో సత్తువ పెరిగి వార్ధక్యం ఆలస్యంగా పలకరిస్తుంది. 
  • శరీరంలోని కణాలు శక్తిని పుంజుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రక్రియలో కణాల్లో మైటోకాండ్రియా పేరుకుపోతుంది. ఫలితంగా వయసు పైబడుతుంటుంది. 
  •  శరీరానికి ఉపయోగపడని మైటోకాండ్రియా ఊరికే ఉండకుండా.. దుష్ప్రభావాలకు కారణం అవుతుంటుంది. వయసును వేగంగా పెంచడంతో పాటు పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులకు దారితీస్తుంది. 
  •  ఈ కణాలు హీన దశకు వచ్చేసరికి కళ్ల కింద ముడతలు రావడం, బుగ్గలు జారిపోవడం, కండరాల్లో పటుత్వం తగ్గడం.. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నలభైలోనే అరవై ఛాయలు కనిపిస్తాయి. 
  •  దానిమ్మను తీసుకోవడం వల్ల ఈ మైటోకాండ్రియా తగ్గుతుంది. తద్వారా కణాలు ఉత్తేజితం అవుతాయి. వయసు వేగం మందగిస్తుంది. ఈ విషయాన్ని ఎలుకలపై ప్రయోగించి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 
  • దాదాపు రెండేళ్ల వయసున్న ఎలుకకు దానిమ్మ గింజలు తినిపించారు. కొన్నాళ్లకు ఆ ఎలుక గతంలో కంటే ఉత్సాహంగా కనిపించిందట. అదే వయసున్న మిగతా ఎలుకల పరుగుతో పోలిస్తే ఈ ఎలుక 42 శాతం వేగంగా పరిగెత్తడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
  •  దానిమ్మ గింజల్లో శరీరాన్ని ఉత్తేజపరిచే మాయా కణాలంటూ ఏమీ ఉండవు. పేగుల్లోని సూక్ష్మజీవులు దానిమ్మలోని పోషకాలను యూరోలిథిన్‌-ఏగా మారుస్తాయి. ఫలితంగా వయసు పునరుత్తేజితం అవుతుంది. 
  • వంద గ్రాముల గింజల్లో  కెలోరీలు 83 
    కొవ్వు - 1 శాతం, సోడియం - 3 మి.గ్రా 
    పొటాషియం - 236 మి.గ్రా 
    కార్బోహైడ్రేట్స్‌ - 19 గ్రా, ఫైబర్‌ - 4గ్రా 
    షుగర్‌ - 14 గ్రా, ప్రొటీన్‌ - 1.7 గ్రా 
    విటమిన్‌ సి - 17 శాతం 
    విటమిన్‌ బి-6 - 5 శాతం 
    మెగ్నీషియం - 3 శాతం 

    సాగు భళా 
    భారతదేశంలో ఏటా సుమారు 740 వేల టన్నుల దానిమ్మ ఉత్పత్తి అవుతోంది. దానిమ్మ తోటలు మహారాష్ట్రలో విస్తృతంగా ఉన్నాయి.

    అదనపు లాభాలు 
    • దానిమ్మలోని విటమిన్‌ సి, పొటాషియం అలసటను తగ్గిస్తాయి. 
    •  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 
    •  దంత సమస్యలను కూడా దానిమ్మ దూరం చేస్తుంది. 
    • దానిమ్మ రసం తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. 
    • దానిమ్మ జ్యూస్‌తో కాలేయంలోని మలినాలు పోతాయి. 
    •  సౌందర్య సాధనాల్లోనూ దానిమ్మను విస్తృతంగా వాడుతుంటారు.




No comments:

Post a Comment