Wednesday 26 October 2016

Bachchali leaves for vitality


బచ్చలి ఆకులను, కందిపప్పుతో కలిపి కూరగా వండుకుని తింటూ ఉంటే, గర్భిణులు ఎదుర్కొనే మలబద్ధకం తొలగిపోతుంది.
పచ్చి ఆకులను, రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే, నాలుక మీది గుగ్గులు తగ్గిపోతాయి.
బచ్చలి ఆకులను నూరి, కణతలకు పట్టువేస్తే తలలోంచి వచ్చే తీవ్రమైన వేడి తగ్గిపోవడంతో పాటు, సుఖనిద్ర కలుగుతుంది.
బచ్చలి ఆకులతో చేసిన కూరలు తరుచూ వాడుతూ ఉంటే, ఒంటికి చలువ చేస్తుంది. దగ్గు, పైత్యం, అతిదాహం తగ్గిపోతాయి. రక్తహీనత తొలగిపోతుంది. ఆకలి పెరుగుతుంది.
మజ్జిగలో బచ్చలి ఆకులు వేసి ఉడికించి తింటూ ఉంటే, పైల్స్‌ కారణంగా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పిండితే, వెంటనే మంట తగ్గడంతో పాటు, పుండు కూడా మానుతుంది.
మూత్రవిసర్జనలో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, 50 మి.లీ బచ్చలి ఆకు కషాయాన్ని రోజుకు రెండు పూటలా సేవిస్తే మూత్రం సాపీగా సాగిపోతుంది.
తీగ బచ్చలి కూరను తరుచూ తింటూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది. కంఠస్వరం మృదువుగా అవుతుంది.
20 గ్రాముల బచ్చలి ఆకుల రసాన్ని రోజూ రెండు పూటలా తీసుకుంటే మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.

Round brinjal


Amruthapani


Thotakoora leaves / Amaranth

  • బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది.
  • తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
  • అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.
  • తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.
  • తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
  • కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.
  • విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.
  • వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.






Curry leaves

200 గ్రాముల కరివే పాకులు తీసుకుని, 250 మి. లీ. కొబ్బరి నూనెలో మరిగించి ఆ తర్వాత వడగట్టి, ఆ నూనెను రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి.
కరివేపాకు, వేపాకులు ముద్దగా నూరి, స్పూను మోతాదు ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున రోజూ తీసుకుంటే, మధుమేహం అదుపులో ఉంటుంది.
కరివేపాకు ఆకులు మెత్తగా నూరి, నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే అవి త్వరగా మానడమే కాకుండా మచ్చలు కూడా కనుమరుగవుతాయి.
కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమభాగాలుగా తీసుకుని ముద్ద చేసి రాత్రిపూట వారం రోజులు రాసుకుంటే, కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద రాస్తే చారలు తగ్గుతాయి.
కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి పచ్చడి చేసుకుని రోజూ తింటూ ఉంటే దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
ఒక స్పూను కరివేపాకు రసాన్ని ప్రతి రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల సమస్యలు తగ్గిపోతాయి.

Goru Chikkudu (beans)


Jaggery and its uses (Bellam in Telugu)



బెల్లం
రోజుకో బెల్లం ముక్క తింటే ఆరోగ్యం వంద రెట్లు మెరుగవుతుంది. బెల్లంలో చక్కెర లాగ ఎక్కువ రసాయనాలు వాడరు. ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతి 100 గ్రామలు బెల్లంలో 383 క్యాలరీల శక్తి, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు,  50 మిల్లీ గ్రాముల కాల్షియం, 40 మిల్లీ గ్రాముల పాస్పరస్‌, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్‌ లభిస్తాయి. రోజుకో బెల్లం ముక్క తినడంతో రక్త్తశుద్ధి జరిగి, వ్యాధుల ముప్పు తగ్గుతుంది. లివర్‌ను శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి జీర్ణసంబంధ సమస్యలు తలెత్తకండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లతో  రోగనిరోధకశక్తిని పెంచుతాయి. బెల్లంలో పుష్కలంగా  లభించే ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ మహిళల్లో రక్తహీనతను నివారి స్తాయి. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు చురుగ్గా ఉండి, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బొగ్గుగనులు, సిమెంటు ఫ్యాక్టరీలు, జిన్నింగ్‌ మిల్లుల్లో పనిచేసే వారికి శ్వాసద్వార లోపలికి చేరిన దుమ్ము, ధూళి లాంటి వ్యర్థాలు తొలగి పోతాయి. కీళ్ల నొప్పుల బాధితులు రోజూ 50గ్రాముల బెల్లం అల్లం ముక్క కలుపుకుని తింటే  అలాంటి నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. రోజూ గ్లాసు పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు బలంగా మారుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం చాలా మంచి ఔషధం. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పలు సమస్య లకు బెల్లంతో ఉపశమనం పొందవచ్చు. బెల్లం తినడం వల్ల పొటాషియం, సోడియం అంది రక్త పోటు అదుపులో ఉంటుంది. బెల్లంను నువ్వులతో కలిపి తింటే ఆస్తమా, బ్రాంకైటీస్‌ సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి బోజనం అయ్యాక ఒక బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.


రక్తహీనత రానివ్వదు
బెల్లంలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. రక్తకణాలకు ఆక్సీజన్‌ సరఫరా చేసే హీమోగ్లోబిన్‌లో ఐరన్‌ పాత్ర కీలకం. రోజూ క్రమం తప్పకుండా బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎర్ర రక్తకాణాల ఐరన్‌ అందుతుంది. దీంతో ఊపిరితిత్తుల నుంచి దేహం మొత్తానికి ఎర్ర రక్తకణాల ద్వారా ఆక్సీజన్‌ అందడానికి దోహదపడుతుంది. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి బెల్లం వల్ల అధిక ప్రయోజనం చేకూరుతుంది. 

జీర్ణవ్యవస్థకు బలం
జీర్ణవ్యవస్థపై బెల్లం సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే బెల్లం వేసిన టీ తాగినట్లయితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బెల్లంలో ఉండే పలు ఖనిజాల వల్ల శీతాకాలంలో శరీరంలో వెచ్చదనం పెరిగేలా చేస్తుంది.

పోషకాల గని
బెల్లంలో అధిక పోషకాలు ఉంటాయి. దీంతో ఆరోగ్యపరంగా చూసినా పంచదార కన్నా బెల్లమే ఉత్తమం. బెల్లంలో అనేక విటమిన్లు ఫాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటవల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో కలిగే ముప్పు నుంచి రక్షణ ఏర్పడుతుంది. త్వరగా వృద్ధాప్యం రావడానికి ఫ్రీ రాడికల్సే కారణం. దేహాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం మేలైన డి–టాక్సిన్‌గా పనిచేస్తుంది. దీంట్లో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా టాక్సిన్లను వెలుపలకు పోయేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. 

