Friday 17 March 2017

Piles and remedies

తీవ్రమైన మలబద్ధకంలో బలవంతంగా మల విసర్జన చేస్తున్నప్పుడు పురీషనాళం దగ్గర ఉన్న రక్త నాళాలు ఉబ్బి చిట్లి మలంతో పాటు రక్తం కలిసి బయటకు పడుతుంది. ఈ సమస్యనే ఆయుర్వేదంలో ‘మూలవ్యాధి’ అంటారు. కొందరికి మలంతో పాటు రక్తం పడకుండా అధికమంట, పోటు, వాపు మాత్రమే ఉంటాయి. ఆధునిక వైద్యులు ఈ మొదటి రకం వ్యాధిని external piles అని, రెండవ రకాన్ని internal piles అని పిలుస్తారు. ఈ మూల వ్యాధిలో అధికంగా రక్తం బయటకు పోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రోగి బలహీన పడిపోతాడు. అశ్రద్ధ చేస్తే పురీషనాళం వాచి బయటకు పొడుచుకు వస్తుంది. ఇలాంటప్పుడు లైంగిక బలహీనతలు కూడా ఏర్పడతాయి. రక్తం బాగా బయటకు పోవడం వల్ల తీవ్ర స్థితిలో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. 

ప్రధాన కారణాలు 
తీవ్రమైన మలబద్ధకం, అజీర్ణం, అతికారం, పులుపు, మిర్చి, మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు తినడం, ఎక్కువగా నిద్రలేని రాత్రుళ్ళు గడపడం, కాలేయంలో విషపదార్థాలు చేరడం, శరీరానికి సరిపడని వ్యతిరేక పదార్థాలు తీసుకోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. 
మనశ్శాంతి లేకుండా చేసే ఈ వ్యాధిని అదుపు చేసే సులభ మూలికా చికిత్సలు తెలుసుకుందాం. 
ఫ ఒక టీ స్పూన్‌ ఉసిరికాయల చూర్ణం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముందు పాలలో గానీ మజ్జిగలో గానీ కలిపి తాగుతుంటే ఈ వ్యాధిలో రక్తం పడటం త్వరగా తగ్గి బాధ తగ్గుతుంది. 
ఫ ఒక టీ స్పూన్‌ నాగకేసరాల చూర్ణంలో ఒక టీ స్పూన్‌ చక్కెర కలిపి రోజూ ఉదయం, రాత్రి నీటిలో తాగుతుంటే త్వరగా వ్యాధి బాధ నుండి బయటపడతారు. అధిక రక్తస్రావం తగ్గిపోతుంది. 
అల్ల నేరేడు పండ్లను రోజూ ఉదయం కొద్దిగా ఉప్పులో అద్దుకుని తింటుంటే రెండు లేదా మూడు నెలలకు ఈ వ్యాధి తగ్గిపోతుంది. 
ఉత్తరేణి వేళ్ళను నీటిలో మెత్తగా నూరి, తేనె కలిపి ప్రతి రోజూ బియ్యం కడుగుతో తాగుతుంటే మూలవ్యాధి తగ్గుతుంది. 
ఉత్తరేణి గింజలను నీటిలో మెత్తగా నూరి, బియ్యం కడుగుతో కలిపి తాగితే రక్తం పడే మూల వ్యాధి తగ్గుతుంది. 
ఉసిరికాయలను ముక్కలుగా కోసి పెరుగు మీది తేటతో ఉడికించి తింటుంటే అతిగా రక్తం పోవడం ఆగిపోయి వ్యాధి శమిస్తుంది. 
బ్రహ్మమేడిపాలను మూలాలకు రాస్తూ భోజనంలో ఎక్కువగా నెయ్యి చేర్చి తింటుంటే మొలలు తెగి పడిపోతాయి. 
నీరుల్లి గడ్డలను కుమ్ములో ఉడికించి చక్కెర కలిపి తింటుంటే రక్తం పోవడం ఆగిపోయి వ్యాధి శమిస్తుంది. 

No comments:

Post a Comment