నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది.
నిమ్మలో దొరికినంత ‘సి’ విటమిన్ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు.
ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది.
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.
ఒక కప్పు హాట్ కాఫీ లేదా గరం చాయ్‌తో మన దినచర్య మొదలవుతుంది. కాఫీ, లేదా టీ అనేవి నిద్ర మత్తును వదిలించి యాక్టివ్‌గా చేస్తాయి. అయితే ఆరోగ్యపరంగాచూస్తే ఇంతకంటే మంచి డ్రింక్స్ తీసుకోవడం మేలుచేస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే బహుళ ప్రయోజనాలున్నాయి. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి. గోరువెచ్చటి నిమ్మ రసాన్ని పరగడుపున తీసుకుంటే శరీంలోని గ్యాస్ట్రోసిస్టం మెరుగు పడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రిషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన.. ఇది బరువు తగ్గలనుకునే వారికి దివ్య ఔషదం లాంటిది. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ముందు రోజు మసాలాలు, జంక్‌ఫుడ్ లాంటివి తినివుంటే ఉంటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు లాంటివి రాకుండా ఉంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మ రసం తాగడం వలన కడుపు శుభ్రపడి ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఉదయాన్నే నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యం హాయిగా ఉంటుందని అనుకుంటాం! కానీ ఈ పానీయం తయారు చేసుకునే పద్ధతి ఇది కాదు. ఈ పానీయం పూర్తి ఫలం దక్కాలంటే, ఇదిగో ఈ పద్ధతి అనుసరించాలి.
కావలసినవి:
నిమ్మకాయలు - 6, నీళ్లు - 3 కప్పులు, తేనె 2 టేబుల్ స్పూన్లు ఎలా కలపాలంటే?
- నిమ్మకాయలను అడ్డంగా కోసి నీళ్లలో వేసి ఐదు నిమిషాలపాటు మరిగించాలి.
- ఈ నీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి.
- ఇప్పుడు నిమ్మ బద్దల్ని పిండి నీళ్ల నుంచి తీసేయాలి.
- ఈ నీళ్లను వడగట్టుకోవాలి.
- ఒక కప్పు నీళ్లలో తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
మేళ్లు ఇవే!
ఇలా క్రమం తప్పక చేస్తే జీర్ణశక్తి మెరుగవడంతోపాటు, రోగ నిరోధకశక్తీ పెరుగుతుంది, శరీరంలోని పిహెచ్ లెవెల్స్ సమం అవుతాయి. ఇవే కాకుండా....
- మూత్రనాళం శుభ్రపడుతుంది. ఫ బరువు తగ్గుతారు. ఫ రక్తపోటు అదుపులోకొస్తుంది. ఫ గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
- చర్మం ముడతలు తగ్గి, మెరుపు సంతరించుకుంటుంది.
No comments:
Post a Comment