బరువు తగ్గిస్తుంది
నిత్యం తగిన పరిమాణంలో బెల్లం ఆహారం ద్వారా తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నాలు సులభతరం అవుతాయి. పొట్ట ప్రాంతంలో అదనపు కిలోలను కరిగించడం తేలికవుతుంది. మెటబాలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి సహాయ ఎంజైములను బెల్లం ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం మెరుగ్గా, వేగంగా జీర్ణమవుతుంది. అందువల్ల కొందరు భోజనం చేసిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాన్ని తినడానికి ఆసక్తి కనబరుస్తారు.
మహిళలకు మేలు
రోజూ ఆహారంలో బెల్లం ఉండేలా చూసుకుంటే మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారి ఆహారంలో బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతుంది.  రుతుక్రమంలో వచ్చే చికాకులు, కడుపునొప్పి బెల్లంతో దూరమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

ఆయుర్వేదంలో
పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధాల తయారీలో బెల్లాన్ని వినియోగిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారికి దీనిని సిఫార్సు చేయరు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, పార్శనొప్పి (మైగ్రేన్‌), ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు వివిధ మూలికల్లో బెల్లం ఉపయోగించి చేసిన ఔషధాలను రూపొందిస్తారు. 

మధుమేహం ఉంటే
మధుమేహం సమస్య ఉన్నవారికి పంచదార మాదిరిగానే బెల్లం ప్రభావం కూడా ఉంటుంది. అయితే దేహంలో బెల్లం పూర్తిగా శోషితం (ఇంకడానికి) పంచదార కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఒక టీస్పూన్‌ పంచదార ద్వారా 60 క్యాలరీలు లభిస్తే అదే పరిమాణం ఉన్న బెల్లం ద్వారా 27 క్యాలరీలు వస్తాయి. బెల్లంలో 70 శాతం సూక్రోజు, 10 శాతం గ్లూకోజు, ఫ్రక్టోజు ఉంటాయి. పంచదారలో 50 శాతం ఫ్రక్టోజు ఉంటుంది. అందువల్ల నూట్రిషనిస్టులు పంచదార వాడకం సరైనదికాదని చెబుతారు.  అధిక పంచదార వినియోగం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వస్తాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ కూడా హెచ్చరిస్తోంది. పంచదార ద్వారా కేవలం క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. అయితే బెల్లం తయారీలో రసాయనాల వినియోగం లేనందున విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. పంచదారతో పోల్చితే బెల్లం నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయినా, మధుమేహులు బెల్లంతో చేసిన పదార్థాలను పరిమితంగానే తినాలి.








Tuesday 25 October 2016

Orange Peels and their uses

నారింజపండు తొక్క పడేసి పండు తింటాం. కానీ ఆ తొక్కతో కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి. నారింజపండు తొక్కలను మూడు రోజుల పాటు ఎండబెట్టి ఆ తరువాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. 
  • నారింజ తొక్కలో ఉండే సి-విటమిన్‌ చర్మం నిగారించేందుకు దోహదపడుతుంది. నేచురల్‌ సన్‌స్ర్కీన్‌గానూ ఉపయోగపడుతుంది.
ఉపయోగించే విధానం : రెండు టీ స్పూన్ల నారింజపండు తొక్కల పొడిని తీసుకోవాలి. అందులో ఒక టీస్పూన్‌ పెరుగు, తేనె వేసి కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడపై రాసుకుని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు, మూడు రోజులు ఇలా చేస్తే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
  • నారింజ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మంపై వచ్చే ముడతలకు, చర్మం సాగిపోవడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌పై పోరాడేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి.
ఉపయోగించే విధానం : ఒక టేబుల్‌స్పూన్‌ నారింజపండు తొక్కల పొడిలో ఓట్‌మీల్‌ పౌడర్‌, తేనె కలుపుకుని పేస్ట్‌ మాదిరిగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగాల్లో రాసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేస్తే ఫలితం బాగుంటుంది.

Sunday 23 October 2016

cabbage

క్యాబేజీ ....ఇందులో క్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ.
  •  సూక్ష్మపోషకపదార్థాలతోపాటు విటమిన్‌-ఎ, ఐరన్‌, రిబోఫ్లావిన్‌ ఉంటాయి. ఫోలేట్‌, బి6 విటమిన్లు కూడా దీంట్లో అధికం.
  • నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహకరిస్తుంది.
  • దీనివల్ల జీర్ణక్రియ, జీవక్రియ రెండూ బాగా జరుగుతాయి.
  • క్యాబేజీలో పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. పోలీఫెనల్స్‌, సల్ఫర్‌ కాంపౌండ్లు కూడా ఇందులో ఉన్నాయి.
  •  క్యాబేజీలో విటమిన్‌-సి ఎక్కువ. ఇది గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది.
  • కంటిచూపును కాపాడుతుంది. కాటరాక్ట్‌ రిస్కు నుంచి పరిరక్షిస్తుంది.
  • కాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుంది.
  • రెడ్‌ క్యాబేజీలో పొటాషియం ఎక్కువ. దీన్ని తింటే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.
  • చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డిఎల్‌)ను తగ్గించే రెండు పదార్థాలు క్యాబేజీలో ఉండడం మరో విశేషం.
  • క్యాబేజీలో విటమిన్‌- కె అధికంగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్‌-సొల్యుబుల్‌ విటమిన్స్‌ ఎక్కువ ఉన్నాయి. విటమిన్‌-కె శరీరంలోని పలు ముఖ్య క్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్‌-కె లేకపోతే రక్తం సరిగా గడ్డకట్టదు. రక్తస్రావం బాగా జరిగే రిస్కు ఉంటుంది.
  • క్యాబేజీలోని ఒక రసాయనం రేడియేషన్‌ వల్ల తలెత్తే దుష్ఫలితాల నుంచి రక్షిస్తుంది. రేడియేషన్‌ చికిత్స నుంచి కూడా సంరక్షిస్తుంది.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • ఇందులో సల్ఫర్‌, సిలికాన్‌ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల వెంట్రుకలు బిరుసెక్కవు. క్యాబేజీలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • బరువు తగ్గుతారు. రక్తపోటును ఇది క్రమబద్ధీకరిస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో సల్ఫర్‌ అధికంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు తొందరగా తగ్గుతాయి.

Kajjikayalu


Batani


ఠాణీ.... అంటే టైంపాస్‌కి చిరుతిండిగానే అందరికీ తెలుసు. కానీ దీనిలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక నిల్వలు ఉన్నాయని కొందరికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా పచ్చి బఠాణీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌తో పాటు కర్రీగా కూడా వీటిని వినియోగిస్తుంటారు. ఎండిన బఠాణీలను చిరుతిండిగా ఉపయోగిస్తారు. నవంబర్‌ నుంచి జనవరి వరకు ఎక్కవగా పండే ఈ బఠాణీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండడంతో చాలా మంది వీటిని వంటల్లో వినియోగించుకునేందుకు కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ వృక్షశాస్త్రవేత్త మెండల్‌ బఠాణీమొక్కపైనే అనువంశికత సిద్ధాంత రూపకల్పన కోసం పరిశోధనలు జరిపి ఎన్నో ఆశక్తి కరమైన అంశాలను నిర్ధారించారు. ప్రస్తుతం ఇండియాలో బఠాణీ పచ్చ రంగులో మాత్రమే లభిస్తుండగా వివిధ దేశాల్లో వంకాయ, బంగారు రంగుల్లో కూడా లభ్యమౌతున్నాయి. 
వంటల్లో దీని వినియోగం ఎక్కువే.... 
పచ్చి బఠాణీలో పోషక నిల్వలు ఉన్న విషయం తెలియకుండానే ఎందరో భోజన ప్రియులు వీటిని ఇతర కూరగాయలతో ఉడికించుకుని తింటున్నారు. ఆలు, పన్నీర్‌, మటన్‌ ఇలా రకరకాల కూరల్లో, బిర్యానీలోనూ కలిపి వండడం బాగా పెరిగింది. బఠాణీ సూప్‌ కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. మార్కెట్‌లో పచ్చి బఠాణీ పావుకిలో రూ 50 చొప్పున విక్రయిస్తున్నా అమ్మకాలు తగ్గడం లేదంటే దీనిని ఎంత మంది ప్రత్యేకంగా తింటున్నారో అర్థమౌతోంది. 
పచ్చి బఠాణీలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువే.... 
పచ్చి బఠాణీలో సి-విటమిన్‌ పుష్కలంగా లభ్యమౌతుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. కంటిచూపును మెరుగు పరిచే కెరోటిన్‌ ల్యూటెన్‌ జియాక్సాంథీన్‌... వంటి యాంటీ ఆక్సిడెంట్లూ వీటిల్లో ఎక్కువగా ఉన్నాయి. బఠాణీల్లో కార్బోహైడ్రేడ్లు పీచు. ప్రొటీన్లు, విటమిన్లు ఖనిజలవణాలు వంటి పోషకాలు కూడా ఎక్కువే. పచ్చి బఠాణీల్లో మాత్రమే లభ్యమయ్యే కొమెసా్ట్రల్‌ అనే ఫైటో న్యూట్రియంట్‌(శాపోనిన్‌) ఉదరానికి సంబంధించిన క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. కొలెసా్ట్రల్‌ తగ్గించే బీటా సైటోస్టెరాల్‌ నిల్వలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటి ఖనిజాలు కూడా ఉండడంతో బఠాణీ పోషకాల గని కాదని మాత్రం ఎవరు చెప్పగలరు. 
రంగువేసిన బఠానీతో జాగ్రత్త 
పచ్చి బఠాణీ అని నమ్మించడానికి వ్యాపారులు ఎండిన బఠాణీలను నీటిలో నానబెట్టి వాటికి పచ్చరంగును కలిపి విక్రయిస్తుంటారని ఈవిషయలో కొనుగోలు దారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వేళ తప్పని సరిగా కొనుగోలు చేయాల్సి వస్తే రంగు పూర్తిగా పోయే వరకు ఒకటిని నాలుగు సార్లు బఠాణీని కడిగి వాడుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.

Friday 21 October 2016

Papaya
















  • బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
  • బరువు తగ్గుతాం.
  • బహిష్టులు క్రమం తప్పకుండా అవుతాయి.
  • ఇన్ఫెక్షన్లు సోకకుండా నిరోధిస్తుంది.
  • పంటి నొప్పి నుంచి సాంత్వననిస్తుంది.
  • యాంటి క్యాన్సర్‌ సుగుణాలున్నాయి.
  • పేగుల్లో చేరిన నులిపురుగులను తగ్గిస్తుంది.
  • చర్మం మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
  • గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • ఆస్తమాను నిరోధిస్తుంది.
  • ఇందులో విటమిన్‌ ఎ బాగా ఉంది. అందువల్ల వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
  • యాక్నే, కాలిన గాయాలను తగ్గిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ ముడతలను పోగొడుతుంది. కళ్లకింద ఏర్పడ్డ నల్లటి వలయాలను తగ్గిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. ఎగ్జిమా, సొరియాసి్‌సలను తగ్గిస్తుంది. ముఖంపై టాన్‌ను పోగొడుతుంది.
  • యాంటి-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
  • మచ్చలను నివారిస్తుంది.
  • పీచు పదార్థాలుంటాయి కాబట్టి మలబద్దకాన్ని పోగొడుతుంది.
  • మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఫుడ్‌.
  • కళ్లకు మేలు చేస్తుంది. బహిష్టు సమయాల్లో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.
  • ఆర్థ్రరైటీ్‌సను నివారిస్తుంది.
  • రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  • యాంటాక్సిడెంటు న్యూట్రియంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
  • పీచుపదార్థాలు, ఖనిజాలు అధికం. కొలెస్ట్రాల్‌ తక్కువ కూడా. న్యూట్రియంట్లు బాగా ఉన్నాయి.
  • గుండె ధమనుల్లో కొలెస్ట్రాల్‌ చేరకుండా అడ్డుకుంటుంది.
  • యాంటీ-ఏజింగ్‌ ఏజెంట్‌. దీనివల్ల ఏ వయసులోనైనా యంగ్‌గా కనిపిస్తారు.
  • తరచూ తింటే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Water melon its herbal properties











పుచ్చకాయ.. 
శరీరాన్ని చల్లబరిచే గుణం పుచ్చకాయకు అధికంగా ఉంది. ఇది ఉదరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని ఆమ్లాలను తొలగిస్తుంది. మూత్రపిండాలు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. పుచ్చకాయ రసం జీలకర్ర, పంచదార కలిపి రాస్తే గనేరియా వంటి వ్యాధులు నయమవుతాయి. తేనే కలిపి తాగితే గుండె, మూత్రపిండాల సమస్యలు నయమవుతాయి. పుచ్చకాయ రసాన్ని కొద్దిగా వేడి చేసి తాగితే ఆస్తమా, జలుబు తగ్గుతాయి. అజీర్తికి మందులా పని చేస్తుంది. విత్తనాల రసాన్ని తాగితే బీపీ, మూత్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో క్యాన్సర్‌ను నిరోధించే గుణం కూడా ఉంది.
పుచ్చకాయలో ఖనిజాలు పోషకవిలువలు
  • పొటాషియం 319 మి.గ్రా
  • కార్బొహైడ్రేట్స్‌ 5.9 గ్రాములు
  • ప్రోటీన్‌లు0.6గ్రాములు
  • ఫ్యాట్‌0.2గ్రాములు
  • ఫైబర్‌ 0.2గ్రాములు
  • కాల్షియం 6 మి.గ్రాములు
  • ఫాస్పరస్‌ 11మి.గ్రాములు
  • థయామిన్ 0.04మి.గ్రా
  • రిబో ప్లేవిన్‌ 0.05మి.గ్రా
  • నియాసిన్‌ 0.2మి.గ్రాములు
మనకు మార్కెట్లో చౌకగా లభించే పుచ్చకాయ. 
  40 ఏళ్లు దాటిన పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ప్రధానమైన కారణం రక్తనాళాలు సన్నబడడం. మధుమేహం, అధిక కొవ్వు, అధిక రక్తపోటు వంటి అనేక కారణాల వల్ల రక్తనాళాలు సన్నబడవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వయాగ్రా ఉపయోగపడుతుంది.
అయితే పుచ్చకాయలో ఉండే సిట్రులిన్‌ అనే అమీనో యాసిడ్‌ కూడా ఈ పని సమర్థంగా చేయగలదని తాజా అధ్యయనాల్లో రుజువైందట! ‘‘పుచ్చకాయ సహజ వయాగ్రాగా పనిచేస్తుందని తేలింది. అందులోని సిట్రులిన్‌ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత అర్గీనిన్‌గా మారుతుంది. ఇది రక్త నాళాల్లో అడ్డంకుల్ని తొలగిస్తుంది. దీనివల్ల అంగానికి రక్త ప్రసరణ పెరిగి స్తంభన సమస్యలు తొలగుతాయి’’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న న్యూట్రిషనిస్ట్‌ లిలీ సౌటర్‌ చెప్పారు. 24 మంది పేషెంట్లపై కొన్ని నెలలపాటు పరిశోధన చేసిన అనంతరం ఈ విషయాన్ని గుర్తించారు.

వేసవి కాలంలో కూల్ డ్రింక్స్‌తో పాటు ఆ తాపం నుంచి బయటపడటానికి చాలామంది పుచ్చకాయలను తింటుంటారు. అయితే పుచ్చకాయలు తినే వారిలో ఎక్కువ మంది వాటి విత్తనాలను పడేస్తుంటారు. కానీ పుచ్చకాయల విత్తనాల వల్ల అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయట. పుచ్చ విత్తనాల్లో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ప్రొటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయట. పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులను అరికట్టొచ్చట. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతోందట.


వేసవిలో పుచ్చకాయ తినడంవలన కలిగేలాభాల గురించి తెలిసిందే! ఇది సంతానలేమి సమస్యను తగ్గిస్తుందన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వలన పురుషులలో వీర్యకణాలు వృద్ధిచెందుతాయని తేలింది. అంతేకాకుండా మగవారిలో పురుష హార్మోన్లు రెట్టింపు అవుతాయన్న విషయాన్ని వీరు గుర్తించారు. నాచురల్‌ వయగ్రాలాగా పనిచేసే పుచ్చకాయను ఎక్కువగాతీసుకున్నప్పుడే ఈ ఫలితాన్ని పొందవచ్చని వారు అంటున్నారు. అయితే స్త్రీలలో సంతానోత్పత్తికి సంబంధించి పుచ్చకాయ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందన్న విషయంమీద ఇంకా అధ్యయనాలు చేయాలని వారు స్పష్టంచేస్తున్నారు. పుచ్చకాయను కేవలం వేసవిలో మాత్రమే కాకుండా వీలున్నప్పుడల్లా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.


పుచ్చలో చక్కెర పదార్థం కేవలం ఆరుశాతం ఉంటే , 93 శాతం నీరు ఉంటుంది. అందుకే దీన్ని ‘నేచురల్‌ టోనర్‌’ అంటారు. దీన్ని షవర్‌ జెల్‌లు, లిప్‌స్టిక్‌లు, లిప్‌ గ్లాసెస్‌ తయారీలో వాడతారు.
 

  • విటమిన్‌ఎ, బి6, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండటం వల్ల పుచ్చరసం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నివారిస్తుంది.
  • పుచ్చగుజ్జును టోనర్‌గానూ వాడొచ్చు. గుజ్జును చర్మంపైన రాసి దానిపై ఫ్రూట్‌ప్యాక్‌ వేసుకుని 30 నిమిషాలుంచి కడిగేయాలి. అన్ని రకాల చర్మాలకు ఇలా చేయవచ్చు. చర్మాన్ని చల్లబరచటమే కాదు యవ్వనంగా ఉంచుతుంది. చర్మం చుట్టూ పొరలా ఏర్పడి తేమ బయటకు వెళ్లకుండా చేస్తుంది. దీనివల్ల పొడి చర్మం కూడా మృదువుగా మారుతుంది.
  • వయసు పెరిగే ప్రక్రియను నిరోధించే గుణాలు పుచ్చలో ఉన్నాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండెపోటు, రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది.
  • బరువు తగ్గటానికి కూడా ఈ వాటర్‌మెలన్‌ అద్భుతంగా పనిచేస్తుంది. అమైనోయాసిడ్‌లు పుచ్చలో పుష్కలం. ఇవి కేశనాళికలకు రక్తప్రవాహాన్ని పెంచుతాయి. వెంట్రుకలకు పుచ్చగుజ్జును రాసి 30 నిమిషాల పాటు ఉంచితే కేశాలు బాగా ఎదుగుతాయి.
  • ఈ జ్యూస్‌ను దూదితో ముఖంపైన రాస్తే చర్మం బిగుతుగా, కాంతివంతం అవుతుంది.




Thursday 20 October 2016

Green Banana


Paper Chikkudu


Green Chillies

  • మీరు నమ్ముతారో లేదో పచ్చిమిర్చి ‘విటమిన్‌ సి’ కి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్న మాట.
  • మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి - జీర్ణప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చిమిర్చిలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది మిర్చి.
  • పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవనశైలిలో హైపర్‌టెన్షన్‌కు గురికాని వారు అరుదు. దీన్ని అంతోఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిరప.
  • కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్ని దరి చేరనీయదు.
  • ఏ ముప్పు వల్లనో తీవ్రగాయాలైతే బ్లడ్‌క్లాటింగ్‌ జరుగుతుంది. ఈ ముప్పు తీవ్రతను కాపాడే గుణం పచ్చిమిర్చికి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే మిర్చిలో విటమిన్‌ కె ఆ పని చేసిపెడుతుంది.
  • మిర్చికి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. తద్వార దృష్టిలోపాలు రావు. ఇందులోని విటమిన్‌ ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది.
  • వీటన్నిటితోపాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. చిన్నచిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. రుతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది మిరప.
  • నడివయస్కుల నుంచి వృద్ధుల వరకు చాలామందిని వేధించే సమస్య మలబద్ధకం. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి.. ఆ సమస్యను తొలగిస్తుంది.
  • మిరప రెగ్యులర్‌గా తింటే.. వయసురీత్యా చర్మం మీద వచ్చే
  • ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
  • పచ్చిమిర్చిలో యాంటీ - ఆక్సిడెంట్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి సంరక్షణనిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. సహజసిద్ధంగా శరీరాన్ని శుద్ధిచేస్తాయి. క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తాయి. ముదిమి లక్షణాలను నెమ్మదింపచేస్తాయి.
  • పచ్చిమిరపలో విటమిన్‌-సి ఉంటుంది. ఇది ముక్కుపుటాలను తెరుస్తుంది. శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే వ్యాధినిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.
  • కారంగా ఉండే వీటిని తింటే చర్మానికి మేలు కలుగుతుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-ఇ చర్మానికి మెరుపుని తెచ్చే సహజసిద్ధమైన నూనెల్ని విడుదలచేస్తుంది.
  • వీటివల్ల మీకు వచ్చే కాలరీలు శూన్యం. అంటే డైట్‌ చేసేవాళ్లు పచ్చిమిర్చిని తినేందుకు సందేహించక్కర్లేదన్నమాట.
  • మగవాళ్లకు పచ్చిమిరప చేసే మేలు అంతా ఇంతా కాదు. వాళ్లలో సాధారణంగా వచ్చే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధించేందుకు శరీరాన్ని తయారుచేస్తుంది ఇది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటుంది. అంటే డయాబెటిక్‌తో ఉన్న వాళ్ల ఆహారంలో పచ్చిమిరప తప్పకుండా ఉండాలన్నట్టే కదా.
  • జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అందుకు వీటిలో ఉండే పీచుపదార్థమే కారణం.
  • చాలామంది కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల మూడ్‌ పాడయిపోతుంది అనుకుంటారు. కాని వాస్తవం అందుకు పూర్తివిరుద్ధం. పచ్చిమిరపను తినడం వల్ల మెదడులో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మిమ్మల్ని సంతోషంగా ఉంచడమేకాకుండా ఉత్సాహాన్ని నింపుతాయి.
  • పొగతాగే అలవాటు ఉన్న వాళ్లు పచ్చిమిర్చి తింటే లంగ్‌ క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం వస్తుంది. అంతేకాదు ఆ క్యాన్సర్‌ బారిన పడే రిస్క్‌ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ అంశం ఇంకా పరిశోధనల్లోనే ఉంది.
  • సహజసిద్ధంగా ఐరన్‌ శరీరంలోకి వచ్చి చేరాలంటే పచ్చిమిరప కావాల్సిందే. ఇది మహిళల్ని ఐరన్‌ లోపం బారిన పడకుండా కాపాడుతుంది.
  • ఏదేమైతేనేం కాని కారం కారణంగా పచ్చిమిరపను పక్కన పెట్టొద్దు అనే విషయం స్పష్టమవుతుంది. అయితే తినమన్నారు కదా అని ఎడాపెడా తినేయకుండా వారి వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని తినాలి మరి.

Long Brinjal





వీటిలో పీచుపదార్థాలు అధికం. బి-1, బి-6 విటమిన్లు ఎక్కువ. పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌ కూడా విరివిగా లభిస్తాయి. 100 గ్రాముల వంకాయలలో 15 కెలోరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు నియంత్రణకు తగిన ఆహారం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ప్రత్యేకించి ముదురు రంగు వంకాయ తొక్కలో నాసునిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇది జీవకణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. మెదడు కణాల చుట్టూ ఉండే ఆవశ్యక కొవ్వులను కాపాడుతుంది. పిండిపదార్థాలు తక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి మధుమేహ పీడితులకు మంచివి. వీటిలోని పోలీఫినాల్స్‌ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును నిరోధించడంలో సాయపడతాయి. వంకాయలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కొంత వరకు తగ్గిస్తాయి. వీటిలోని పోషక విలువలను పూర్తిగా పొందాలంటే మాత్రం, మూతపెట్టి ఉడికించాలి. లేదా తక్కువ నూనెతో మగ్గించి వండుకోవాలి.

Tomato












































రోజూ టొమాటో తింటున్నారా? ఎందుకంటారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా ఇందులో ప్రొస్టేట్‌ కేన్సర్‌పై పోరాటం చేసే శక్తివంతమైన కాంపొనెంట్‌ ఉందిట. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయి్‌సకు చెందిన అధ్యయనకారులు చేశారు. టొమాటోల్లో లైకోపిన్‌ అనే బయోయాక్టివ్‌ రెడ్‌ పిగ్‌మెంట్‌ ఉంటుంది. ఇది రకరకాల జంతువుల్లో ప్రొస్టేట్‌ ట్యూమర్లు పెరగకుండా అడ్డుకున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. మానవశరీరంలో లైకోపిన్‌ జీవక్రియ ఎలా ఉంటుందో కనిపెట్టలేదు. అందుకే మనుషుల్లో దీని జీవక్రియ గుర్తించడానికి అధ్యయనకారులు పూనుకున్నారు. జీవక్రియలో లైకోపిన్‌ రసాయనికంగా పలు మార్పులకు గురవడమే కాకుండా ఆరోగ్యం మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది.  లైకోపిన్‌ ఎంత వేగంగా శరీరంలోకి ఇంకుతుందో అంత వేగంగా బయటకు కూడా పోతుంది. లైకోపిన్‌ శరీరంలోకి గ్రహించబడిన తర్వాత నిర్మాణాత్మకంగా మార్పులు సంభవిస్తాయి. లైకోపిన్‌ ప్రొస్టేట్‌ కేన్సర్‌ రిస్కు, తీవ్రతలను మనుషుల్లో ఎంత మేర తగ్గిస్తాయన్నది ముందు ముందు అధ్యయనకారుల పరిశోధనల్లో మరింత విస్పష్టంగా తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.



వయసు పెరిగి కండరాలు బాగా బలహీనపడ్డాయా? అయితే దీనికి ఒక సింపుల్‌ చిట్కా ఉంది. ఈ సమస్య తీవ్రత తగ్గాలంటే యాపిల్‌, గ్రీన్‌ టొమాటోలు బాగా తినాలట.  వీటిని తింటే కండరాల బలహీనత తగ్గుతుందట. వీటిల్లోని రసాయనాలు  కండరాల సమస్యలను  పరిష్కరిస్తాయట. ఇటీవల అయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కండరాల బలహీనతకు కారణమవుతున్న ప్రొటీన్‌ను కనుక్కునే ప్రయత్నంలో ఆడమ్స్‌ నాయకత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని  గుర్తించింది. ఎటిఎ్‌ఫఎ4 అనే ప్రొటీన్‌ కండరాల్లో మార్పుకు కారణమవుతోంది. ఫలితంగా కండరాల ప్రొటీన్‌ సింథసిస్‌, మాస్‌, బలం క్షీణిస్తున్నాయి. యాపిల్‌ పండు తొక్కలో ఉర్సోలిక్‌ యాసిడ్‌ ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే గ్రీన్‌ టొమాటోల్లో టొమాటైడైన్‌ ఉండడాన్ని గుర్తించారు. ఇవి రెండూ కూడా కండరాలు దెబ్బతినకుండా నివారిస్తాయని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు కండరాల బలహీనతను పోగొట్టడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని కూడా తేలింది. శరీరానికి సరైన యాక్టివిటీ లేకపోవడం, వయసు పెరగడం వంటి కారణాల వల్ల కండరాలు బలహీనపడతాయి. కండరాల్లోని బలహీనతను తగ్గించడానికి కావాల్సిన  సుగుణాలు యాపిల్‌, టొమాటాల్లోని ఉర్సోలిక్‌ యాసిడ్‌, టొమాటైడైన్‌లలో పుష్కలంగా ఉన్నాయి. కండరాల బలహీనతకు మూల కారణాన్ని కూడా వీటి  ద్వారా కనుక్కోవచ్చుట. ఈ పరిశోధనా ఫలితాలు కండరాల బలహీనత, యాట్రోఫీ వంటి సమస్యల నివారణకు కొత్త చికిత్సలకు కనుక్కోవడానికి  సహాయపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను  ఎలుకలపై జరిపారు.   వయసు వల్ల తలెత్తిన కండరాల బలహీనత, యాట్రోఫీ ఉర్సోలిక్‌ యాసిడ్‌, టొమాటైడైన్‌ల వల్ల తగ్గాయని తేలింది కూడా. మొత్తానికి యాపిల్‌, టొమాటోల వాడకం వల్ల కండరాల మాస్‌ 10 శాతం పెరిగింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే  కండరాల దృఢత్వం, నాణ్యతలు కూడా 30 శాతం పెరిగాయి. సో... వీటి సహాయంతో వృద్ధాప్యంలో తలెత్తే కండరాల బాధల నుంచి మనం సులభంగా బయటపడొచ్చన్నమాట.


అతిగా ధూమపానం, మద్యపానం వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని టమాట, యాపిల్‌ పూర్వస్థితికి తీసుకొస్తాయని పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ టమాటలు, మూడు కప్పుల పండ్లు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా తయారవుతుందని వెల్లడించారు. పండ్లతో తయారయ్యే ప్రాసె్‌సడ్‌ ఆహారం, టమాట సాస్‌ లాంటి వాటితో ప్రయోజనం లేదని, తాజా పండ్లు, టమాటలు తింటేనే కాలేయం బాగైనట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు.



టొమాటోలు లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ వాడే ఈ కూరగాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టొమాటోల వాడకం వల్ల అందం సైతం ఇనుమడిస్తుంది. అందం, ఆరోగ్యానికీ టొమాటో ఎలా పనికొస్తుందంటే...
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. డయేరియాను నివారిస్తుంది. పచ్చకామెర్లను నివారిస్తుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
కళ్లకు మంచిది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
మధుమేహం, చర్మసమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
రక్తప్రసరణ బాగా జరిగేలా సహకరిస్తుంది.
కొలెస్ట్రాల్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది.
శరీరంలో ఫ్లూయిడ్స్‌ సమతులంగా ఉండేలా క్రమబద్ధీకరిస్తుంది.
టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తుంది.
వయసుపైబడ్డ ఛాయలను కనిపించనీకుండా యంగ్‌గా ఉంచుతుంది.
కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది.
వీటిలోని రకరకాల యాంటిక్సిండెంట్లు క్యాన్సర్‌ నివారణలో బాగా పనిచేస్తాయి.
విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిల్లో పోషకాలు పుష్కలం. విటమిన్‌-ఎ, సి, కె అలాగే విటమిన్‌-బి6, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వ ంటివి అధికంగా ఉన్నాయి. డైటరీ ఫైబర్‌తోపాటు పలు ఆర్గానిక్‌ కాంపౌడ్స్‌ కూడా టొమాటోల్లో ఉన్నాయి.
నిత్యం టొమాటోలను తినడం వల్ల రక్తంలో ఉన్న ఎల్‌డిఎల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ ప్రమాణాలు తగ్గుతాయి.
టొమాటోలు తరచూ తినడం వల్ల దంతాలు, చర్మం, జుట్టు, ఎముకలకు ఎంతో మంచిది. టొమాటో జ్యూసు సన్‌బర్న్స్‌ను తగ్గిస్తుంది.
వీటిని నిత్యం తినడం వల్ల గాల్‌స్టోన్స్‌ సమస్య తలెత్తదు.






Kanakambaram flowers


Kanakambaram

Jamakaya Guava

జామ పండుతో లభించే విటమిన్లు 
జామపండులో అత్యధికంగా విటమిన్‌ సి, పోటాషియం ఉంటాయి. వీటిద్వారా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగినంత లభిస్తాయి. వీటిని తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఉల్లాసంగా ఉంటారు. విటమిన్‌ సి ఉసిరితో సమానంగా, కమలా కన్నా 5 రెట్లు, నిమ్మ, నారింజ పండుల్లో కంటే 10 రెట్లు అధికంగా జామలో లభిస్తాయి. జామ పండును తొక్కతో పాటు తినటం వల్ల ఇందులోని పీచు పదార్థం శరీరానికి మంచి చేస్తుంది.
చర్మ సౌందర్యంలో... 
చర్మసౌందర్యంలో జామపండు గుజ్జు అధిక ప్రాధాన్యం సంతరించుకుందని బ్యూటీషియన్లు అంటున్నారు. బొప్పాయి, టమోటా కంటే జామపండు గుజ్జుతో ఫేషియల్‌ చేసుకునేందుకు ఎక్కువమంది మహిళలు ఆసక్తి చూపుతునట్లు తెలిపారు. చర్మ సౌందర్యాన్ని పెంచటంతో పాటు నల్లటి మచ్చలను తొలగించే పోషకాలు జామ పండులో ఉన్నాయి.
ఆయుర్వేద వైద్యంలో జామ ఆకుల పాత్ర... 
జామ ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా వాడుతున్నారు. ప్రధానంగా తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, పంటినొప్పితో తరచు బాధపడుతున్న వారికి ఉపయోగించే ఆయుర్వేద మందుల్లో జామ ఆకుల పాత్ర కీలకం. జామ ఆకులను నీటితో శుభ్రం చేసి బాగా ఎండబెట్టిన తరువాత పొడిచేసుకుని మజ్జిగ, తేనెలో కలుపుకుని తినటం వల్ల సైనస్‌, మైగ్రేన్‌ (తలనొప్పి) తగ్గుతాయి.
పొట్టవద్ద పేరుకున్న కొవ్వును కరిగించే శక్తి జామ ఆకులకు ఉంది. జామ బెరడు బాగా శుభ్రం చేసి నీటిలో మరిగించి వడకట్టుకుని రెండు పుదీన ఆకులను అందులో వేసుకుని రోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి రక్తం శుద్ధి చేస్తుంది. పళ్ల సమస్యలుండేవారు రోజూ రెండు లేత జామ ఆకులు నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే జామ ఆకులు, పండ్లు తినడానికి ముందు వాటిని నీటితో బాగా శుభ్రం చేయాలని లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.


తీపి, వగరు, పులుపు.. మూడు రుచుల కలయిక జామ. పచ్చికాయ కోసుకుని రవ్వంత ఉప్పు, చిటికెడు కారం చల్లుకుని తింటే.. ఆ రుచి ముందు ఆపిల్‌ కూడా బలాదూర్‌. రుచి ఒక్కటే కాదు.. అత్యంత చౌకధరలో దొరికే జామలో ఖరీదైన పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. అవేంటంటే..
 మిగిలిన పండ్లలో కంటే విటమిన్‌ సి, ఇనుము జామలోనే అధికం. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లు రాకుండా జామ కాపాడుతుంది. ఎందుకంటే ఇందులోని విటమిన్‌ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి. పచ్చి జామ జ్యూస్‌ తాగితే మరీ మంచిది. 
లావు తగ్గడానికి రకరకాల ఖరీదైన మార్గాలను ఎంచుకున్నా కొన్నిసార్లు ఫలితం ఉండదు. రోజుకు ఒక జామపండు తింటే అధిక బరువు సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. జామలో ప్రొటీన్లు, విటమిన్లతో పాటు అధిక పీచుపదార్థం శరీరానికి లభిస్తుంది. ఇది జీర్ణప్రక్రియను చురుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
ఆపిల్స్‌, బత్తాయి, ద్రాక్షలతో పోలిస్తే.. పచ్చిజామలోనే షుగర్‌ తక్కువ మోతాదులో ఉంటుంది. మధుమేహులు తినడానికి ఏ ఇబ్బందీ ఉండదు.
మెదడులోని నరాలకు రక్తప్రసరణ సాఫీగా సాగడానికి విటమిన్‌ బి3, బి6 ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి రెండూ జామలో అధికం. జామలోని మెగ్నీషియం కండరాలకు, నరాలకు ఉపశమనం ఇస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి రోజుకొక జామ తింటే ఎంతో మేలు.
పళ్లనొప్పికి జామ ఆకు దివ్యౌషధం. పచ్చి జామ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లు, చిగుళ్లకు పట్టించుకుంటే.. నోటిలోని చెడు బ్యాక్టీరియా పోతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తద్వార పంటినొప్పి ఉండదు.
కంటి చూపునకు విటమిన్‌ ఎ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించడం సహజం. ఈ సమస్యలను అధిగమించడానికి క్యారెట్‌తోపాటు జామ చేసే మేలు అంతాఇంతా కాదు.
శరీరంలో తలెత్తే పలు సమస్యలకు మలబద్ధకం కారణం. ఎందుకంటే మనం తినే తిండిలో పీచుపదార్థాలు అతి తక్కువ. జామ ఆ సమస్యకు చెక్‌ పెడుతుంది. ఒక జామలో రోజుకు ఒక వ్యక్తికి కావాల్సిన పీచుపదార్థంలో సుమారు 12 శాతం లభించినట్లే.
గుండె ఆరోగ్యానికి సోడియం, పొటాషియం ముఖ్యమైనవి. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు దోహదం చేస్తాయవి. లేకుంటే అధిక ఒత్తిడికి గురైనప్పుడు హైపర్‌టెన్షన్‌ వంటివి చుట్టుముడతాయి. జామతో అది తగ్గుతుంది. దీంతోపాటు గుండెజబ్బులకు కారణమయ్యే ట్రైకోగ్లిజరైడ్స్‌, ఎల్‌డిఎల్‌ (చెడుకొవ్వు)లను అడ్డుకుంటుంది జామపండు. తద్వారా మంచి కొవ్వు (హెచ్‌డిఎల్‌) పెరుగుతుంది.




అనేక పోషకాలు కలిగి ఉన్న జామ పండు ఆరోగ్యానికి నిధి లాంటిది. విటమిన్‌- సి, కెరోటినాయిడ్స్‌, ఫోలేట్‌, పొటాషియం, పీచుపదార్థరం, క్యాల్షియం, ఐరన్‌.... ఇలా దాదాపు అన్ని విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండే అద్భుతమై పండు జామ. ఇందులో కొలెస్ట్రాల్‌, సోడియం అసలే ఉండవు. పైగా, రక్తంలో త్వరితంగా కరిగిపోయే పీచు, జామలో అధికంగా ఉంటుంది. అందుకే ఇది ర క్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. 
అయితే మధుమేహం ఉన్నవారు బాగా మగ్గిన పండ్లను కాకుండా దోరగా అప్పడే పక్వానికి వచ్చినవి మాత్రమే రోజుకు ఒకటి రెండు తినడం ప్రయోజనకరం. మలబద్ధకం నివారణలో జామ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. జామ కాయలో విటమిన్‌ సి చాలా ఎక్కువగా అంటే 100 గ్రాముల కాయలో సుమారు 300 మి. గ్రాముల విటమిన్‌ - సి లభిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే 6 కమలా పండ్లలో ఎంత సి- విటమిన్‌ ఉంటుందో బాగా పండి న ఒక్క జామ పండులో అంత ఉంటుంది.
క్యాల్షియం, పాస్పరస్‌లు కూడా ఇందులో సరిపడా లభిస్తాయి. మిగతా అన్ని పండ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల కంటే ఎక్కువగా లభించేది ఈ పండులోనే. ఇవి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో బాగా తోడ్పడతాయి ఇందులోని విటమిన్‌- ఏ కంటి చూపును పరిరక్షించడంతో పాటు చర్మ ఆరోగాన్ని కాపాడుతుంది. గౌటు వ్యాధి ఉన్న వారికి ఇది మంచి చేస్తుంది. దంతాల పటిష్టతకూ ఉపయోగపడుతుంది.
భోజనానికి ముందు ప్రతి రోజూ జామ పండు తినేవారిలో కొలెస్ట్రాల్‌ తగ్గుముఖం పడుతుంది ఇలా జామండును రోజు వారీ ఆహారంలో బాగం చేసుకుంటే రక్తనాళాలకు సంబంధించిన పలు ఇబ్బందులనుంచి బయటపడవచ్చు. పచ్చి కూరగాయలు తినేవారు జామ ముక్కలను చేర్చుకుంటే శ్వాసకోశాలు బాగా పనిచేస్తాయి. వయసు పైబడిన వారికి వచ్చే మతిమరుపు సమస్యను జామ వీలైనంత దూరం చేస్తుంది. అల్పాహారంతో పాటు జామ పండును తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు. ఎసిడిటీ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.


జామ పండు ఆరోగ్యప్రదాయని. ఇదో పోషకాల గని. ఒక్క జామపండు తింటే పది యాపిల్స్‌ తిన్నంత మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో విరివిగా లభించే జామపండ్లను తరుచూ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు నిగారింపును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. విటమిన్‌ సీ పుష్కలంగా లభ్యమయ్యే జామపండ్లను చిన్న పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు అందరూ తీసుకోవచ్చనీ, మధుమోహం, గుండెజబ్బులు ఉన్నవారు సైతం జామపండ్లను ఎంచక్కా తినవచ్చని స్పష్టంచేస్తున్నారు.
 
ఎన్నో ఉపయోగాలు..
జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. కళ్లకు రక్షణ ఇస్తుంది. కళ్ల మంటలు తగ్గుతాయి, కళ్ల కింద చారలు పోతాయి. వివిధ క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారం
త్వరగా జీర్ణమవుతుంది. దంతాలు, చిగుళ్లవాపు, గొంతు నొప్పిని అరికడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. వీటి గింజల్లో ఒమోగా-3 ఒమోగా-6 కొవ్వు అమ్లాలు, పీచు పదార్ధలు ఉంటాయి. మెగ్నీషియం, కెరబోనాయిడ్లు ఉండడంవల్ల దంత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని పీచు పదార్ధం మల్లబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. జామ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని నమిలితే పంటి నొప్పిలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. రోజుకో జామ పండు తినడం వల్ల ఎసిడిటీ, కడుపుఉబ్బరం, కడుపులో మంటలు తగ్గుతాయి. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.
 
ఏ బీ సీ విటమిన్లు..
జామ పండులో విటమిన్‌ ఏ, బీ, సీ విటమిన్లు ఉన్నాయి. క్యాల్షియమ్‌, పొస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలీక్‌యాసిడ్‌ మెండుగా లభిస్తాయి.
 
పోషకాలు బొలెడు..
100 గ్రాముల జామ పండులో 0.3గ్రాముల కొవ్వు , 0.9గ్రాముల ప్రొటీన్‌, 5.2 గ్రాముల పీచు పదార్ధం, 212 మిల్లీ గ్రాముల సీ విటమిన్‌, 5.5మిల్లీ గ్రాముల సోడియం, 91 మిల్లీ గ్రాముల ఇనుము, 51 కిలో కాల్యలరీల శక్తి లభిస్తాయి.




Wednesday 19 October 2016

Samee patram


Red coloured ganneru flowers


Kakara kaya




 కాకరకాయలో హైపోగ్లైసెమిక్‌ పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్‌ లెవల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తంను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది. కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకరకాయ ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్‌ల రసాన్ని, ఒక గ్లాసు బట్టర్‌మిల్క్‌తో కలిపి ప్రతి రోజు ఉదయం పరగడపున ఒక నెల రోజుల పాటు తీసుకుంటే పైల్స్‌ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్‌ బాగా ఉపకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది.

అనాదిగా ఆసియాలో ప్రసిద్ధిచెందిన పాదుమొక్క కాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది చేదుగా మొహం పెట్టేస్తారుగానీ కాకరకాయ మనదేశంలో ఎప్పటినుండో ఔషధంగా ఉపయోగపడుతోంది. సంప్రదాయ వంటకాల్లో వారానికి ఒకసారైనా కాకరకాయ కూర, కాకరకాయ పులుపు తినాలని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శరీరంలో సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు నిలయంగా మారుతున్న మనదేశంలో కాకరకాయరసం ఇప్పుడు ఇంటింటా దివ్యౌషధంగా మారింది. కాకరకాయ జ్యూస్‌ బ్లడ్ సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్‌ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్‌ బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి. దీని ఆకులు, పండిన కాయలు ఉడికించి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మొటిమలు, మచ్చల నివారిణి కూడా.


Kajji kayalu


Chana boiled



బ్లాక్‌ బెంగాల్‌ గ్రామ్‌ (నల్ల శనగ) డయాబెటిస్‌, గుండెజబ్బులున్న వారికి ఎంతో మంచిది. బరువు కూడా తగ్గుతారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న సూపర్‌ఫుడ్స్‌ ఇవి. 

పసుపులోని కుర్‌క్యుమిన్‌లో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇది కేన్సర్లు, ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, మల్టిపుల్‌ సిలరోసిస్‌, గుండెజబ్బులు, కడుపులో మంట, బొవెల్‌ సిండ్రోమ్‌లపై శక్తివంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో విటమిన్‌-సి, బి6లతోపాటు మెగ్నీషియం,సెలీనియం వంటివి ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కొలెసా్ట్రల్‌ పెరగకుండా నివారిస్తాయి. గుండెజబ్బులు, ఇన్ఫెక్షన్లు, రొమ్ముకేన్సర్‌, పెద్దప్రేవు కేన్సర్‌ వంటి కేన్సర్లను సైతం నిరోధిస్తాయి.

మెంతులు డయాబెటిస్‌ను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. ధమనులు ముడుచుకుపోకుండా నిరోధిస్తాయి. శరీరంలోని కొలెసా్ట్రల్‌, బిపిలను తగ్గిస్తాయి

Lemon rice


Carat pieces


White chrysnthymam


Guntakalagara or Guntakuraku



Sunday 16 October 2016

Jasmines and their natural / ayurvedic properties




మల్లెపూలు సువాసనకే కాదు, ఆరోగ్యానికీ మంచిదే అంటున్నారు నిపుణులు. మల్లెలతో తయారు చేసిన టీ షుగర్‌ పేషెంట్లకు మంచిదని వారు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపుచేసే శక్తి ఈ టీకి ఉంటుందనీ, షుగర్‌ పేషెంట్లు రోజుకు ఒకసారన్నా మల్లెపూలతో తయారు చేసిన టీ తాగడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చని వారు సూచిసున్నారు. అంతే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుందనీ, అధికబరువును అదుపులో ఉంచడానికి దోహదకారి అవుతుందని వారు చెబుతున్నారు. ఒక స్పూన్‌ టీ పొడికి ఏడురెట్లు సమానంగా తాజా మల్లెలు తీసుకొని ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసి గ్లాసు మరిగిన నీటిని పోసి కొద్దిసేపు మూత పెట్టాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి తేనె లేదా చక్కెర కలుపుకుని తాగాలని వారు సూచిస్తున్నారు. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తాగితే దీర్ఘకాలంగా బాధిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలకు కొంత వరకూ పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.